S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

01/12/2018 - 06:46

చిల్లర వ్యాపారంలో విస్తరించిపోతున్న ‘విదేశీ ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యం’ గురించి కేంద్రప్రభుత్వం సర్వసమగ్రమైన ‘వివరణ పత్రం’ - వైట్‌పేపర్ - ఇప్పుడైనా విడుదల చేయాలి! ఎందుకంటె ‘‘చిల్లర వ్యాపారంలోకి విదేశీయులు చొరబడిపోవడానికి వీలుగా ‘‘మన్‌మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని ‘కాంగ్రెస్’ ప్రభుత్వం రూపొందించి అమలు జరిపిన విధానం ఇప్పటికీ కొనసాగుతోంది...

01/10/2018 - 21:55

ఇప్పుడు, ఇంతకాలానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ ఇవ్వవలసి రావడం దురదృష్టకరం!! ‘జనగణమన’ములందు మాతృభూమి పట్ల మమకార తరంగనాదం జాతీయ గీతం! అమ్మకు నమస్కరించమని ఎవ్వరూ ఎవరికీ ఉపదేశించనక్కర లేదు. అమ్మను గౌరవించాలన్న భావం విచక్షణ వికసిస్తున్న ప్రతి హృదయంలోను, పరిమళించే స్వభావం!

01/10/2018 - 00:58

చాలా తెలివిగా ప్రభుత్వాలను ప్రజలను బోల్తా కొట్టించగలిగామని సంబరపడిపోతున్న ‘పద్మావత్’ - ‘పద్మావతి’ - హిందీ చిత్ర నిర్మాతలకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం బహుశా ఊహించని ఎదురుదెబ్బ! జనవరి 25వ తేదీన తమచిత్రం విడుదల కాగలదని చిత్రాన్ని నిర్మించిన బౌద్ధిక బీభత్సకారులు - ఇంటలెక్చువల్ టెర్రరిస్ట్‌లు - ఆర్భాటంగా చేస్తున్న ప్రకటనలు వారి అత్యాశకు నిదర్శనం.

01/08/2018 - 23:58

సాయుధ సమర సంపత్తిని ఆధునీకరించుకోవాలన్న సైనిక దళాల ప్రధాన అధికారి విపిన్ రావత్ ఆకాంక్షలకు ‘అరిహంత’ జలాంతర్గామి గాయపడిందన్న ప్రచారం విచిత్రమైన నేపథ్యం. రక్షణ అవసరాల దిగుమతులను తగ్గించివేయడానికి వీలుగా స్వదేశీయ రక్షణ ఉత్పత్తులు జరగాలన్నది సోమవారం జరిగిన రక్షణ వ్యవహారాల సదస్సులో రావత్ చెప్పినమాట! ఇది ‘్భరత్‌లో నిర్మించండి’ - మేక్ ఇన్ ఇండియా - స్ఫూర్తికి అనుగుణం!

01/08/2018 - 02:30

అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనీయ మూకలు చొరబడడం చైనా సాగిస్తున్న భౌతిక, వ్యూహాత్మక దురాక్రమణ చరిత్రలో సరికొత్త ఘట్టం. యాబయి ఐదు ఏళ్ల క్రితం చైనా మనదేశంలోకి చొరబడి లడక్‌లోను, ఇతర ప్రాంతాలలోను దాదాపు యాబయి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని దురాక్రమించింది!

01/06/2018 - 01:27

అమెరికా చర్య తీసుకుంది.. ఐదారు సంవత్సరాలుగా హెచ్చరికలతోను బెదరింపులతోను ‘‘సరిపుచ్చిన’’ అమెరికా ప్రభుత్వం శుక్రవారం పాకిస్తాన్‌పై ‘బ్రహ్మాస్త్ర’ ప్రయోగం చేసింది, పాకిస్తాన్‌కు అందజేస్తున్న ‘రక్షణ సహాయం’ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జిహాదీ ఉగ్రకలాపాలకు పాకిస్తాన్ ప్రభుత్వం పాల్పడుతున్నంతకాలం ఈ ‘రక్షణ నిధి’ని అందచేయరాదన్నది అమెరికా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన నిర్ణయం..

01/05/2018 - 00:52

ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు వివిధ రకాల అక్రమాలకు పాల్పడుతుండడం గురించి ఏళ్ల తరబడి చర్చ జరుగుతోంది! దాదాపు నాలుగువేల తొమ్మిది వందల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు - నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ - ‘ఎన్‌జిఓ’లు - విదేశీయ నిధులను స్వీకరించకుండా కేంద్రప్రభుత్వం కొత్తగా నిర్ధారించడంతో ఈ ‘అక్రమాల’ పట్ల మరోసారి ప్రజల ధ్యాస పెరిగింది.

01/03/2018 - 21:47

పతంగ్‌లు - గాలిపటాలు - చైనా నుంచి దిగబడిపోతుండడం మరో చర్చా వైపరీత్యం! కొండనాలుకకు మందేయమంటే ఉన్న నాలుకను ఊడబెరికాడు - అన్నది సామెత! ఈ సామెత చైనాతో మన వాణిజ్య సంబంధాలకు చక్కగా అన్వయవౌతోంది. చైనా నుండి దిగుమతి అవుతున్న ‘ప్లాస్టిక్’ దారం - మాంజా - వల్ల జరుగుతున్న అనర్థాల గురించి గత నాలుగేళ్లుగా ప్రచారమైంది. ఈ ‘మాంజా’ను వాడరాదన్న ప్రభుత్వపు ఉత్తరువులు అమలు జరగడం లేదన్నది బహిరంగ రహస్యం.

01/03/2018 - 00:38

అస్సాంలో ‘జాతీయ జన సూచిక’ - నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్స్ - ఎన్‌ఆర్‌సి - మొదటి ముసాయిదాను ప్రచురించడం విదేశీయ అక్రమ ప్రవేశకులను పసికట్టడానికి జరుగుతున్న కృషికి దోహదం చేయగలదు. అయితే అక్రమ ప్రవేశకులు అందరూ బయటపడగలరా? అన్నది ఉత్కంఠను కలిగిస్తున్న వాస్తవం..!

01/02/2018 - 00:25

భాషతో భావజాలం విజ్ఞానం సహజంగానే అనుసంధానమై ఉన్నాయి, విజ్ఞానం వికాసంతో అంతే సహజంగా అనుసంధానమై ఉండడం సృష్టిగతమైన సనాతన వ్యవస్థ. ఈ సనాతన - శాశ్వతమైన - సత్యాన్ని ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం పునరావిష్కరించారు! భారతీయ జీవన విధానం అనాదిగా ఈ సృష్టిగత వాస్తవ భూమికపై వికసించడం చరిత్ర! సృష్టిగత వాస్తవం సమాజస్థితంగా ప్రస్ఫుటించడం హైందవ జాతీయ ప్రస్థానం!

Pages