S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

01/24/2018 - 22:21

జాతీయ సమస్యలపై జాతి మొత్తం ఏకాభిప్రాయం కలిగి ఉండకపోవడం ప్రధానమైన వైపరీత్యం. ‘పద్మావత్’ సినిమా గురించి దేశంలోని వివిధ ప్రాంతాల ప్రభుత్వాలు, ప్రజలు పట్టించుకోకపోవడం ఈ వైపరీత్యానికి మరో నిదర్శనం. ‘పద్మావత్’ హిందీ సినిమా విడుదల అవుతుందా? కాదా! అన్న మీమాంసకు ఇప్పుడు తావులేదు. సర్వోన్నత న్యాయస్థానం ఈ సినిమాను విడుదల చేసి ప్రదర్శించవచ్చునని పదేపదే స్పష్టం చేసింది కాబట్టి ఈ మీమాంస ముగిసిపోయింది!

01/24/2018 - 01:26

వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని మానవ జీవన ప్రశాంత ప్రగతి ప్రస్థానం భారతీయుల సనాతన - శాశ్వత - సంస్కారం! ఈ సమన్వయ సంస్కారాన్ని ప్రపంచంలోని వివిధ దేశాలవారు అలవరచుకోవాలన్నది మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్విట్జర్లాండ్‌లోని ‘దావోస్’ ప్రాంగణంలో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక సమాఖ్య మహా సమ్మేళన ప్రారంభ సమావేశంలో చేసిన ప్రసంగంలోని ఇతివృత్తం!

01/23/2018 - 00:41

గ్రామీణ ప్రాంతాలలోని బాలబాలికలు యువజనులు ‘ఇంగ్లీషు’ నేర్చుకొనడానికి ఎక్కువ మక్కువను చూపిస్తున్నారట! హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నడుస్తున్న ‘ప్రశాంతి విద్యానికేతన్’ అన్న పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుండిన పి.అంజలి అనే ఆరేళ్ల పాప నిర్వాహకుల క్రూరమైన నిర్లక్ష్యం కారణంగా శనివారం బస్సులోనుండి పడిపోయి అకాల మరణంపాలైంది!

01/22/2018 - 01:02

సౌదీ అరేబియాలోను, ఆ దేశానికి పొరుగున ఉన్న అరబ్బీ దేశాలలోను ప్రవాస భారతీయులు అమానుష వివక్షకు పాశవిక చిత్రహింసలకు గురి అవుతుండడం గురించి మనదేశంలో పెద్దగా ప్రచారం కావడం లేదు. ఉపాధి కోసం సౌదీ అరేబియా, కువాయిత్, ఖతార్, సమైక్య అరబ్ సంస్థానాలు - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - యూఏఈ-వంటి దేశాలకు వెళ్లిన భారతీయులకు ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలు వేతనాలు చెల్లించకపోవడం సర్వసాధారణమైపోయింది.

01/20/2018 - 01:09

చతురస్ర దేశాల కూటమి ప్రతినిధులు చైనా దురాక్రమణ వ్యూహాన్ని నిరసించడానికి ‘డోక్ లా’ - డోక్‌లామ్ - లో చైనీయుల ‘తిష్ఠ’ కొనసాగుతుండడం విచిత్రమైన నేపథ్యం. డోక్‌లా ప్రాంతం నుంచి గత ఆగస్టులో తోకముడిచిన చైనా తోడేలు మళ్లీ గోడ దూకిందన్న ‘ప్రచారం’ అంతుపట్టని ఈ విచిత్రం!

01/19/2018 - 00:52

గంగాస్నానం, తుంగాపానం - అన్నది యుగయుగాల భారతీయుల జీవన లక్ష్యం... ‘గంగ’తో ‘తుంగ’ అనుసంధానమై ఉండడం భౌతిక వైవిధ్యాల మధ్య నిహితమై ఉన్న సనాతన సాంస్కృతిక ఏకాత్మ స్వభావం. దేశంలోని నదులను అనుసంధానం చేయడం ద్వారా దేశమంతటా పుష్కలంగా నీటిని సమకూర్చాలన్నది వర్తమాన లక్ష్యం!

01/18/2018 - 01:08

భారత టిబెట్ సరిహద్దు రక్షక దళం - ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ - ఐటిబిపి - లో ‘గగననిఘా’ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం భద్రతాపటిమను పెంచగల పరిణామం! కానీ దశాబ్దుల తరబడి ‘ఐటిబిపి’లో ఈ ‘వైమానిక విభాగం’ ఏర్పడలేదన్నది విస్మయకరమైన వాస్తవం.. దాదాపు లక్ష అరవైవేల ‘రైఫిళ్ల’ను ‘కార్బయిన్ల’ను కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు నిర్ణయించిదట!

01/17/2018 - 00:55

మన దేశపు రాజధానిలో నెలకొని ఉన్న ‘తీన్‌మూర్తి’ స్మారక కేంద్రాన్ని ‘తీన్‌మూర్తి - హయిఫా’ స్మృతి చిహ్నంగా ప్రకటించడం వందేళ్ల చరిత్రకు అద్భుతమైన పునరావృత్తి.. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మనదేశంలో అధికార పర్యటన కోసం ఆదివారం కొత్త ఢిల్లీకి అరుదెంచిన వెంటనే ‘తీన్‌మూర్తి’కి వెళ్లి ‘హయిఫా’ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు అంజలి ఘటించడం హీబ్రూల కృతజ్ఞతా స్వభావానికి అద్దం!

01/15/2018 - 00:53

సృష్టిగత ‘ప్రస్థాన క్రమం’లో సంవత్సరానికోసారి సంభవించే పునరావృత్తి మకర సంక్రాంతి, వెలుగుల విక్రాంతి! కాంతి పథంలో నిరంతరం క్రాంతి సంభవిస్తోంది, భూమి నుండి దర్శించినప్పుడు సాపేక్షం - రిలెటివ్ - గా ఈ ‘ఖగోళ క్రాంతి’ నెలకోమారు మరింతగా ప్రస్ఫుటిస్తోంది. అందువల్ల, భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల, పనె్నండు నెలలలో పనె్నండు సంక్రాంతులు సంభవిస్తున్నాయి!

01/13/2018 - 01:11

శాంతంగా మనుగడను సాగించాలి, అసత్యమును వదలి సత్యాన్ని మాట్లాడాలి, గుర్తించాలి.. చీకటి నుండి వెలుగులోనికి పయనించాలి, అశాశ్వత స్థితిని అతిగమించి శాశ్వతత్వాన్ని పొందాలి - అని ఆకాంక్షించడం మతోన్మాదమని ప్రచారం జరుగుతోంది! ఈ భావం సంస్కృతభాషలో - ‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృంతంగమయ! ఓం శాంతిః శాంతిః శాంతిః!’ - అని అభివ్యక్తవౌతుండడం ఇందుకు ప్రధాన కారణం.

Pages