S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/05/2018 - 00:30

సెంచూరియన్, ఫిబ్రవరి 4: టెస్టు సిరీస్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో దక్షిణాఫ్రికాను టీమిండియా గడగడలాడిస్తున్నది. ఆదివారం జరిగిన రెండో వనే్డలో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి, ఆరు మ్యాచ్‌ల సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. భారత స్పిన్‌కు దాసోహమన్న దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది.

02/05/2018 - 00:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కోట్లకు పడగలెత్తిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) వెబ్‌సైట్ నిలిచిపోయింది. సాంకేతిక లోపాలే కారణమని అనుకుంటే పొరపాటే. నిజానికి డొమైన్‌ను సకాలంలో రెన్యువల్ చేయించుకపోవడంతో ఈ వెబ్‌సైట్‌ను స్తంభింప చేశారు. ఈ డొమైన్‌ను నిర్వహించే హక్కుల కోసం బీసీసీఐ వేలం నిర్వహించినప్పుడు, 270 డాలర్ల మొత్తం లభించింది.

02/05/2018 - 00:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పోరాటం రన్నరప్ ట్రోఫీతో ముగిసింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో ఆమె జాంగ్ బీవెన్ చేతిలో 18-21, 21-11, 20-22 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. టైటిల్‌ను కోల్పోయినప్పటికీ, చివరి వరకూ ఆమె జరిపిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది. కాగా, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యుకీ సాధించాడు.

02/05/2018 - 00:24

కోల్‌కతా, ఫిబ్రవరి 4: భారత అండర్-19 జట్టు ఆటగాళ్లు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రత్యేకతను చాటుకున్నారని లెజండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ప్రశంసించాడు. కోల్‌కతా ఫుల్ మారథాన్‌ను ఆదివారం ప్రారంభించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అండర్-19 వరల్డ్ కప్ కోసం పృథ్వీ షా నాయకత్వంలోని భారత జట్టు మానసికంగా, శారీరకంగా సిద్ధమైన తీరు శ్లాఘనీయమని అన్నాడు.

02/05/2018 - 00:22

దుబాయి, ఫిబ్రవరి 4: ఐసీసీ అండర్-19 టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి, ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత యువసేనలో ఐదుగురికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వరల్డ్ వనే్డ ఎలెవన్‌లో చోటు దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ఇక్కడ ప్రకటించింది. వౌంట్ మాంగనూయిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ అఖండ విజయం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

02/05/2018 - 00:19

సెంచూరియన్, ఫిబ్రవరి 4: భారత జట్టు విజయానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నప్పుడు ఆటను నిలిపేసిన అంపైర్లు భోజన విరామాన్ని ప్రకటించడంపై విమర్శలకు తావిస్తున్నది. దక్షిణాఫ్రికాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌లో 119 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన భారత్ ఒక వికెట్ నష్టమపోయ 117 పరుగులు చేసింది.

02/05/2018 - 00:17

దక్షిణాఫ్రికా, ఫిబ్రవరి 4: మహిళా క్రికెట్ ప్రపంచంలో 2021 ప్రపంచ కప్‌లో పాల్గొనే అర్హత కోసం వేటను మొదలుపెట్టనుంది. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో హోరాహోరీగా పోరాడనుంది. అందులో భాగంగా సోమవారం నాటి మొదటి మ్యాచ్‌కి అన్ని విధాలా సిద్ధమైంది. ఈ సిరీస్‌లో గెలిచిన జట్టు 2021 వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సంపాదిస్తుంది.

02/05/2018 - 00:17

చిట్టగాంగ్, ఫిబ్రవరి 4: శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మోమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో రాణించడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

02/04/2018 - 01:34

‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ శిక్షణలో రాటుదేలిన పృథ్వీ షా కెప్టెన్సీలోని భారత అండర్-19 జట్టు తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో పటిష్ఠమైన ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసి, టీమిండియా భవిష్యత్తు ఈ యువ ఆటగాళ్ల చేతిలో పదిలంగా ఉంటుందని నిరూపించింది. మొదట బౌలర్ల విజృంభణతో

02/04/2018 - 00:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: అండర్-19 ప్రపంచ కప్‌ను సాధించిన భారత యువ సేనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వేర్వేరుగా అభినందించారు. భారత జట్టు సాధించిన ఘనతను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని ట్వీట్ చేశారు.

Pages