S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/06/2018 - 00:48

సిడ్ని, ఫిబ్రవరి 5: ఆస్ట్రేలియా మాజీ పేసర్ డౌగ్ బొలింజర్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 36 ఎళ్ల బొలింజర్ 12 టెస్టుల్లో 50 వికెట్లు తీసుకున్నాడు. 39 వనే్డల్లో 62 వికెట్లు పడగొట్టాడు. అతను తొమ్మిది టీ-20 ఇంటర్నేషనల్స్‌లోనూ ఆడాడు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో న్యూ సౌత్ వేల్స్‌కు బొలింజర్ ప్రాతినిథ్యం వహించాడు. .

02/06/2018 - 00:46

అలొర్ సెటార్ (మలేషియా), ఫిబ్రవరి 5: సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్ ప్రణయ్ గాయాల కారణంగా దూరంకాగా, మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆసియా టీం చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు విజయాన్ని అందించాల్సిన భారం తెలుగు తేజాలు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌పై పడింది. మే 20 నుంచి 27 వరకు థామస్, ఉబర్ కప్ చాంపియన్‌షిప్స్ జరగనున్న నేపథ్యంలో, ఆసియా టీం చాంపియన్‌షిప్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

02/06/2018 - 00:46

ముంబాయి, ఫిబ్రవరి 5: నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌సీఐ)లో మంగళవారం నుండి వేదాంత ఇండియన్ స్క్వాష్ ఓపెన్-2018 టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఆరు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో పది దేశాలకు చెందిన 30 మంది మేటి క్రీడాకారులు పాల్గొంటున్న కారణంగా, ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేగాక, ఏడు దేశాలకు చెందిన ఆర్హత పొందిన 16 మంది ఆటగాళ్లు ఈనెల 8 నుంచి జరుగనున్న మెయిన్ డ్రాలో పోటీపడతారు.

02/06/2018 - 00:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: కాంట్రాక్టును సకాలంలో పొడిగించుకోని కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన బీసీసీఐ వెబ్‌సైట్ తిరిగి మొదలైంది. వెబ్‌సైట్‌కు బిడ్డింగ్‌ను పిలిచి, 2019 వరకూ కాంట్రాక్టును కూడా ఇచ్చేసిన బీసీసీఐ వెబ్ నిర్వాహకులతో తన ఒప్పందాన్ని మాత్రం పొడిగించుకోలేదు. ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ మీడియాలో వార్తలు వెలువడడంతో బీసీసీఐ అధికారులు స్పందించారు.

02/06/2018 - 00:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కేంద్ర కార్యాలయం ముంబయి నుంచి బెంగళూరుకు మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ కార్యాలయం ఉంది. అయితే, బెంగళూరులో సుమారు 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ)కు దీనిని తరలించారన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నది.

02/06/2018 - 00:45

సెంచూరియన్, ఫిబ్రవరి 5: దక్షిణాఫ్రికా పిచ్‌లపై భారత జట్టులోని యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో అద్భుతం సృష్టించారని సహచర జట్టు ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ప్రశంసించాడు. గతంలో రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా వంటివారు ఒక ఏడాది జరిగిన ఎలాంటి ఫార్మాట్‌లోనైనా తమ ఆటతీరుతో ఓ ప్రత్యేకతను కనబరిచేవారని అన్నాడు.

02/06/2018 - 00:43

సెంచూరియన్, ఫిబ్రవరి 5: భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టుమ్యాచ్‌తోపాటు రెండు వనే్డలలో ఓటమిపాలైన ఆతిధ్య జట్టు దక్షిణాఫ్రికా పిచ్‌లను ఎంతో బాగా తీర్చిదిద్దినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని మాజీ కోచ్ రే జెన్నింగ్స్ వ్యాఖ్యానించాడు. పిచ్‌లు తమకు ఎంతో అనుకూలంగా ఉంటాయని విర్రవీగిన టీమ్ మేనేజిమెంట్ దాదాపు సిరీస్‌ను కోల్పోయే దశకు చేరుకుందని వ్యాఖ్యానించాడు.

02/06/2018 - 00:42

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 5: లక్స్‌ంబర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) ప్రపంచ జూనియర్ సర్కూట్‌లో భారత ఆటగాడు మానవ్ ఠక్కర్‌కు రజత పతకం లభించింది. ఫైనల్లో అతను అమెరికాకు చెందిన టాప్ సీడ్ కనక్ ఝా చేతిలో 3-4 తేడాతో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీని స్వీకరించాడు. ఏడు సెట్‌ల ఈ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగి, అభిమానులను ఆకట్టుకుంది.

02/06/2018 - 00:41

కేప్ టౌన్, ఫిబ్రవరి 5: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును గాయాల సమస్య వేధిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్, డివిలియర్స్ చేతి వేలి గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉండడంతో మిగిలినవారితోనే రెండు వనే్డలలో తలపడింది. ఈ ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు తోడుగా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ క్వింటాన్ డి కాక్ కూడా ఎడమచేతి గాయం వల్ల మిగిలిన నాలుగు వనే్డలలో ఆడడం సాధ్యంకాదు.

02/06/2018 - 00:41

పారిస్, ఫిబ్రవరి 5: ప్రపంచ ఫుట్‌బాల్‌లో హీరోగా ఎదిగిన నేమార్ జన్మదిన వేడుకల్లో పలువురు స్టార్ ఆటగాళ్లు సందడి చేశారు. బ్రెజిల్ మాజీ సూపర్‌స్టార్ రొనాల్డో ఆధ్వర్యంలో సెంట్రల్ పారిస్ గ్లిట్జీ రిసెప్షన్ కేంద్రంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పారిస్ సెయింట్-జర్మన్ స్టార్ ఆటగాళ్లతోపాటు అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్నారు.

Pages