S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/09/2018 - 00:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రతిష్ఠాత్మక ఫెడ్ కప్ ఆసియా/ఓషియానిగా గ్రూప్-1 ప్లే ఆఫ్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో కజకస్థాన్ చేతిలో భారత్ 1-2 తేడాతో పరాజయాన్ని చవిసింది. జపాన్‌తో పోరాడి గెలిచిన విధంగానే అంకిత రైనా కజక్‌పైన కూడా పూర్తి ఆధిపత్యాన్ని కనబరచి, విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మొదటి మ్యాచ్‌లో జరినా డయాస్‌తో తలపడిన కర్మాన్ కౌర్ థండి 0-6, 4-6 తేడాతో ఓటమిపాలైంది.

02/09/2018 - 00:24

కేప్ టౌన్, ఫిబ్రవరి 8: మైదానంలో తనదైన స్టయిల్‌లో ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్ల బంతులను తుత్తినియలు చేసే భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరును వేనోళ్ల పొగడనివారు ఉండరు. బ్యాటింగ్ చేస్తున్నపుడు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ఆడడమే తన ముందున్న కర్తవ్యమని అతను అన్నాడు.

02/08/2018 - 05:08

సియోల్, ఫిబ్రవరి 7: ఉత్తర కొరియా ఛీర్‌లీడర్లు దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తమ అథ్లెట్లను ప్రోత్సహించడానికి 229 మంది ఛీర్‌లీడర్లుసహా మొత్తం 280 మంది బుధవారం సియోల్ విమానాశ్రయంలో దిగారు.

02/08/2018 - 05:03

షార్జా, ఫిబ్రవరి 7: జింబాబ్వేతో జరిగిన చివరి, రెండో టీ-20 ఇంటర్నేషనల్‌ను 17 పరుగుల తేడాతో గెల్చుకున్న అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. మహమ్మద్ నబీ విజృంభణ అఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 158 పరుగులు సాధించింది.

02/08/2018 - 03:27

హోబర్ట్, ఫిబ్రవరి 7: న్యూజిలాండ్ కూడా పాల్గొంటున్న ముక్కోణపు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. గ్లేన్ మాక్స్‌వెల్ మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు అజేయ శతకంతో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచి ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది.

02/08/2018 - 03:25

కింబర్లీ, ఫిబ్రవరి 7: దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టును స్ఫూర్తిగా తీసుకున్న మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ 178 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. స్మృతి మందానా సూపర్ సెంచరీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.

02/08/2018 - 03:24

కేప్ టౌన్, ఫిబ్రవరి 7: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో వనే్డ ఇంటర్నేషనల్‌ను కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా గెల్చుకొని, ఆరు మ్యాచ్‌ల సిరీస్‌పై 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ అజేయ శతకంతో కదంతొక్కగా, దక్షిణాఫ్రికాలో భారత జట్టు మొదటిసారి వరుసగా మూడు వనే్డల్లో విజయాలను నమోదు చేసింది.

02/07/2018 - 04:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రపంచ క్రికెట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఎవరికీ తీసిపోరని ఆయన నాయకత్వ పటిమ స్పూర్తిదాయకమని క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కోహ్లీ బాడీ లాంగ్వెజ్ కూడా ఆయన దూకుడుకు, ఆట తీరుకు అద్దం పట్టేదిగానే ఉంటుందని ప్రశంసించాడు.

02/07/2018 - 04:54

కేప్ టౌన్, ఫిబ్రవరి 6: కరేబియన్ గడ్డపై రెండు వనే్డలలో గెలుపుతో మంచి ఊపుమీద ఉన్న భారత్ క్రికెట్ సేన బుధవారం జరిగే మూడో మ్యాచ్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఆరు వనే్డల సిరీస్‌లో పోటీపడుతున్న ఇరు జట్లలో డర్బన్, సెంచూరియన్‌లలో జరిగిన రెండు మ్యాచ్‌లలో అఖండ విజయం సాధించడం ద్వారా ఇప్పటికే భారత్ ఆధిపత్యం దిశగా పయనిస్తోంది.

02/07/2018 - 04:51

హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడాంశాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) సత్కరించనుంది. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రోత్సాహంతో పాటు వారికి సరైన శిక్షణ, నిష్ణాతులైన కోచ్‌లతో తర్ఫీదునివ్వడం కోసం ఎంతో కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Pages