S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/07/2018 - 04:51

సెంచూరియన్, ఫిబ్రవరి 6: డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులను భయపెడుతూ ఆటపట్టించే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దే వ్యక్తి అవసరం ఉందని దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రే జెన్నింగ్స్ అన్నాడు. కోహ్లీ అండర్-19లో ఆడినప్పటి నుంచి ప్రత్యక్షంగా స్వయంగా చూస్తూ వచ్చిన జెన్నింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్‌గా వ్యవహరించడంతో కోహ్లీలో ఎన్నో అంశాలను గమనించాడు.

02/07/2018 - 04:49

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రపంచ క్రికెట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఎవరికీ తీసిపోరని ఆయన నాయకత్వ పటిమ స్పూర్తిదాయకమని క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కోహ్లీ బాడీ లాంగ్వెజ్ కూడా ఆయన దూకుడుకు, ఆట తీరుకు అద్దం పట్టేదిగానే ఉంటుందని ప్రశంసించాడు.

02/07/2018 - 04:49

కింబర్లే, ఫిబ్రవరి 6: దక్షిణాఫ్రికా జరుగుతున్న మూడు వనే్డ సిరీస్‌లలో భాగంగా ఇప్పటికే జరిగిన తొలి వనే్డ మ్యాచ్‌లో గెలుపు ద్వారా మంచి ఉత్సాహంతో భారత మహిళా జట్టు బుధవారం జరిగే రెండో వనే్డపై దృష్టి సారించింది. ఏడు నెలల విరామం తర్వాత భారత మహిళా జట్టు ఆడుతున్న వనే్డలలో విజయంతో త్వరలో జరుగబోయే ప్రపంచ కప్‌లో చోటుదక్కించుకునేందుకు కెప్టెన్ మిథాలీరాజ్ నేతృత్వంలోని జట్టు ఎంతో కృషిచేస్తోంది.

02/07/2018 - 04:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశ యువతీ యువకులకు అన్ని క్రీడల్లోనూ క్రమశిక్షణాయుతమైన తర్పీదునిచ్చి వారిని తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఖేలో ఇండియాను మరి కొనే్నళ్ల పాటు విస్తరించాలని కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా భవిష్యత్‌లో మహిళల చాంపియన్‌షిప్‌లనూ చేరుస్తామని క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ మంగళవారంనాడిక్కడ ప్రకటించారు.

02/06/2018 - 00:56

ముంబయి, ఫిబ్రవరి 5: ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి, వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నప్పటికీ, అది తమ ఆటగాళ్ల నంబర్ వన్ గేమ్ ఎంతమాత్రం కాదని భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.

02/06/2018 - 00:54

సెంచూరియన్, ఫిబ్రవరి 5: విరాట్ కోహ్లీ నాయకత్వంలో దక్షిణాఫ్రికాపై భారత పురుషుల క్రికెట్ జట్టు వరుసగా రెండు వనే్డలను గెల్చుకోగా, అదే స్ఫూర్తితో మిథాలీ రాజ్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు బోణీ చేసింది. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వనే్డని 88 పరుగుల తేడాతో గెల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది.

02/06/2018 - 00:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత ల్యూగర్ శివ కేశవన్ ఈనెల తొమ్మిది నుంచి 25వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని పయాంగ్‌చాంగ్ ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున ల్యూగ్‌లో పోటీపడుతున్న ఏకైక ఆటగాడు కేశవన్ ఆరోసారి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు దక్షిణ కొరియా బయలుదేరుతున్న తరుణంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్‌కు సెలవు ప్రకటించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.

02/06/2018 - 00:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: తనపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించడాన్ని సవాలు చేస్తూ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కు నోటీసు జారీ చేసింది. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ శ్రీశాంత్ వేసిన కేసుపై నాలుగు వారాల్లోగా స్పందించాలని బీసీసీఐని ఆదేశించింది.

02/06/2018 - 00:51

ముంబయి, ఫిబ్రవరి 5: న్యూజిలాండ్‌లో జరిగిన ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న పృథ్వీ షా నాయకత్వంలోని భారత జట్టుకు ముంబయి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధికారులు కెప్టెన్ పృథ్వీ షా, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు ఇతర సభ్యులకు సాదరంగా ఆహ్వానం పలికారు.

02/06/2018 - 00:49

చిట్టగాంగ్, ఫిబ్రవరి 5: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సబ్బీర్ రహమాన్‌కు బంగ్లాదేశ్ టెస్టు జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో ఈనెల 8 నుంచి మొదలుకానున్న రెండో టెస్టులో సున్జాముల్ ఇస్లాం స్థానంలో అతనిని జట్టులోకి తీసుకున్నారు. సున్జాముల్‌తోపాటు రూబెల్ హొస్సేన్, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడాగాయాలతో బాధపడుతున్న కారణంగా రెండో టెస్టుకు అందుబాటులో ఉండరు.

Pages