S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/22/2017 - 22:47

న్యూఢిల్లీ, నవంబర్ 22: క్రికెటర్లకు కూడా డోప్ పరీక్షలను నిర్వహించాలన్న జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) చేసిన డిమాండ్‌ను తిరస్కరించినప్పటికీ, దాని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోన్న అనుమానం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)ని వేధిస్తున్నది. అందుకే ఈ అంశంపై ఇప్పటికే వివిధ దశల్లో చర్చలు జరుపుతున్నది.

11/22/2017 - 22:46

యాషెస్‌లో భారీ విజయాల జాబితాలోని మొదటి మూడు స్థానాల్లో రెండు ఇంగ్లాండ్ ఖాతాలో చేరాయి. 1938లో ది ఓవల్ మైదానంలో ఆ జట్టు ఇన్నింగ్స్ 579 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. 1946 నవంబర్‌లో బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టును ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 332 పరుగుల తేడాతో కైవసం చేసుకోగా, 1892 అడెలైడ్ మైదానంలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 230 పరుగుల తేడాతో గెలిచింది.

11/22/2017 - 03:06

చెన్నై, నవంబర్ 21: భారత క్రికెట్ జట్టులో చోటు కోసం తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఈ ఎదురు చూపులు ఫలించి ఇప్పుడు తనకు టీమిండియాలో చోటు లభించడం పట్ల అతను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

11/22/2017 - 02:58

బెంగళూరు, నవంబర్ 21: బెంగళూరు ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో భారత టాప్ సింగిల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ బోణీ చేశాడు. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన అతను మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో 6-3, 6-2 సెట్ల తేడాతో తన సహచరుడు శ్రీరామ్ ఎన్.బాలాజీపై విజయం సాధించాడు. అయతే ఈ టోర్నీలో భారత్‌కు చెందిన విష్ణువర్ధన్, సూరజ్ ప్రబోధ్‌లకు ఆదిలోనే చుక్కెదురైంది.

11/22/2017 - 02:58

బ్రిస్బేన్, నవంబర్ 21: ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మక యాషెస్ క్రికెట్ సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్న ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. మరో రెండు రోజుల్లో బ్రిస్బేన్‌లో మొదలయ్యే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

11/22/2017 - 02:55

న్యూఢిల్లీ, నవంబర్ 21: న్యూఢిల్లీలో జరుగుతున్న 61వ జాతీయ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల టీనేజర్ శార్దూల్ విహన్ ఒకే రోజు నాలుగు పసిడి పతకాలను కైవసం చేసుకుని పెను సంచలనం సృష్టించాడు.

11/22/2017 - 02:52

గౌహతి, నవంబర్ 21: గౌహతిలో జరుగుతున్న ఏఐబీఏ మహిళల యూత్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఇప్పటికే రెండు పతకాలను ఖాయం చేసుకున్న మన దేశం నుంచి మంగళవారం మరో నలుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

11/22/2017 - 02:49

దుబాయ్, నవంబర్ 21: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అడుగు ముందుకేశాడు. ఐసిసి (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మంగళవారం తాజాగా ప్రకటించిన ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకాడు. అయితే కోహ్లీ సహచరుడైన రవీంద్ర జడేజా ఉత్తమ బౌలర్ల జాబితాలో ఒక స్థానం కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు.

11/21/2017 - 01:42

కోల్‌కతా, నవంబర్ 20: భారత్, శ్రీలంక జట్ల మధ్య చివరిలో ఉత్కంఠ రేపిన పోరు ఫలితం తేలకుండానే ముగిసింది. రెండు రోజుల ఆటకు వర్షం కారణంగా మొదటి టెస్టు డ్రాగా ముగుస్తుందనే అభిప్రాయం మొదటి నుంచే వ్యక్తమైంది. అయితే, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం ద్వారా సవాలు విసరడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైన శ్రీలంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమి ప్రమాదంలో పడింది.

11/21/2017 - 01:39

భారత్ మొదటి ఇన్నింగ్స్: 59.3 ఓవర్లలో 172 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా 29, రవీంద్ర జడేజా 22, మహమ్మద్ షమీ 24, సురంగ లక్మల్ 4/26, లాహిరు గామగే 2/59, దసున్ షణక 2/36, దిల్‌రువాన్ పెరెరా 2/19).

Pages