S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/21/2017 - 01:37

ప్రేగ్, నవంబర్ 20: కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వింబుల్డన్ మాజీ చాంపియన్ జానా నవోత్నగా మృతి చెందింది. 1998 వింబుల్డన్ ఫైనల్‌లో నతాలీ తౌజియాత్ (ఫ్రాన్స్)ను ఓడించిన నవోత్న తన స్వస్థలమైన చెక్ రిపబ్లిక్‌లో కన్నుమూసినట్టు ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1993, 1997 సంవత్సరాల్లోనూ ఆమె వింబుల్డన్ ఫైనల్ చేరింది.

11/21/2017 - 01:35

కోల్‌కతా, నవంబర్ 20: భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్‌లో అరుదైన ఫీట్‌తో రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. ఒక టెస్టులో మొత్తం ఐదు రోజుల్లోనూ ఏదో ఒక సమయంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అతని పేరు చేరింది. శ్రీలంకతో డ్రాగా ముగిసిన మొదటి టెస్టు మ్యాచ్‌లో పుజారా ఐదు రోజుల్లోనూ బ్యాటింగ్ చేసి, ఈ ఫీట్ సాధించిన మూడో భారతీయుడిగా గుర్తింపు సంపాదించాడు.

11/21/2017 - 01:34

కోల్‌కతా, నవంబర్ 20: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 50 లేదా అంతకు మించి శతకాలు చేసిన తొమ్మిదో బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అంతేగాక, తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయని చేరి, అరుదైన రికార్డును హషీం ఆమ్లాతో కలిసి పంచుకుంటున్నాడు.

11/21/2017 - 01:43

నాగార్జున యూనివర్సిటీ, నవంబర్ 20: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 33వ జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో సోమవారం తెలంగాణకు అండర్-16 బాలికల 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం లభించింది. తెలంగాణకు చెందిన జె. దీప్తి లక్ష్యాన్ని 25.43 సెకన్ల సమయంలో చేరుకుని విజేతగా నిలిచింది.

11/21/2017 - 01:30

లండన్‌లో జరిగిన ఏటీపీ వరల్ట్ ఫైనల్స్ టైటిల్ పోరులో డేవిడ్ గొఫిన్‌ను 7-5, 4-6, 6-3 తేడాతో ఓడించిన గ్రిగర్ దిమిత్రోవ్. ఈ పోటీల్లో తొలిసారి అడుగుపెట్టిన ఒక ఆటగాడు టైటిల్ సాధించడం 1998 తర్వాత ఇదే మొదటిసారి. తొలిసారి మేజర్ టైటిల్‌ను అందుకున్న అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ తర్వాత మూడో స్థానానికి చేరతాడు

11/21/2017 - 01:28

సిడ్నీ, నవంబర్ 20: ఫిట్నెస్ సలహాదారుగా క్రికెట్ ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రపంచ మేటి స్ప్రింటర్, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ రాకతో ఆసీస్ క్రికెటర్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. నెట్స్‌కు ముందు, వామప్ రొటీన్‌కు హాజరైన బోల్ట్ ఆసీస్ ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు.

11/20/2017 - 01:37

కోల్‌కతా, నవంబర్ 19: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ‘బ్రెయిన్ ఫేడ్’ ఉదంతం మరోసారి చోటు చేసుకుంది. ఈసారి శ్రీలంక ఆటగాడు దిల్‌రువాన్ పెరెరా ఈ వివాదంలో చిక్కాడు. ఎల్‌బి అప్పీల్‌పై రివ్యూకి వెళ్లే ముందు అను డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూడడం టీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది.

11/20/2017 - 01:32

శ్రీలంకకు భారత్‌పై చివరిసారి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 2010లో లభించింది. గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని లంక అందుకోగా, ఆతర్వాత ఎనిమిది టెస్టుల్లో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్ లభించింది. ఏడేళ్ల తర్వాత లంక మరోసారి టీమిండియాపై ఆధిక్యాన్ని అందుకుంది.
*

11/20/2017 - 01:30

కోల్‌కతా: మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు సాధించకుండా కట్టడి చేయడంలో భారత పేసర్లు సఫలమయ్యారు. మొత్తం పది వికెట్లను ముగ్గురు పేసర్లు, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ పంచుకున్నారు. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో భారత పేసర్లు ఈ విధంగా ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లను తమ ఖాతాలోనే వేసుకోవడం ఇది మూడోసారి.

11/20/2017 - 01:29

సరదాగా బౌలింగ్‌కు దిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడో రోజు కేవలం ఒక బంతని మాత్రమే వేసే అవకాశం రావడంతో, నాలుగో రోజున పూర్తి ఓవర్‌ను తీసుకున్నాడు. ఐదు పరుగులు ఇచ్చాడు

Pages