S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/28/2017 - 00:49

బ్లూమ్‌ఫొంటైన్, అక్టోబర్ 27: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టి-20 ఇంటర్నేషనల్‌ను 20 పరుగుల తేడాతో గెల్చుకున్న దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌పై ఆధిక్యాన్ని సంపాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించింది. క్వింటన్ డి కాక్ 59, ఎబి డివిలియర్స్ 49 పరుగులతో రాణించారు. మెహదీ హసన్ 31 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.

10/28/2017 - 00:49

దుబాయ్, అక్టోబర్ 27: శ్రీలంకతో ఇక్కడ ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల టి-20లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌ని ఏడు వికెట్ల తేడాతో గెల్చుకొని, 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. సదీర సమరవిక్రమ, సీకుగే ప్రసన్న చెరి 23 పరుగులు చేశారు.

10/27/2017 - 01:11

పారిస్, అక్టోబర్ 26: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిళ్ల కోసం పోటీపడుతున్న ‘తెలుగు తేజం’ పివి.సింధుతో పాటు ‘ఆంధ్రావాలా’ కిదాంబి శ్రీకాంత్ తమతమ విభాగాల్లో తొలి అడ్డంకులను అధిగమించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

10/27/2017 - 01:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌కు తీవ్రమైన నిరాశ ఎదురైంది. గురువారం ఇక్కడ జరిగిన పోటీల్లో భారత్‌కు చెందిన వర్థమాన పిస్తోల్ షూటర్ జీతూ రాయ్‌తో పాటు మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో పూజా ఘట్కర్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమవడమే ఇందుకు కారణం. ఈ పోటీల్లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

10/27/2017 - 01:05

కకమిగహరా సిటీ (జపాన్), అక్టోబర్ 26: జపాన్‌లో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో సింగపూర్‌తో తలపడనుంది. వచ్చే ఏడాది లండన్‌లో జరిగే హాకీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు క్వాలిఫయర్‌గా నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఈ నెల 28వ తేదీన ప్రారంభమై 5వ తేదీన ముగుస్తుంది. ఆసియా ఖండంలోని ఎనిమిది టాప్ జట్లు ఈ టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

10/27/2017 - 01:03

జొహొర్ బహ్రు (మలేషియా), అక్టోబర్ 26: సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ 7వ ఎడిషన్ హాకీ టోర్నమెంట్‌లో భారత జూనియర్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం ఇక్కడ జరిగిన నాలుగవ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4-3 గోల్స్ తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన మూడవ లీగ్ మ్యాచ్‌లో 22-0 గోల్స్ తేడాతో అమెరికాను ఓడించిన భారత జట్టుకు మరుసటి రోజే ఈ ఓటమి ఎదురవడం గమనార్హం.

10/27/2017 - 01:02

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 26: రెండో ఎలైట్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో రైల్వే స్పోర్ట్స్ బోర్డు బాక్సర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడి స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మూడో రోజు పోటీల్లో రైల్వే స్టార్ బాక్సర్లు మనోజ్‌కుమార్, మన్‌దీప్ జాంగ్రా ప్రత్యర్థులపై సునాయస విజయాలు నమోదు చేశారు.

10/27/2017 - 01:00

ముంబయి, అక్టోబర్ 26: భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కెంటకీ (అమెరికా)లోని లూయిస్‌విల్లేలో క్రికెట్ మైదానాన్ని ప్రారంభించాడు. ‘సునీల్ గవాస్కర్ ఫీల్డ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ మైదానాన్ని స్వయంగా ఆయనే ప్రారంభించడం విశేషం. దీంతో విదేశంలో భారత క్రీడాకారుడి పేరుతో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా ఇది ఆవిర్భవించింది.

10/26/2017 - 21:08

పుణే, అక్టోబర్ 25: న్యూజిలాండ్ చేతిలో మొదటి వనే్డను అనూహ్యంగా కోల్పోయిన టీమిండియా రెండో మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకుంది. సిరీస్‌ను చేజారకుండా నిలబెట్టుకుంది. ప్రస్తుతానికి ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీలుగా ఉండడంతో, ఈనెల 29న కాన్పూర్‌లో జరిగే చివరి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

10/25/2017 - 23:07

కోల్‌కతా/ నవీ ముంబయి, అక్టోబర్ 25: రియాన్ బ్రూస్టర్ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో ఈ జట్టు 3-1 తేడాతో పటిష్టమైన బ్రెజిల్‌ను ఓడించి, స్పెయిన్‌తో టైటిల్ పోరును ఖాయం చేసుకుంది.

Pages