S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/25/2017 - 23:05

పుణే, అక్టోబర్ 25: మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) క్యూరేటర్ పాండురంగ్ సాల్గాంకర్‌పై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సస్పెన్షన్ వేటు వేసింది. పిచ్ తీరును మారుస్తానని స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా బుకీకి హామీ ఇచ్చిన క్యూరేటర్ అడ్డంగా దొరికిపోయాడు. మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ తదితరులు పాండురంగ్ సస్పెన్షన్‌కు డిమాండ్ చేయడంతో బిసిసిఐ స్పందించింది.

10/25/2017 - 23:04

పుణే, అక్టోబర్ 25: మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) క్యూరేటర్ పాండురంగ్ సాల్గాంకర్ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన తర్వాత అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్, భారత జట్టు చీఫ్ కోచ్ రవి శాస్ర్తీ మైదానంలో చాలాసేపు చర్చించుకున్నారు.

10/25/2017 - 23:02

చెన్నై, అక్టోబర్ 25: ప్రో కబడ్డీ లీగ్‌లో గురువారం పాట్నా పైరేట్స్‌తో జరిగే రెండో క్వాలిఫయర్‌లో విజయం సాధించడం ద్వారా ఫైనల్ చేరుకోవడమే లక్ష్యంగా బెంగాల్ వారియర్స్ జట్టు బరిలోకి దిగనుంది. గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్ ఇప్పటికే ఫైనల్ చేరగా, టైటిల్ పోరులో పోటీపడే అవకాశం కోసం జోన్ ‘బి’లో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన బెంగాల్, పాట్నా ఢీ కొంటున్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకూ చెరి 22 మ్యాచ్‌లు ఆడాయి.

10/25/2017 - 23:01

జొహర్ బస్రూ (మలేసియా)లో జరుగుతున్న సుల్తాన్ జొహర్ కప్ హాకీ టోర్నమెంట్‌లో బుధవారం అమెరికాను 22-0 తేడాతో చిత్తుచేసిన భారత ఆటగాళ్ల ఆనందం. మొత్తం పది మంది ఆటగాళ్లు ఈ గోల్స్‌ను చేయడం భారత జూనియర్స్ జట్టు సామర్థ్యానికి నిదర్శనం. హర్మన్‌జిత్ సింగ్ ఐదు గోల్స్ చేయగా, అభిషేక్ నాలుగు గోల్స్ సాధించాడు. విశాల్ అంటిల్, దిల్‌ప్రీత్ సింగ్ చెరి మూడు గోల్స్ చేయగా, మనీందర్ సింగ్‌కు రెండు గోల్స్ లభించాయి.

10/25/2017 - 00:56

పుణే, అక్టోబర్ 24: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగినప్పటికీ, ఎవరూ ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తిన్న టీమిండియాకు ఎదురుదాడి చేసే సమయం వచ్చేసింది. బుధవారం జరిగే రెండో వనే్డలో గెలిస్తేనే, ఈ సిరీస్‌ను దక్కించునే అవకాశాలు విరాట్ కోహ్లీ సేనకు మెరుగుపడతాయి.

10/25/2017 - 00:54

కోల్‌కతా/ నవీ ముంబయి, అక్టోబర్ 24: అండర్-17 వరల్డ్ కప్ ఫైనల్‌లో తలపడేది ఎవరో బుధవారం తేలిపోతుంది. కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి క్రీడాంగణ్‌లో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే మొదటి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్, బ్రెజిల్ ఢీ కొంటాయి. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో మాలీ, స్పెయిన్ జట్ల మధ్య మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతుంది.

10/25/2017 - 00:53

లండన్, అక్టోబర్ 24: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) 2016-2017 సీజన్‌కుగాను ఉత్తమ క్రీడాకారుడి అవార్డు పోర్చుగీస్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు దక్కింది. అట్టహాసంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అతను అవార్డును స్వీకరించాడు. మొత్తం మీద ఐదోసారి ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా అవార్డును తీసుకున్న అతను అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ సరసన చోటు సంపాదించాడు.

10/25/2017 - 00:51

ముంబయి, అక్టోబర్ 24: ప్రో కబడ్డీ మొదటి క్వాలిఫయర్‌లో గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్ ఘన విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్‌ను 42-17 తేడాతో చిత్తుచేసింది. ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడకుండా, జట్టు మొత్తం సమష్టిగా పోరాడితే, గెలుపు సులభమని గుజరాత్ నిరూపించింది. ఆ జట్టులో సచిన్ అత్యధికంగా తొమ్మిది పాయింట్లు చేశాడు. మహేంద్ర రాజ్‌పుత్ ఎనిమిది పాయింట్లు సాధించాడు.

10/25/2017 - 00:50

బులవాయో, అక్టోబర్ 24: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో లక్ష్య సాధనలో విఫలమైన జింబాబ్వే 117 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 82.5 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. షాయ్ హోప్ (90), కీరన్ పావెల్ (56) అర్ధ శతకాలు సాధించారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

10/25/2017 - 00:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కర్నీ సింగ్ షూటింగ్ రేంజెస్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎహ్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ ఫైనల్‌లో హీనా సిద్ధు, జీతూ రాయ్ జోడీ స్వర్ణ పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో వీరు 483.4 పాయింట్లు సంపాదించి, స్వర్ణాన్ని అందుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నాహక పోటీలుగా నిర్వహించే వరల్డ్ కప్ ఫైనల్‌లో హీనా, జీతూ అద్భుత ప్రతిభ కనబరచడం విశేషం.

Pages