S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/29/2017 - 04:13

కోల్‌కతా, అక్టోబర్ 28: సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్‌లో స్పెయిన్‌పై 5-2 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లాండ్ టైటిల్ సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. నిజానికి మ్యాచ్ ఆరంభంలో స్పెయిన్ ఆధిక్యాన్ని కనబరచింది. సెర్గియో గోమెజ్ దూకుడుగా ఆడుతూ 10వ నిమిషంలోనే గోల్ చేశాడు. ఇంగ్లాండ్ కుదుటపడక ముందే మరోసారి దాడులను ఉద్ధృతం చేశాడు.

10/29/2017 - 04:01

చెన్నై: రెయిడ్‌తోపాటు మొత్తం పాయింట్లలోనూ పాట్నా పైరేట్స్ కెప్టెన్ పర్‌దీప్ నర్వాల్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతను మొత్తం 350 పాయింట్లు సాధించగా, అవన్నీ రెయిడ్ పాయింట్స్ కావడం విశేషం. రోహిత్ కుమార్ (మొత్తం 231, రెయిడ్ 219 పాయింట్లు), అజయ్ ఠాకూర్ (మొత్తం 222, రెయిడ్ 213 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. టాకిల్‌లో సురేందర్ నడా నంబర్ వన్‌గా నిలిచాడు.

10/29/2017 - 04:00

కోల్‌కతా: ఈసారి అండర్-17 వరల్డ్ కప్ గెల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుగా బరిలోకి దిగిన బ్రెజిల్ చివరికి మూడో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. శనివారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో ఈ జట్టు 2-0 తేడాతో మాలీని ఓడించింది. మ్యాచ్ మొదలైన క్షణం నుంచే ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో, ప్రథమార్ధంలో గోల్స్ నమోదు కాలేదు.

10/29/2017 - 03:59

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఒక వనే్డ మ్యాచ్ ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలిసారి జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి టి-20 టోర్నీలు, సిరీస్‌ల్లో ఇక్కడ డే/నైట్ మ్యాచ్‌లు జరిగాయి. కానీ, వనే్డ ఫార్మాట్‌లో మొదటిసారి మ్యాచ్‌కి గ్రీన్ పార్క్ ఆతిథ్యమివ్వనుంది.

10/29/2017 - 03:58

చిత్రం..జపాన్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో సింగపూర్‌ను 10-0 తేడాతో చిత్తుచేసిన భారత క్రీడాకారిణులు

10/29/2017 - 03:56

పారిస్, అక్టోబర్ 28: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఫైనల్ చేరుకోగా, తెలుగు తేజం పివి సింధు సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. తన సహచరుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఢీకొన్న శ్రీకాంత్ మొదటి సెట్‌ను 14-21 తేడాతో కోల్పోయాడు. అయితే, ఆతర్వాత పుంజుకొని, మిగతా రెండు సెట్లను 21-19, 21-18 ఆధిక్యంతో గెల్చుకున్నాడు.

10/29/2017 - 03:56

కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ జట్లు గురువారమే కాన్పూర్ చేరుకున్నాయి. ఇక్కడి చల్లని వాతావరణానికి అలవాటు పడేందుకే హడావుడిగా వచ్చాయన్నది వాస్తవం. శుక్రవారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. రొటీన్ వామప్‌తోపాటు, ఫిట్నెస్ కోసం కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు. నెట్ ప్రాక్టీస్ కొనసాగించారు. శనివారం, కేన్ విలియమ్‌సన్ నాయకత్వంలో న్యూజిలాండ్ క్రెటర్లంతా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు.

10/29/2017 - 01:48

చెన్నైలో శనివారం జరిగిన ఐదో ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్‌లో గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్‌ను ఓడించి టైటిల్ నిలబెట్టుకున్న పాట్నా పైరేట్స్. ఈ జట్టు విజేతగా నిలవడం వరుసగా ఇది మూడోసారి. హ్యాట్రిక్ విజయాలు పాట్నాను తిరుగులేని శక్తిగా నిలబెట్టగా, మొదటిసారి విజేతగా నిలవాలన్న గుజరాత్‌కు నిరాశ తప్పలేదు. కెప్టెన్ పర్‌దీప్ నర్వాల్ 19 పాయింట్లు సాధించి, పాట్నాకు
తిరుగులేని విజయాన్ని అందించాడు

10/29/2017 - 01:12

అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆనందం. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్‌లో స్పెయిన్‌ను 5-2 తేడాతో చిత్తుచేసి, ఇంగ్లాండ్ తొలిసారి విజేతగా నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో స్పెయిన్ ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, తర్వాత ఎదురుదాడికి దిగిన ఇంగ్లాండ్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. ఫిలిప్ ఫర్డెన్ సాధించిన రెండు గోల్స్ కీలకమయ్యాయ.

10/28/2017 - 01:03

కోల్‌కతా, అక్టోబర్ 27: అండర్-17 సాకర్ వరల్డ్ కప్‌లో శనివారం ఒక కొత్త రికార్డు నమోదు కానుంది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ టైటిల్‌ను అందుకోలేకపోయిన స్పెయిన్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్‌లో తలపడడమే ఇందుకు కారణం. మూడు వారాల పాటు ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది.

Pages