S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/24/2017 - 01:30

ముంబయి, అక్టోబర్ 23: హైదరాబాద్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు భారత టి-20 జట్టులో చోటు లభించింది. అదే విధంగా శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది. న్యూజిలాండ్‌తో జరిగే టి-20 సిరీస్‌తోపాటు శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు జాతీయ సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్టు జట్టులోకి మురళీ విజయ్ రీ ఎంట్రీ ఇచ్చాడు.

10/24/2017 - 01:28

వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు సెలక్టర్లు ఊరటనిచ్చారు. నిజానికి అతనికి న్యూజిలాండ్‌తో జరిగే టి-20 సిరీస్‌కు అతనిని ఎంపిక చేయలేదు. అయితే, జూన్ ఒకటిన తన హోం గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కివీస్‌తో జరిగే టి-20 మ్యాచ్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్తానని నెహ్రా ఇంతకు ముందే ప్రకటించడంతో, ఆ ఒక్క మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

10/24/2017 - 01:26

ఒడెన్స్, అక్టోబర్ 23: ఫిట్నెస్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని, అందుకే, వచ్చే సీజన్‌లో ఎంపిక చేసిన టోర్నీల్లో మాత్రమే ఆడతానని భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

10/24/2017 - 01:25

టి-20 జట్టులోకి హైదరాబాదీ సిరాజ్‌తోపాటు కొత్తగా అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన ఈ ముంబయి కుర్రాడు సుమారు ఏడాది కాలంగా భారత్ ‘ఎ’ జట్టులో స్థిరంగా కొనసాగుతున్నాడు. ముక్కోణపు అనధికార వనే్డ సిరీస్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’పై అతను అద్భుతమైన సెంచరీ సాధించి, భారత్ ‘ఎ’కు టైటిల్‌ను అందించాడు.

10/24/2017 - 01:23

యాంట్‌వెర్ప్ (బెల్జియం)లో జరిగిన యూరోపియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో అమెరికాకు చెందిన స్కాట్ లిప్‌స్కీతో కలిసి టైటిల్ సాధించిన భారత ఆటగాడు దివిజ్ శరణ్. వీరు ఫైనల్‌లో జూలియో పెరాల్టా, శాంటియాగో గంజాలెజ్ జోడీపై 6-4, 2-6, 10-5 తేడాతో విజయం సాధించారు. దివిజ్ శరణ్‌కు కెరీర్‌లో ఇదే తొలి ఎటిపి వరల్డ్ టూర్ టైటిల్.

10/24/2017 - 01:21

ఆస్టిన్: మొత్తం 56 ల్యాప్స్‌గల అమెరికా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను గంటా, 33.50 నిమిషాల్లో పూర్తి చేసిన మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ట్రోఫీని అందిస్తున్న యుఎస్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్. ఈ రేసులో సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ), కిమీ రైకోనెన్ (ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

10/24/2017 - 01:20

ముంబయి, అక్టోబర్ 22: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్‌లో పాట్నా పైరేట్స్ అరుదైన ఘన విజయాన్ని నమోదు చేసింది. హర్యానా స్టీలర్స్‌ను ఏకంగా 39 పాయింట్ల తేడాతో చిత్తుచేసింది. పర్‌దీప్ నర్వాల్ 34 పాయింట్లు సాధించడం విశేషం. అతని స్కోరు ప్రత్యర్థి హర్యానా ఆటగాళ్లంతా కలిపి చేసిన పాయింట్ల కంటే ఎక్కువ కావడం విశేషం.

10/24/2017 - 01:18

షార్జా, అక్టోబర్ 23: శ్రీలంకతో సోమవారం జరిగిన చివరి, ఐదో వనే్డను కూడా గెల్చుకున్న పాకిస్తాన్ జట్టు ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఉస్మాన్ ఖాన్ విజృంభణతో అల్లాడిపోయిన శ్రీలంక 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్ 34 పరుగులకే ఐదు వికెట్లు కూల్చడం విశేషం. హసన్ అలీ 19 పరుగులకు రెండు, షాదాబ్ ఖాన్ 24 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు.

10/24/2017 - 01:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఉత్కంఠ భరితంగా సాగుతున్న అండర్-17 సాకర్ వరల్డ్ కప్ క్రమంగా ముగింపు దశకు చేరుతున్నది. గ్రూప్ దశ నుంచి మొదలు పెడితే, క్వార్టర్ ఫైనల్స్ పలు మ్యాచ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. విశేష ప్రతిభ కనబరుస్తున్న బ్రెజిల్, ఇంగ్లాండ్, మాలీ, స్పెయిన్ జట్లు సెమీ ఫైనల్స్ చేరుకోగా, తుది పోరుకు ఎవరు చేరతారన్నది ఆసక్తి రేపుతున్నది.

10/24/2017 - 01:15

ముంబయి, అక్టోబర్ 23: భారత్ పిచ్‌లపై టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కాదని, అందుకే తాము స్వీప్ షాట్లతో వారిపై ఒత్తిడి పెంచి, సానుకూల ఫలితాన్ని సాధించగలిగామని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అన్నాడు. కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ చెరి పది చొప్పున మొత్తం 20 ఓవర్లు వేసి, 125 పరుగులు సమర్పించుకున్నారు.

Pages