S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/28/2017 - 01:00

ఇంగ్లాండ్, స్పెయిన్ జట్లు ఇప్పటి వరకూ అండర్ 17 వరల్డ్ కప్‌ను గెల్చుకోలేదు. స్పెయిన్ మూడు పర్యాయాలు (1991, 2003, 2007) ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది. నాలుగోసారి తన ప్రయత్నంలో సఫలమవుతుందో లేదో చూడాలి. ఈ జట్టు రెండుసార్లు (1997, 2009) మూడో స్థానాన్ని సంపాదించింది. కాగా, ఇంగ్లాండ్ పైనల్ చేరడం ఇదే మొదటిసారి.

10/28/2017 - 00:59

స్పెయిన్, ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు సాల్ట్ లేక్ స్టేడియం ఆవరణను ముస్తాబు చేస్తున్న అభిమానులు

10/28/2017 - 00:57

అండర్-17 వరల్డ్ కప్ చరిత్రలోనే, 2013లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యమిచ్చినప్పుడు, అత్యధికంగా 172 గోల్స్ నమోదయ్యాయి. అయితే, ఈసారి ఇప్పటికే 170 గోల్స్ నమోదుకాగా, శనివారం జరిగే ఫైనల్, మూడో స్థానానికి క్లాసిఫికేషన్ మ్యాచ్‌ల్లో ఆ రికార్డు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తున్నది.

10/28/2017 - 00:55

కోల్‌కతా: ఈసారి అండర్-17 సాకర్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో చైనా ఆడలేదు. ఆ దేశంతో తలపడే అవకాశం భారత్‌కు రాకపోయినప్పటికీ, పరోక్షంగా గెలిచింది. 1985లో ఈ టోర్నీకి చైనా ఆతిథ్యమివ్వగా, ఆ టోర్నీని మొత్తం 12,30,976 మంది వీక్షించారు. ఈసారి మొత్తం 50 మ్యాచ్‌లను 12,24,027 మంది ప్రేక్షకులు చూశారు.

10/28/2017 - 00:55

పారిస్, అక్టోబర్ 27: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో అతను డెన్మార్క్ క్రీడాకారుడు హన్స్ క్రిస్టియన్ విటింగస్‌ను 21-11, 21-12 తేడాతో ఓడించాడు. సెమీస్‌లో స్థానం కోసం అతను జియాన్ హ్యుయాంక్ జిన్ (దక్షిణ కొరియా)ను ఢీ కొంటారు.

10/28/2017 - 00:54

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 27 : రెండవ ఎలైట్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో రైల్వే స్పోర్ట్స్ బోర్డు హవా కొనసాగుతోంది.

10/28/2017 - 00:52

సింగపూర్, అక్టోబర్ 27: ప్రపంచ మాజీ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే, కెరీర్‌కు గుడ్‌బై చ్పెపడం ఇది మూడోసారి కావడంతో, ఈ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండుసార్లు అంతర్జాతీయ కెరీర్‌ను ముగుస్తున్నట్టు ప్రకటించిన హింగిస్ ఆతర్వాత మనసు మార్చుకుంది.

10/28/2017 - 00:50

చెన్నై, అక్టోబర్ 27: పాట్నా పైరేట్స్‌తో శనివారం జరిగే ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్‌లో గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్ హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన గుజరాత్ మొత్తం 22 మ్యాచ్‌ల్లో 15 విజయాలు సాధించింది. కేవలం నాలుగు పరాజయాలను ఎదుర్కోగా, మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. పాట్నా పది విజయాలకే పరిమితమైంది. ఏడు పరాజయాలను ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌లు టైగా ముగిశాయి.

10/28/2017 - 00:50

పారిస్, అక్టోబర్ 27: పారిస్ సెయింట్ జర్మెయిన్ (పిఎస్‌జి) తరఫున ఆడుతున్న బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. చిరకాల ప్రత్యర్థి మార్సెలీతో జరిగిన మ్యాచ్‌ని పిఎస్‌జి 2-2గా డ్రా చేసుకుంది. ఆరంభంలోనే 2-1 తేడాతో వెనుకబడిన పిఎస్‌జికి ఈక్వెలైజర్‌ను నేమార్ అందించాడు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ గోల్ సాధించాలన్న ప్రయత్నంలో అతను పలుమార్లు క్రమశిక్షణను ఉల్లంఘించాడు.

10/28/2017 - 00:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్ సంగ్రామ్ దహియా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 80 పాయింట్లకుగాను అతను 76 పాయింట్లు సంపాదించాడు. హు బినియన్ 79 పర్యాయాలు లక్ష్యాన్ని గురితప్పకుండా కొట్టి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. స్పారాని డావీకి కాంస్య పతకం లభించింది.

Pages