S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/05/2017 - 00:49

భారత్, మధ్య ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల్లో, 2018 నుంచి 2022 వరకు ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకోవడానికకి స్టార్ ఇండియా కన్సార్టియం ఆఫర్ చేసిన మొత్తం సంవత్సరానికి సుమారు 3,270 కోట్ల రూపాయలు. అంటే ఒక్కో ఐపిఎల్ మ్యాచ్‌పై బిసిసిఐకి లభించే మొత్తం అక్షరాల 55 కోట్ల రూపాయలు. టీమిండియా ఆడే ఒక అంతర్జాతీయ మ్యాచ్ ద్వారా బిసిసిఐకి సగటున 43 కోట్ల రూపాయలే వస్తాయి.

09/05/2017 - 00:47

క్రీడా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర)గా సోమవారం బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఇప్పటి వరకూ ఆ శాఖను నిర్వహించిన విజయ్ గోయల్ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి)కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (ఎడమ). క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించడం, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం తన ప్రధాన లక్ష్యాలుగా రాథోడ్ ప్రకటించారు

09/05/2017 - 00:45

హైదరాబాద్, సెప్టెంబర్ 4: బాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ తన పాత గూటికే చేరింది. జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో మూడేళ్ల క్రితం విభేదించి, బెంగళూరులో విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్న ఆమె ఇప్పుడు మనసు మార్చుకుంది. గోపీచంద్ అకాడెమీలోనే శిక్షణను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. కాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రాక్టీస్ మొదలుపెడతానని సైనా తెలిపింది.

09/05/2017 - 00:42

హైదరాబాద్: కోచ్ గోపీచంద్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్స్ రన్నరప్ పివి సింధు అరుదైన కానుక ఇవ్వనుంది. మంగళవారం టీచర్స్‌డే సందర్భంగా ఒక డిజిటల్ ఫిల్మ్‌ను బహూకరించింది. తానే నిర్మాత అవతారం ఎత్తి ప్రత్యేకంగా గోపీచంద్‌కు కానుకగా ఇవ్వడం ద్వారా, అతని పట్ల తనకు ఉన్న గురుభక్తిని చాటుకోనుంది.

చిత్రం..పివి సింధు

09/05/2017 - 00:40

న్యూయార్క్, సెప్టెంబర్ 4: కెరీర్‌లో ఐదు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా యుఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఆమెను లాత్వియాకు చెందిన 16వ సీడ్ అనస్టాసిజా సెవత్సొవా 5-7, 6-4, 6-2 తేడాతో ఓడించింది.

09/05/2017 - 00:38

న్యూయార్క్: తొమ్మిదో సీడ్, మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ యుఎస్ ఓపెన్‌లో టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. 37 ఏళ్ల వీనస్ ప్రీ క్వార్టర్స్‌లో కార్లా సౌరెజ్ నవరోను 6-3, 3-6, 6-1 తేడాతో ఓడించింది. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న వీనస్ ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్స్‌లో ఫైనల్ వరకూ చేరింది.

09/05/2017 - 00:36

యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ మూడో రౌండ్‌లో సొరానా సిర్‌స్టియా, సారా సొరిబెస్ టొర్మో జోడీ తలపడుతున్న సానియా మీర్జా, పెంగ్ షుయ్. వీరు సొరానా సిర్‌స్టియా, సారా సొరిబెస్ టొర్మో జోడీపై 6-2, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు.

09/05/2017 - 00:34

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించి సంచలనం సృష్టించడమేగాక, వరుసగా మూడు రౌండ్లను పూర్తి చేసి సత్తా చాటిన కెనడా యువ ఆటగాడు డెనిస్ షపొవలోవ్ దూకుడుకు బ్రేక్ పడింది.

09/04/2017 - 01:33

కొలంబో, సెప్టెంబర్ 3: ప్రపంచ క్రికెట్ చరిత్రలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విశిష్టమైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లలో స్టంపింగ్‌ల ద్వారా 100 మందిని పెవిలియన్‌కు చేర్చిన తొలి వికెట్‌కీపర్‌గా అతను సరికొత్త రికార్డు సృష్టించాడు.

09/04/2017 - 01:13

కొలంబో, సెప్టెంబర్ 3: శ్రీలంకలో జరిగిన ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు ఆదివారం కొలంబోలో జరిగిన చివరి వనే్డలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆతిథ్య శ్రీలంక జట్టుకు ‘వైట్‌వాష్’ వేసింది.

Pages