S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/07/2017 - 02:02

లండన్, సెప్టెంబర్ 6: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ నుంచి గాయం కారణంగా వైదొలగిన ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే ఈ సీజన్ చివరి వరకూ అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న ముర్రే శస్త్ర చికిత్స కంటే విశ్రాంతికే ఎక్కువ మొగ్గు చూపాడని సమాచారం.

09/07/2017 - 02:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామనె్వల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో మూడో రోజు, బుధవారం భారత్‌కు మూడు స్వర్ణాలుసహా మొత్తం 10 పతకాలు లభించాయి. యూత్ బాయిస్ విభాగంలో ముతుపండి రాజా మొత్తం 260 కిలోల బరువునెత్తి విజేతగా నిలిచాడు. ఎర్రా దీక్షిత జూనియర్ మహిళల 58 కిలోల విభాగంలో 167 కిలోల బరువును ఎత్తి స్వర్ణాన్ని అందుకుంది.

09/07/2017 - 02:01

న్యూయార్క్: ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ఈవెంట్ మహిళల సింగిల్స్‌లో మార్టినా నవ్రతిలోవా (1994) తర్వాత సెమీ ఫైనల్స్ చేరిన ఎక్కువ వయసుగల క్రీడాకారిణిగా అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్ రికార్డు సృష్టించింది. యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె రెండు పర్యాయాలు వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన పెట్రా క్విటోవాను 6-3, 3-6, 7-6 తేడాతో ఓడించింది.

09/06/2017 - 01:18

న్యూయార్క్, సెప్టెంబర్ 5: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్‌పోట్రో సెమీఫైనల్ బెర్తు కోసం ఈ టోర్నీలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు.

09/06/2017 - 01:16

కొలంబో, సెప్టెంబర్ 5: శ్రీలంక పర్యటనలో ఇప్పటికే టెస్టు, వన్‌డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన బుధవారం జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌లో కూడా ఘన విజయం సాధించి అప్రతిహతంగా పర్యటనను ముగించాలని కోహ్లీ సేన అనుకొంటోంది. బుధవారం నాటి మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయాన్ని తప్ప మరో ఫలితాన్ని ఎవరూ ఊహించరేమో కూడా.

09/06/2017 - 01:14

న్యూయార్క్, సెప్టెంబర్ 5: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న రెండవ క్వాలిఫయర్‌గా ఎస్తోనియా క్రీడాకారిణి కైయా కనేపీ చరిత్ర సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 418వ స్థానంలో కొనసాగుతున్న కనేపీ మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 6-4 వరుస సెట్ల తేడాతో రష్యాకి చెందిన దరియా కసాత్కినాను మట్టికరిపించింది.

09/06/2017 - 01:12

మకావూ, సెప్టెంబర్ 5: ఆసియా కప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ లీగ్ పోరులో భారత ఫుట్‌బాల్ జట్టు 2-0 గోల్స్ తేడాతో మకావూ జట్టును మట్టికరిపించింది. భారత సబ్‌స్టిట్యూట్ స్ట్రైకర్ బల్వంత్ సింగ్ ద్వితీయార్థంలో రెండు అద్భుతమైన గోల్స్‌తో సత్తా చాటుకుని మకావూ పతనాన్ని శాసించాడు. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారత జట్టు వరుసగా 11వ విజయాన్ని నమోదు చేసుకుంది.

09/06/2017 - 01:11

న్యూయార్క్, సెప్టెంబర్ 5: యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు రోహన్ బొపన్న పోరాటం పూర్తిగా ముగిసింది. ఈ టోర్నీలో ఏడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన బొపన్న, అతని భాగస్వామి గాబ్రియెలా దబ్రోవ్‌స్కీ (కెనడా) మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మూడో సీడ్ జంట హావో చింగ్ చాన్, మైఖేల్ వీనస్ చేతిలో పరాజయం పాలయ్యారు.

09/06/2017 - 01:10

బెంగళూరు, సెప్టెంబర్ 5: మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ పుల్లెల గోపీచంద్‌తో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్న సైనా నెహ్వాల్ ఇప్పుడు దుబాయిలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్‌కు క్వాలిఫై కావడమే తన ప్రథమ లక్ష్యమని చెప్పింది.

09/06/2017 - 01:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామనె్వల్త్ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో మంగళవారం భారత లిఫ్టర్లు మీరాబాయి చానూ, కె.సంజిత పసిడి పతకాలతో మెరుపులు మెరిపించారు. దీంతో వీరిద్దరూ వచ్చే ఏడాది జరిగే కామనె్వల్త్ క్రీడలకు అర్హత సాధించారు.

Pages