S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/04/2017 - 02:11

బర్మింగ్‌హామ్, జూన్ 3: ‘మినీ ప్రపంచ కప్’ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? లేదా? అనే విషయం కంటే ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌లో గెలుస్తుందా? లేదా? అనే ప్రశే్న అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ జట్లు ఎక్కడ తలపడినా అభిమానుల దృష్టి అక్కడే కేంద్రీకృతమవుతుంది.

06/02/2017 - 23:53

బ్యాంకాక్, జూన్ 2: భారత బాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సెమీ ఫైనల్ చేరింది. కాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత పూర్వ వైభవాన్ని కొనసాగించలేకపోతున్న ఆమె ఈ టోర్నీలో మళ్లీ పూర్వ వైభవాన్ని గుర్తుచేస్తున్నది. జపాన్‌కు చెందిన హారుకో సుజికీని క్వార్టర్ ఫైనల్స్‌లో 21-15, 20-22, 21-11 తేడాతో ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.

06/02/2017 - 23:52

లండన్, జూన్ 2: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగేందుకు అనిల్ కుంబ్లే విముఖత వ్యక్తం చేశాడని, దీనితో అతని స్థానంలో బాధ్యతలను మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్‌కు అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించిందని సమాచారం. వేగంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.

06/02/2017 - 23:55

లండన్: మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హడావుడిగా లండన్ వెళ్లి ఆటగాళ్లతో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లను కూడా అతను కలిశాడు. వారితో అతను జరిపిన చర్చల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో, ఆ విషయంలోనే ఆటగాళ్ల అభిప్రాయాలను గంగూలీ సేకరించే అవకాశాలున్నాయి.

06/02/2017 - 23:50

జైపూర్, జూన్ 2: రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సిఎ) అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిపి జోషి ఎన్నికయ్యాడు. నిజానికి మే 29న ఆర్‌సిఎ కొత్త కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. అయితే, హై కోర్టులో కేసు కొనసాగుతున్నందున, కోర్టు ఆదేశాలు అందే వరకూ ఫలితాలను జారీ చేయరాదని నిర్ణయించారు. శుక్రవారం కోర్టు అనుమతించడంతో ఫలితాలను ప్రకటించారు.

06/02/2017 - 02:13

బ్యాంకాక్, జూన్ 1: థాయిలాండ్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు బి.సాయి ప్రణీత్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో 21-11, 21-14 గేముల తేడాతో మలేషియాకి చెందిన ఇంగ్ ఇంగ్ లీపై సునాయాసంగా విజయం సాధించింది.

06/02/2017 - 02:12

లండన్, జూన్ 1: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు బోణీ చేసింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో గురువారం జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బార్ శతకంతో విజృంభించగా, మిడిలార్డర్‌లో వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీమ్ అర్ధ శతకంతో రాణించాడు.

06/01/2017 - 03:14

లండన్, మే 31: చాంపియన్స్ ట్రోఫీ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకూ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. దీనితో, కొద్దిమందిని మినహాయిస్తే, చాలా మంది బౌలర్లు నానా ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. గురువారం నుంచి మొదలయ్యే ఎనిమిదో చాంపియన్స్ ట్రోఫీ కూడా బౌలర్లకు పరీక్షగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, గతంలో కొంత మంది బౌలర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు.

06/01/2017 - 02:44

ది ఓవల్ (లండన్), మే 31: అభిమానులకు వనే్డ క్రికెట్ విందును అందించేందుకు ఎన్నో రకాలుగా ప్రత్యేకతను సంతరించుకున్న చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సిద్ధమైంది. గురువారం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో మొదలుకానున్న ఈ టోర్నీలో ప్రతి జట్టూ ఆచితూచి ఆడాలి. ఏమాత్రం తప్పటడుగు వేసినా ఇంటిదారి పట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టే దీనిని ఒకప్పుడు ఐసిసి నాకౌట్ టోర్నీగా పిలిచేవారు.

06/01/2017 - 02:44

ది ఓవల్ (లండన్), మే 31: చాంపియన్స్ ట్రోఫీ ఎనిమిదోసారి జరగనుంది. 1998లో ఆరంభమైన ఈ ‘మినీ ప్రపంచకప్’ను తొలిసారి దక్షిణాఫ్రికా గెల్చుకుంది. నాటి ఫైనల్‌లో ఆ జట్టు వెస్టిండీస్‌ను ఓడించింది. 2000లో భారత్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. 2002లో వర్షం కారణంగా ఫైనల్ జరగలేదు. దీనితో భారత్, శ్రీలంక జట్లను సంయుక్తంగా చాంపియన్స్‌గా ప్రకటించారు.

Pages