S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/13/2016 - 18:05

హరారే: హరారేలో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. 127 పరుగుల టార్గెట్‌ను 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో రెండు పరుగులు చేస్తే భారత్ గెలుపు ఖాయమయ్యే సమయంలో 27వ ఓవర్‌ నాలుగో బంతికి నైర్ ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండే తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించడంతో 26.5 ఓవర్లలో భారత్ 129 పరుగులు చేసింది.

06/13/2016 - 05:41

సిడ్నీ, జూన్ 12: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకొని, ఫిట్నెస్ సమస్యలు తనను వేధించడం లేదని పరోక్షంగా ప్రకటించింది. ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో గట్టిపోటీనిస్తానని ఈ హైదరాబాదీ తన విజయంతో సవాలు విసిరింది.

,
06/13/2016 - 05:39

మార్సెలీ, జూన్ 12: ఫ్రెంచ్ అధికారులు భయపడుతున్నట్టుగానే యూరో కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో అభిమానుల వీరంగం ఆరంభమైంది. ఇంగ్లాండ్, రష్యా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన వెంటనే ఇరు జట్ల ఫ్యాన్స్ పరస్పరం దాడులకు దిగారు. రష్యా అభిమానులు కుర్చీలుసహా చేతికి అందిన వస్తువులను విసిరి గలభా సృష్టించారు. ఇంగ్లాండ్ అభిమానులు వారిపై తిరగబడడంతో ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది.

06/13/2016 - 05:36

కింగ్‌స్టన్ (జమైకా)లో జరిగిన రేసర్స్ గ్రాండ్ ప్రీ ట్రాక్ అండ్ ఫీల్డ్ 100 మీటర్ల పరుగులో లక్ష్యం దిశగా దూసుకెళుతున్న ప్రపంచ నంబర్ వన్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ (మధ్య). 9.88 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్న బోల్ట్‌కు గట్టిపోటీనిచ్చిన యెహన్నా బ్లేక్ (ఎడమ), అసాఫా పావెల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు

06/13/2016 - 05:34

లండన్, జూన్ 12: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో సోమవారం బెల్జియంతో పోరుకు భారత జట్టు సమాయత్తమవుతున్నది. ఆదివారం విశ్రాంతి దినం కావడంతో, టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు ప్రాక్టీస్‌లో, వ్యూహ రచనల్లో మునిగి తేలాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌ని జర్మనీతో డ్రా చేసుకున్న భారత జట్టు రెండో మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను 2-1 తేడాతో ఓడించి శుభారంభం చేసింది.

06/13/2016 - 05:33

హరారే, జూన్ 12: మొదటి వనే్డలో జింబాబ్వేను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసిన భారత జట్టు సోమవారం జరిగే రెండో వనే్డలోనూ విజయభేరి మోగించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా ఎంచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో, ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి సత్తా చాటింది.

06/13/2016 - 05:32

బసెటెర్, జూన్ 12: ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ని ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ శతకంతో రాణించగా, ఆరు వికెట్లకు 288 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత దక్షిణాఫ్రికాను 47.4 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు ఇది రెండో విజయంకాగా దక్షిణాఫ్రికాకు రెండో పరాజయం.

06/13/2016 - 05:31

ఫిలడేల్ఫియా, జూన్ 12: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అమెరికా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్లింట్ డెంప్సీ అసాధారణ ప్రతిభ పరాగ్వేపై అమెరికాకు విజయాన్ని సాధించిపెట్టింది. మ్యాచ్ ఆరంభంలో నింపాదిగా ఆడిన యుఎస్ జట్టు క్రమంగా వేగాన్ని పెంచింది. 27వ నిమిషంలో డెంప్సీ మెరుపు వేగంతో దూసుకెళ్లి, పరాగ్వే రక్షణ వలయాన్ని ఛేదించి చక్కటి గోల్ చేశాడు.

06/13/2016 - 02:36

సూపర్ సైనాకు
ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్
ఈ సీజన్‌లో మొదటి టైటిల్‌ను అందుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్. సిడ్నీలో ఆదివారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె 11-21, 21-14, 21-19 ఆధిక్యంతో ప్రపంచ పనె్నండో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి
సన్ యూను ఓడించి టైటిల్‌ను అందుకుంది. సైనా ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్‌ను

06/12/2016 - 16:47

సిడ్ని:చాలా రోజుల తరువాత ఓ మెగా టోర్నీలో తెలుగు క్రీడాకారిణి సైనానెహ్వాల్ అద్భుత విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ప్రపంచ షటిల్‌బ్యాడ్మింటన్‌లో 12వ ర్యాంకు క్రీడాకారిణి, చైనాకు చెందిన సున్ యుపై ఫైనల్‌లో విజయం సాధించి కప్ కొట్టేసింది. త్వరలో జరగనున్న రియోఒలింపిక్స్ ముందు తనకన్నా మెరుగైన ర్యాంకర్‌పై సైనా సాధించిన విజయం పెద్ద ఊరట.

Pages