S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/12/2016 - 02:47

చికాగో, జూన్ 11: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ చెలరేగి హ్యాట్రిక్ సాధించగా, పనామాపై 5-0 ఆధిక్యంతో విజయభేరి మోగించిన అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని కొనసాగించిన అర్జెంటీనా చివరి వరకూ ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ఏడో నిమిషంలోనే నికోలస్ అటామెండీ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఖాతా తెరిచింది.

,
06/12/2016 - 02:44

హరారే, జూన్ 11: కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన లోకేష్ రాహుల్ ‘రికార్డు’ సెంచరీతో రాణించగా, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు సాధించడంతో, జింబాబ్వేతో శనివారం జరిగిన మొదటి వనే్డలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

06/12/2016 - 02:37

సిడ్నీ, జూన్ 11: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్ చేరగా, పురుషుల సింగిల్స్ సెమీస్‌లో కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలై నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఇహాన్ వాంగ్ (చైనా)తో సెమీ ఫైనల్‌లో తలపడిన సైనా 21-18, 21-12 తేడాతో విజయం సాధించి, ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది.

06/12/2016 - 02:35

న్యూఢిల్లీ, జూన్ 11: తెలుగు వీరుడు సాకేత్ మైనేనీకి రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం చేతికి అందినట్టే అంది జారిపోయింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) సాకేత్‌ను పక్కకుపెట్టి, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌వైపే మొగ్గుచూపింది. రియోలో తనకు భాగస్వామిగా సాకేత్ ఉండాలని కోరుతూ ఎఐటిఎకు రోహన్ బొపన్న లేఖ రాసిన విషయం తెలిసిందే. సహజంగా మేజర్ టోర్నీల్లో భాగస్వామి ఎవరు ఉండాలనేది ఆటగాళ్లకే విడిచిపెడతారు.

06/12/2016 - 02:32

పారిస్, జూన్ 11: యూరో 2016 ఫుట్‌బాల్‌లో భాగంగా అల్బేనియాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 తేడాతో గెలిచింది. ఫాబియాన్ షార్ ఈ కీలక గోల్‌ను సాధించి, స్విస్‌ను విజయ బాటలో నడిపించాడు. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణమే దూకుడుగా ఆడిన స్విస్‌కు ఐదో నిమిషంలోనే షార్ గోల్ సాధించిపెట్టాడు. ఆధిక్యాన్ని సంపాదించిన మరుక్షణం స్విస్ జట్టు పూర్తి డిఫెన్స్‌తో ముందుకు సాగాలని నిర్ణయంచింది.

06/12/2016 - 02:31

పారిస్, జూన్ 11: యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. దిమిత్రీ పాయెట్ కీలక సమయంలో అద్భుతమైన గోల్ సాధించి రుమేనియాపై ఫ్రాన్స్‌కు విజయాన్ని సాధించిపెట్టాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధంలో ఫ్రాన్స్ విజృంభణకు రుమేనియా సమర్థంగా అడ్డుకట్ట వేసింది. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడ్డారు.

06/12/2016 - 02:29

లండన్, జూన్ 11: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టో ర్నీలో భాగంగా జర్మనీతో జరిగిన తొలి మ్యాచ్‌ని డ్రా చేసుకున్న భారత జట్టు శనివారం నాటి రెండో మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను 2-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ 17వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ చేసిన గో ల్‌తో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన భారత్‌కు 34వ నిమిషంలో హర్‌మన్‌ప్రీత్ సింగ్ రెండో గోల్ సా ధించిపెట్టాడు.

06/12/2016 - 02:28

పారిస్, జూన్ 11: భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రియో ఒలింపిక్స్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసు కున్నాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వ ర్యంలో జరిగిన ప్రో బాక్సింగ్ ఫైట్‌లో అతను కె న్యాకు చెందిన నిక్సన్ అబాబాను 3-0 తేడాతో ఓ డించాడు. ఈ ఫైట్‌లో పాల్గొనడం ద్వారా అతను వచ్చేనెల వెనెజులాతో జరిగిన ఒలింపిక్స్ చివరి క్వాలిఫయర్‌లో పోటీ పడేందుకు అర్హత సంపా దించాడు.

06/11/2016 - 11:56

సిడ్నీ: భారతీయ షటిల్ బ్యాండ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సీరీస్ బ్యాండ్మింటన్ పోటీలో సెమీ ఫైనల్ దశలో ఓటమిని చవిచూశాడు. డెన్మార్క్ క్రీడాకారుడు హన్స్ క్రిస్టియన్ చేతిలో 22-20, 21-13 తేడాతో శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు.

06/11/2016 - 08:08

హరారే, జూన్ 10: జింబాబ్వేతో శనివారం జరిగే తొలి వనే్డ ఇంటర్నేషనల్‌లో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయతే, జట్టులోని యువ ఆటగాళ్ల కు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు అటు వనే్డ, ఇటు టి-20 ఫార్మెట్స్‌లో విజయాలను నమోదు చేసి, సిరీస్‌లను కైవసం చేసుకుంటుందని నిపుణుల అభిప్రాయం. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Pages