S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

09/10/2016 - 22:26

అంతర్జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడిన ఎక్కువ వయసున్న స్విమ్మర్‌గా జపాన్‌కు చెందిన మీకో నగోకా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2015లో పోటీపడినప్పుడు ఆమె వయసు సరిగ్గా వందేళ్లు. ఈ ‘సెంచరీ’ స్విమ్మర్ 1,500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపించింది.

09/10/2016 - 22:23

ప్రొఫెషనల్ స్విమ్మర్లు ఏ దేశంలోనైనా వేల సంఖ్యలో ఉంటారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కోసం సగటున 1850 మంది ట్రయల్స్‌కు హాజరవుతారు. కానీ, వారిలో సుమారు యాభై మందికి మాత్రమే మేజర్ ఈవెంట్స్‌లో పోటీపడే అవకాశం దక్కుతుంది. జట్టులో ఉంటామో లేదో తెలియకపోయినా ప్రయత్నం మాత్రం ఆపరు.

09/10/2016 - 22:22

స్విమ్మింగ్‌ను ఒలింపిక్ ఈవెంట్‌గా 1908లో చేర్చారు. కానీ, మహిళలకు 1912లో తొలిసారి ప్రవేశం లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫానీ డ్యూరాక్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. ఆమె 100 గజాల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది.

09/10/2016 - 22:20

మిగతా ఏ క్రీడలోనూ లేని విధంగా స్విమ్మింగ్‌ను చిన్నతనంలోనే నేర్చుకోవచ్చు. ఏడాది వయసు ఉన్నప్పటి నుంచి ఈతను నేర్పించవచ్చు. చిన్నతనంలోనే ఈతను నేర్పిస్తే, నీళ్లలో మునిగిపోయే ప్రమాదాలు 88 శాతం వరకూ తగ్గుతాయని పరిశోధనా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
అత్యుత్తమ వ్యాయామం

,
09/03/2016 - 22:42

లోధా కమిటీతో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)లో ప్రక్షాళన సాధ్యమవుతుందా? సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, సిఫార్సుల అమలుపై లోధా కమిటీ విధించిన డెడ్‌లైన్లను చూస్తుంటే, ఇది సాధ్యమేనన్న అభిప్రాయం కలుగుతోంది. డిసెంబర్ 15వ తేదీలోగా వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అత్యున్నత పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని బోర్డును లోధా కమిటీ ఇప్పటికే ఆదేశించింది.

09/03/2016 - 22:32

వివాదాస్పద అథ్లెట్‌గా ముద్రపడిన ఒపి జైష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వైద్యుల సలహాను బేఖాతరు చేసిన ఆమె త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నది. తాను బాగా కోలుకున్నానని, మందులు కూడా వాడడం లేదని పిటిఐ వార్తా సంస్థకు వివరించింది. విశ్రాంతి తీసుకోవాలని కూడా తనకు ఎవరూ సూచించలేదని వ్యాఖ్యానించింది. రియో ఒలింపిక్స్ నుంచి జ్వరంతో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

09/03/2016 - 22:30

రియో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత దాదాపు అన్ని దేశాలు క్రీడాకారులపై పెట్టిన ఖర్చును, సాధించిన విజయాలను బేరీజు వేసుకోవడం ఆరంభించాయి. ఎంత ఖర్చు పెడితే, ఎంత లాభం వచ్చిందనే చర్చ అన్ని దేశాల్లోనూ మొదలైంది. అమెరికా 46 స్వర్ణాలు, 37 రజతా, 38 కాంస్యాలతో మొత్తం 121 పతకాలు సాధించింది. బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్యాల సాయంతో 67 పతకాలను కైవసం చేసుకొని రెండో స్థానంలో నిలిచింది.

09/03/2016 - 22:28

అమెరికా స్టార్ స్విమ్మర్ ర్యాన్ లోచెపై బ్రెజిల్ పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. దోపిడీకి గురయ్యామంటూ తప్పుడు కేసు పెట్టినందుకు లోచెపై కేసు దాఖలైందని స్థానిక మీడియా ప్రకటించింది. పోలీస్ దుస్తుల్లో ఉన్న కొంత మంది తమ వాహనాన్ని అడ్డుకొని, తుపాకీ గురిపెట్టి దోచుకున్నారని రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న లోచె, జాక్ కాంగర్, గన్నర్ బెంజ్, జిమీ ఫీగెన్ గతనెల 15న ఆరోపించారు.

09/03/2016 - 22:15

భారత మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్‌ను సవ్యసాచిగా పేర్కోవాలి. అతను రెండు చేతులతో బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేస్తాడనికాదు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు కాబట్టే ఆ పేరును సార్థం చేసుకున్నాడు. వనే్డల్లో అతను ఓపెనర్‌గానేగాక, బౌలింగ్‌లోనూ మొదటి ఓవర్ వేసిన మ్యాచ్‌లు 45 ఉన్నాయి. ఈ జాబితాలో మనోజ్‌ది అగ్రస్థానం. రెండో స్థానంలో జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్ నీల్ జాన్సన్ ఉన్నాడు.

08/27/2016 - 22:49

రియో ఒలింపిక్స్‌లో దారుణ వైఫల్యం భారత క్రీడా రంగం పతనావస్థకు అద్దం పట్టింది. సరికొత్త పాఠాలను నేర్పింది. రెండు పతకాలకే నానా హడావుడి చేయాల్సిన దుస్థితిని కల్పించింది. మరో నాలుగేళ్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే సరైన దిశగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు అంధకారమేనని, అక్కడా పరాభవం తప్పదని రియో అనుభవం స్పష్టం చేస్తున్నది.

Pages