S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

01/27/2018 - 18:45

టీమిండియాకు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించిన వారిలో కపిల్ దేవ్ తర్వాత సౌరవ్ గంగూలీ పేరు చెప్పుకోవాలి. అతని నుంచి 3ది వాల్2 రాహుల్ ద్రవిడ్‌కు జట్టు పగ్గాలు లభించాయి. సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గా భారత్‌ను ఎన్నోసార్లు ఆదుకున్న ద్రవిడ్ కెప్టెన్‌గా అదేస్థాయిలో రాణించలేకపోయాడు.

01/27/2018 - 18:06

కోహ్లీ మొండి వైఖరి గురించి ఎంత తక్కువగా చెప్తే అంత మంచిది. సొంత అజెండాను అమలు చేసే అతను, జట్టు ప్రయోజనాలు గాలికి కొట్టుకుపోయినా సరే తన పంతమే నెగ్గాలన్న అతని వైఖరి కారణంగానే కోచ్ పదవి నుంచి అనీల్ కుంబ్లే ఉద్వాసనకు గురయ్యాడు.

01/27/2018 - 18:04

ఏ క్రీడలోనైనా రికార్డులు ఉన్నది బద్దలు కావడానికే అని అంటారు. అది నిజం కూడా. క్రికెట్‌లో రికార్డులు తరచు మారుతూనే ఉన్నాయి. కానీ, కొన్ని దశాబ్దాలుగా చెక్కుచెదరని రికార్డులు కూడా ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే అలాంటి రికార్డుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ చార్లెస్ బనెర్మన్ చేసిన రికార్డును మొదటగా ప్రస్తావించాలి. 1877 మార్చి 15న ఇంగ్లాండ్‌తో మొదలైన టెస్టులో బనెర్మన్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు.

01/27/2018 - 18:01

పాకిస్తాన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వికెట్ సాధించిన వెంటనే తనదైన శైలిలో, పక్షి రెక్కలు చాచి గాలిలో ఫీట్లు చేస్తున్నట్టు పరుగులు తీస్తాడు. వికెట్ లభించినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, అందరిలోకీ అక్తర్‌ది భిన్నమైన విధానం. అతను ఎందుకలా పరిగెడతాడన్నది చాలాకాలం రహస్యంగానే ఉంది. ఇటీవలే ట్విటర్‌లో అతను వివరణ ఇచ్చిన తర్వాత.. ఇదా సంగతి అనుకున్నారు.

01/27/2018 - 17:59

కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతూ శతకాలు సాధించినవారు లేకపోలేదు. అయితే, మొదటి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన రికార్డు రెగినాల్డ్ ‘టిప్’ ఫాస్టర్‌కే సొంతం. 1878లో జన్మించిన అతను తన ఆరుగురు సోదరులతో కలిసి కౌంటీ క్రికెట్ ఆడాడు. వర్సెస్టర్‌షైర్ క్లబ్‌లో ఏకంగా ఏడుగురు ‘్ఫస్టర్లు‘ ఉన్నందుకు అప్పట్లో ఆ జట్టును ‘్ఫస్టర్‌షైర్’ అని పిలిచేవారు.

01/27/2018 - 17:56

ఐదు పదుల వయస్సులో క్రికెట్ ఆడడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక కెప్టెన్‌గా జట్టును నడిపించడం అనేది ఎవరూ ఊహించలేని విషయం. అలాంటి అరుదైన రికార్డు విలియమ్ గిల్బర్ట్ గ్రేస్ పేరిట ఉంది. డబ్ల్యుజి గ్రేస్‌గా అందరికీ సుపరచితుడైన అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 54,896 పరుగులు చేశాడు. 2,864 వికెట్లు కూల్చాడు. ఈ స్థాయి ప్రమాణాలను ఇప్పటివరకూ ఎవరూ అందుకోలేదు.

01/20/2018 - 19:22

నిన్నమొన్నటి వరకూ ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు విరాట్ కోహ్లీపై విమర్శలు కురిపిస్తున్నారు. దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరినప్పుడే, అక్కడ కూడా విజయపరంపరలను కొనసాగించడం సులభం కాదని మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు, విశే్లషకులు హెచ్చరించారు. కానీ, కోహ్లీగానీ, టీమిండియాలోని ఇతర సభ్యులుగానీ ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి భారీ మూల్యానే్న చెల్లించుకున్నారు.

01/20/2018 - 19:20

ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ టైసన్ ఫ్యూరీ సుమారు రెండేళ్ల విశ్రాంతికి తెరదించాడు. మళ్లీ పూర్వ వైభవం కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. వ్లాదిమిర్ క్లిచ్కోను రెండేళ్ల క్రితం ఓడించి, హెవీవెయిట్ టైటిల్‌ను సాధించిన తర్వాత ఫ్యూరీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ, మనసు మార్చుకొని, వచ్చే ఏడాది మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెడుతున్నాడు. పొట్ట కరిగించుకోవడం..

01/20/2018 - 19:18

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే రికార్డు ఉసేన్ బోల్ట్ సొంతం. 100 మీటర్ల స్ప్రింట్‌తోపాటు 200 మీటర్ల పరుగులోనూ ప్రపంచ రికార్డులు అతని పేరుమీదే ఉన్నాయి. అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత, ఫుట్‌బాలర్‌గా తన కెరీర్‌ను తీర్చుదిద్దుకుందామని అనుకుంటున్న బోల్ట్‌కు గట్టిపోటీదారుగా అతని ప్రాణమిత్రుడు లియాన్ బెయిలీ ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.

01/20/2018 - 19:15

అమెరికా బాస్కెట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన మైఖేల్ జోర్డాన్ పొడవాటి షార్ట్స్ వేసుకునేవాడు. తర్వాతి కాలంలో చాలామంది అలాంటి షార్ట్స్‌ను వేసుకోవడం ప్రారంభించాడు. ఇంతకీ పొడవాటి షార్ట్స్‌ను జోర్డాన్ ఎందుకు ధరించేవాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కెరీర్ ఆరంభంలో నార్త్ కరోలినా యూనివర్శిటీ తరఫున ఆడిన అతను, ఆ యూనివర్శిటీ షార్ట్స్ వేసుకునేవాడు.

Pages