S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

09/20/2017 - 19:14

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ జివో నెం.39 జారీ చేసింది. రైతు సమన్వయ సమితులు లక్ష్యాలు, ఉద్దేశాలు, బాధ్యతలు, కర్తవ్యాలు అనేవాటిపై కొరవడింది. ఈ జివోతో రెవెన్యూ, కలెక్టరేట్ వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఖాయం. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకుని ఉంటే బాగుండేది. నిజాం ప్రభుత్వ హయాంలోనే భూ సర్వేలు జరిపి రికార్డులు తయారు చేయడం జరిగింది.

09/20/2017 - 19:12

రైతులందరికీ బ్యాంక్‌ల నుంచి వ్యవసాయ రుణాలు లభించేందుకు వీలుగా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో, నాటి చంద్రబాబు ప్రభుత్వం 2003లో ఏర్పాటుచేసిన ‘రైతుమిత్ర’ పథకానికి రూపకల్పన చేశాం. నేడది కాగితాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది.

09/20/2017 - 19:12

రైతు సమన్వయ కమిటీలను తెరపైకి తెస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలు, నాయకులచే రాచరిక వ్యవస్థను నడిపేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఇప్పటివరకు గ్రామ సభ నిర్ణయించేది. ప్రజలచే ఎన్నుకోబడ్డ వార్డు సభ్యులు, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగేది.

09/20/2017 - 19:09

ఏళ్లతరబడిగా భూవివాదాలతో సతమతం అవుతున్న రైతులకు మేలు చేసుందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, సమగ్ర భూసర్వే నిర్వహిస్తోంది. భూములపై రైతులకు అధికారిక హక్కుల లేకపోవటం, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అవకాశాలు లేకపోవటంతో రుణాలు అందటం గగనంగా మారింది. ఒకరి భూములు మరొకరికి అమ్మినా అవి రికార్డులలో నమోదు కాకపోవటంతో రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు.

09/20/2017 - 19:08

ఆరుగాలం నేలతల్లినే నమ్ముకునే రైతుల విషయంలో రాజకీయ జోక్యం సరికాదు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే స్థానిక రాజకీయాలు రైతులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. రైతు సంఘాలు రాజకీయాలకు వేదికలు కావడం మంచి పద్ధతి కాదు. రైతుకు భరోసా ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు మరింత సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాది రైతులతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ రైతుల్లో చైతన్యం తక్కువనే చెప్పాలి.

09/20/2017 - 19:07

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులను పట్టించుకునే ప్రభుత్వాలు లేవు. రైతులకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో కెసిఆర్ రైతులకు చాలా మేలు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. కాని ఆచరణలో వారికి ఎటువంటి ఫలాలు అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 39ని రద్దు చేయాలి.

09/20/2017 - 19:05

సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం, సమగ్రాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తోంది. అసంఘటితంగా ఉన్న అన్నదాతలను సంఘటితం చేసే దిశగా మూడు అంచెలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతున్నాయి. ఇదే రీతిన రైతుబంధు, రైతు మిత్ర పేర్లతో ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతు కమిటీలు ఏర్పాటవుతున్నాయి.

,
09/14/2017 - 00:12

రెండు తెలుగు రాష్ట్రాలు సొంత సచివాలయాల నిర్మాణానికి పోటీ పడుతున్నాయి. సచివాలయ రూపం, ఆకృతి, శిల్పనైపుణ్యంపై ముఖ్యమంత్రులిద్దరూ అనేక నమూనాలను పరిశీలించారు. అందులో ప్రపంచ ప్రమాణాలను తలదనే్నలా ఉన్న కొన్ని నమూనాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిలో తాత్కాలిక సచివాలయం ఇటీవలె పూర్తయింది. తెలంగాణలో సచివాలయ భవనం పనిచేస్తూనే ఉంది.

09/14/2017 - 00:09

బైసన్ పోలో గ్రౌండ్‌కు సచివాలయాన్ని తరలించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. తరలింపును కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలతో కలిసి అడ్డుకుంటుంది. వాస్తు బాగా లేదన్న వంకతో సచివాలయాన్ని తరలించాలన్న ఆలోచన మంచిది కాదు. వాస్తు బాగా ఉన్నందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అసలు ఆరు నెలలకు ఒకసారి సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి వాస్తుతో పని ఏముంది.

09/14/2017 - 00:08

ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. అత్యవసరంగా ఫైర్ ఇంజన్ వెళ్లడానికి కూడా వీలులేదు. కొత్త రాష్ట్రం ఆధునిక సౌకర్యాలతో కొత్త సచివాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నాయకులకు ఎందుకో నచ్చడం లేదు. ప్రస్తుతం 119 శాఖాధిపతుల ఆఫీసులు, 89 ఇతర కార్యాలయాలో అద్దె భవనాల్లో ఉన్నాయి.

Pages