S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

06/22/2017 - 00:01

స్కూల్ ఫీజు 20 లక్షలు అంటే చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు, కాని అలాంటి సకల సదుపాయాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అత్యధిక ఫీజు ఉండే స్కూళ్లకోసం కొంతమంది వెదికి పట్టుకుని అందులోనే తమ పిల్లల్ని చేర్చడంద్వారా తమ హోదాను, సామాజిక స్థితిని తేటతెల్లం చేస్తుంటారు. అలాంటి పాఠశాలల్లో చేరే విద్యార్ధులు అంతా అదే ఆర్థిక స్థోమతతో ఉంటారుకనుక దానినే సమసమాజంగా భావించే కుటుంబాలున్నాయి.

06/21/2017 - 23:59

విద్య అనేది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. తల్లితండ్రులు తమ పిల్లల చదువుకు సంబంధించిన ఫీజులను భరించలేమన్న భావనకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ధనిక, పేద అన్న తారతమ్యాలు లేకుండా అందరికీ విద్య అందుబాటులోకి వస్తుందని ప్రజలంతా భావించారు. అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ మూడేళ్ల తర్వాత కూడా చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు.

06/21/2017 - 23:58

చదువు మధ్య తరగతికి పెనుభారంగా మారింది. తమలా తమ పిల్లలు ఇబ్బందులపాలు కావద్దని బాగా చదువుకొని జీవితంలో ఎదగాలి అనే కోరికతో మధ్య తరగత ఎంతటి ఖర్చునైనా భరించి పిల్లలకు మంచి చదువు అందించాలని ప్రయత్నిస్తోంది. దీంతో కొందరికి విద్యా లాభసాటి వ్యాపారంగా మారింది. ప్రభుత్వ రంగంలోని విద్యా వ్యవస్థను నాణ్యతా ప్రమాణాలు పెంచడమే దీనికి మార్గం.

06/21/2017 - 23:57

ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలంటే తల్లిదండ్రుల ఉద్యమంతోనే సాధ్యపడుతుంది. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ప్రపంచంలో ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వహించబడేది ఒక్క భారతదేశంలోనే కావడం మనం చేసుకున్న దౌర్భాగ్యమనే చెప్పాలి. ఎక్కడైనా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా విద్యాసంస్థలు తప్పక జవాబుదారీగా ఉంటాయి. కాని ఇక్కడ పరిస్థితి వేరు.

06/21/2017 - 23:55

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత ఈ మూడేళ్ళలో విద్యారంగం పూర్తిగా అటకెక్కింది. కెజి-టు-పిజి ఉచిత విద్య సంగతి దేవుడెరుగు కానీ ఉన్న విద్యారంగానే్న రాష్ట్ర ప్రభుత్వం అధ్వాన్నంగా మార్చేసింది. ఫీజుల నియంత్రణ లేదు, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిస్తున్నది.

06/21/2017 - 23:54

కార్పొరేట్ విద్య అనేదే లేదు.. విద్యాసొసైటీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్పొరేట్ స్థాయిలో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ సొసైటీల బాగోతం ఏదోరోజు బయటపడుతుంది. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కడతారు.. సామాజిక సేవాదృక్పథంతో నిర్వహిస్తామని సొసైటీల పేరుతో విద్యాసంస్థలను రిజిస్టర్ చేయించుకుని, రాయితీలు పొందుతూ విద్యావ్యాపారాన్ని సాగిస్తున్నారు.

06/21/2017 - 23:53

ఉన్నత చదువులు పక్కన పెడితే.. పేద, మధ్య తరగతి కుటుంబీకులు అధిక ఫీజులు చెల్లించలేక అల్లాడుతున్నారు. విదేశాల్లో ఒక విద్యార్థి చదువు మొదలుకొని ఉపాధి వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఉచిత చదువుతోపాటు వౌలిక వసతుల కల్పనకు అయ్యే ఖర్చులన్నీ అక్కడి ప్రభుత్వాలే భరిస్తాయి. సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా పావులు కదుపుతోన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత విద్యపై ఎందుకు దృష్టి సారించడం లేదు.

06/21/2017 - 23:53

తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత విద్య కోర్సుల వరకు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. తల్లితండ్రులు తమ పిల్లలను పోటీపడి అప్పులు చేసి కార్పొరేట్ కానె్వంట్ స్కూళ్లలో చేరుస్తున్నారు. దీనివల్ల సమాజంలో అసమానతలు నెలకొంటున్నాయి. పెద్ద గ్రామాలకు కూడా కార్పొరేట్ పాఠశాలలు విస్తరించాయి.

06/21/2017 - 23:52

ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ పాఠశాలలు వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా వాటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతోంది. ప్రైవేటు పాఠశాలల్లో పాటించాల్సిన నియమ, నిబంధనలపై ప్రభుత్వం అనేక చట్టాలు చేసినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరిట లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయి.

06/21/2017 - 23:51

కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అక్రమంగా ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం మెమోలు, జీవోలు జారీచేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇటీవల జారీ అయిన జీవో నెం.1లో పాఠశాల నిర్వహణ ఖర్చులు, విద్యార్థుల సంఖ్యను బట్టి ఎవరిష్టానుసారం వారు ఫీజులు వసూలు చేసుకోవచ్చని చెప్పటం శోచనీయం.

Pages