S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

10/18/2017 - 18:32

ప్రజాసంక్షేమంకోసం అధికారులు పారదర్శకంగా వ్యవహరించి ప్రభుత్వం అందించే ఫలాలు ప్రజలకు సక్రమంగా చేరవేయడంలో అధికారులు వారధిగా నిలువాలి. అధికారం చేతుల్లో ఉంది కదా అని ప్రజాసొమ్మును అక్రమంగా ఆర్జిస్తే అందుకు తగినమూల్యం చెల్లించుకున్నవారు ప్రపంచంలో అనేకమంది ఉన్నారు. అధికారంలోకి రాకముందు తన కొడుకు, కూతురు అవినీతికి పాల్పడినా సహించబోనని ముఖ్యమంత్రి శపథం చేసారు.

10/18/2017 - 18:32

ప్రజలు ఏదేని పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటపుడు లంచం ఇస్తేగాని పనులు జరగవు అనే మనస్తత్వంలో ఉన్నారు. దానినుంచి ముందు బయటపడాలి. లంచం ఇవ్వడానికి స్వస్తి పలికినపుడే దీనిని కొంత మేరకైనా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అధికారులు అవినీతికి పాల్పడుతున్నప్పుడు అడపాదడపా ఎసిబి అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటం, లంచం తీసుకునేటపుడు దాడులు చేసి వారిని పట్టుకోవడం జరుగుతోంది.

10/18/2017 - 18:31

అవినీతికి పాల్పడే వారు ప్రజాప్రతినిధులైనా..అధికారులైనా ప్రజల విశ్వాసం కోల్పోవలసిందే. ప్రజాప్రతినిధులైతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలి. అధికారులైతే కఠిన చర్యలు తీసుకోవాలి. పాలనాపరమైన లొసుగులే అవినీతిని ప్రోత్సహిస్తాయి. అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులు, అధికారులను చెడగొడతారు. ప్రజాప్రతినిధిగా గెలిచిన వారు తమ ఆధిపత్యం కోసం అధికారులను అడ్డుపెట్టుకుంటారు.

10/11/2017 - 17:16

రాష్టప్రతి ఉత్తర్వులు 371-డి ప్రకారం దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, జమ్మూకాశ్మీర్‌లోనూ జోనల్ విధానం అమలులో ఉండేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇపుడు జోనల్ విధానం మూడు రాష్ట్రాల్లో అమలులో ఉంది. అప్పట్లో రెండు రాష్ట్రాల్లో కలిపి ఆరు జోన్లు ఉండేవి. ప్రస్తుతం ఆంధ్రాలో నాలుగు జోన్లు, తెలంగాణలో రెండు జోన్లు ఉన్నాయి.

10/11/2017 - 17:14

ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్న నాలుగు జోన్లు నేటికీ యథావిధిగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన వలన తెలంగాణకు రెండు జోన్లు మిగలటం ఆపై జిల్లాల సంఖ్య రెట్టింపు కావటంతో ఉద్యోగుల నియామకాల కోసం అక్కడ తక్షణం జోన్లు పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

10/11/2017 - 17:13

తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన కమిటీలో నేను కూడా ఒక సభ్యుడినే. కమిటీ వేగంగా అధ్యయనం చేసి ఈ అంశంపై సమగ్ర నివేదికను రూపొందించేందుకు ప్రయత్నిస్తాం. జోనల్ వ్యవస్థ ఉద్యోగులతో ముడిపడి ఉంది. మా ప్రభుత్వం పరిపాలనా అవసరాలకోసం 10 జిల్లాలను విభజించి 31 జిల్లాలను ఏర్పాటు చేసింది.

10/11/2017 - 17:13

తెలంగాణలో కేవలం రెండు జోన్లు మాత్రమే ఉన్నాయి. కొత్తగా 21జిల్లాల ఏర్పాటుతో జోన్ల సంఖ్య పెంచడం ద్వారా వివిధ జిల్లాల మధ్య ఉద్యోగ కేటాయింపులు, భర్తీలో అన్యాయం జరుగకుండా ఉండేందుకు జోన్ల సంఖ్యను పెంచాల్సివుంది. జోన్ల సంఖ్య పెంపు, రాష్టప్రతి ఉత్తర్వులు 371డి అధికరణ సవరణలతో ఉద్యోగాల నియామకాలు, పదోన్నతులు, పోస్టింగుల్లో వివాదాలు నివారిస్తే అందరికి సమన్యాయం జరుగుతుంది.

10/11/2017 - 17:12

జోనల్ వ్యవస్థను శాస్ర్తియ పద్ధతిలో పునర్ వ్యవస్థీకరించాలి. కొత్త జిల్లాలకు అనుగుణంగా జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే స్థానికత నిర్ధారణ యుద్ధ ప్రాతిపదికన ఖరారు చేయడం వల్ల తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపకరిస్తుంది.

10/11/2017 - 17:12

తెలంగాణలో జోన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఓసారి జోన్ల రద్దంటూ.. మరోసారి జోన్లు అవసరమంటూ ప్రకటన చేస్తున్న ప్రభుత్వం అసలు జోన్లపై స్పష్టత ఇవ్వాలి. నిరుద్యోగ సమస్య తీర్చేందుకు జోన్ల వ్యవస్థను రద్దు చేస్తున్నాం. జోన్ల రద్దుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రకటించడం, మళ్లీ జోన్ల వ్యవస్థను పటిష్టపరుస్తామంటున్న పాలకవర్గం నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తోంది.

10/11/2017 - 17:11

ఉద్యోగుల నియామకాలు, బదిలీల ప్రక్రియలో జోనల్ విధానం ఉండాల్సిందే. స్థానికత ప్రామాణికంగా జరిగే క్లాస్ 4, జూనియర్ అసిస్టెంట్ నియామకాల్లో స్థానిక కోటా జిల్లాలకే పరిమితం. బదిలీలు కూడా జిల్లా పరిధిలోనే జరుగుతాయి. అలాగే సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్‌లకు జరిగే బదిలీల్లో జోన్ కీలకం. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జోన్లలో బదిలీలు, నియామకాలకు సంబంధించి జోన్‌ల ప్రభావం ఉంటుంది.

Pages