S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

08/16/2016 - 21:57

నోరు ఎండిపోవడాన్ని ‘జీరోస్టోమియా’ అంటారు. నోరు ఎప్పుడూ తేమతో ఉండడానికి కారణం లాలాజలం. ఈ లాలాజలాన్ని నోటిలోని లాలాజల గ్రంథులు ఉత్పత్తి చేస్తుంటాయి. కావలసినంత లాలాజలాన్ని లాలాజల గ్రంథులు ఉత్పత్తి చేయలేకపోతున్నప్పుడు నోరెండిపోతుంటుంది.

,
08/16/2016 - 21:44

ప్ర: మన పూర్వులు తిన్న వంటకాలకూ ఇప్పుడు మనం తింటున్న వంటకాలకూ చాలా తేడా ఉంది. ఏది సరైనదో వివరిస్తారా?
-జె.డి.ప్రసాదరావు, గన్నవరం
జ: మన పూర్వులు ఆరోగ్యదాయకంగా తిన్న ఆహార పదార్థాలన్నీ మన ఆహార సంస్కృతికి సంబంధించిన విషయాలు. మన ఆహార సంస్కృతి మన దేశీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందుతుంది. ప్రపంచంలో ఏ దేశానికైనా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. మన సంస్కృతే మనల్ని నడిపిస్తోంది.

08/09/2016 - 21:35

నేడు దద్దుర్లు చాలామందిని బాధిస్తున్నాయి. దద్దుర్లనే వైద్య పరిభాషలో ‘అర్టికేరియా’ అంటారు. ఒక్కోసారి దద్దుర్లు ఆకస్మాత్తుగా చర్మంపై ప్రత్యక్షమై కంగారు తెప్పిస్తుంటాయి. డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపిస్తామని వెళ్ళేలోపే దద్దుర్లు మాయమైపోతాయి. పోయినాయి గదా ఫర్వాలేదులే అని ఊరుకుంటే మరల ఎర్రని దద్దుర్లు ప్రత్యక్షమై దురద, మంటతో బాధిస్తాయి.

08/09/2016 - 21:32

* మామూలుగా వైద్యులు గుండెమీద స్టెతస్కోప్‌ని పెట్టి, వింటుంటారు కదా! వాళ్ళకి ఏమి వినిపిస్తుంది?

08/09/2016 - 21:29

సాధారణంగా పుట్టుకకు ముందు మెదడుకి జరిగే నష్టంతో ‘సెరిబ్రల్ పాల్సీ’ వస్తుంటుంది. వీళ్ళని ‘స్పాస్టిక్ చిల్డ్రన్’ అంటారు. అంటే అవయవాలు బిగుసుకుపోతాయి. మెదడుకి ప్రాణవాయువు సరఫరా తగ్గిపోతుండడంతో ‘సెరిబ్రల్‌పాల్సీ’ వస్తుంటుంది.

08/09/2016 - 21:28

యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలి, లోపలి భాగాలు వత్తుకుపోయి రక్తస్రావం జరుగుతుంటుంది. బయటికి జరిగే రక్తస్రావంకన్నా కూడా లోపల జరిగే రక్తస్రావాల వల్ల ప్రమాదం ఎక్కువ.
బయట తగిలే గాయాల రక్తస్రావాన్ని అరికట్టి సరైన చికిత్సతో ఆ గాయాలు తగ్గేలా చూడవచ్చు. లోపల రక్తస్రావాలను వెంటనే గుర్తించి సకాలంలో వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన చికిత్సలో ప్రాణాపాయం జరగకుండా కాపాడవచ్చు.

08/09/2016 - 21:25

క్రానిక్ సైనుసైటిస్ లేక తీవ్ర జలుబుతో బాధపడుతుండే వాళ్ళకు విమాన ప్రయాణంలో చెవులు దిబ్బెళ్ళు వేస్తుంటాయి. కాబట్టి విమాన ప్రయాణానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది. ముక్కు, చెవులు దిబ్బెడ లేకుండా ‘డికంజెస్టెంట్స్’ని వాడతారు. ముక్కు ద్వారా డ్రాప్స్‌గా గాని, గాలిలో స్ప్రే చల్లి ‘సింపాథోమిమెటిక్’ మందు అందేలా చూస్తారు.

08/09/2016 - 21:24

ప్ర: నిద్ర సరిగా పట్టడం లేదు. దీనివలన ప్రమాదమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వివరంగా చెప్పగలరు?
-కానూరు రామచంద్రరావు, గుంటూరు

08/02/2016 - 21:33

కొంతమంది బాగా పొట్టిగా ఉంటారు. పిట్యూటరీ గ్రంథి లోపంవల్ల ఎత్తు ఎదగరు. మరికొన్ని కారణాలు తోడైనప్పుడే పెరగడం జరగకపోవచ్చు. వంశపారంపర్య లక్షణాలవల్ల కావచ్చు, పోషకాహారం లభించకపోవడంవల్ల ఎదుగుదల ఆగిపోవచ్చు. కొన్ని వ్యాధులూ పెరగనివ్వవు.

08/02/2016 - 21:32

రక్తంలోని ఒక రకం కణాలు లోపిస్తే ‘ఎప్లాస్టిక్ ఎనీమియా’ అంటారు. ఎర్ర రక్తకణాలు లోపించవచ్చు. ప్లేట్‌లెట్ కణాలు లోపించవచ్చు. తెల్ల రక్తకణాలు లోపించవచ్చు. ఈ స్థితిని ‘థ్రోంబోసైటోపీనియా’ అంటారు. సాధారణంగా ఈ రకం అనీమియాతో బాధపడేవాళ్ళలో మూడు రకాల రక్తకణాల లోపం ఉంటుంది. ఈ ఎనీమియా వైరల్ లేక బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌తో వస్తుంటుంది.

Pages