S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

07/26/2016 - 21:36

ఇంటి దగ్గర గాని, బయట ఎక్కడైనా గానీ ఓ వ్యక్తి స్పృహ తప్పినపుడు ఊరికే ఆదుర్దా పడడంగాని, అవతలివాళ్ళమీద కోపం తెచ్చుకుని అరవడంగాని సరికాదు. మనం అతని పట్ల బాధ్యతతో కొన్ని పనులు చేయాల్సిన అవసరముంది.
ఓ వ్యక్తి స్పృహ తప్పి సరిగా శ్వాసించలేని స్థితిలో ఉన్నప్పుడు అందించాల్సిన ప్రథమ చికిత్స గురించి తెలుసుకుందాం.

07/26/2016 - 21:29

ప్ర: షుగరు జబ్బు వస్తే మనిషి లైంగిక శక్తి తగ్గుతుందా, నివారణ చెప్పగలరా?
-జి.సదారావు, విశాఖపట్టణం
జ: షుగరు వ్యాధిలో మొదట తగిలే దెబ్బ లైంగిక వ్యవస్థమీదేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. లైంగిక సుఖం ఒక్కటి కరువైతే, కోట్ల ఆస్తులుండీ, తరగని సుఖ సౌఖ్యాలుండీ, అధికారాలుండీ ఏం ప్రయోజనం? జీవితంలోని మాధుర్యాన్ని దెబ్బతీసే ఈ వ్యాధిని ఉపేక్షించడం అనర్థదాయకం..!

,
07/19/2016 - 21:31

విరేచనాలు ప్రధానంగా రెండు కారణాల వల్ల వస్తుంటాయి. బాక్టీరియా కారణంతో కలిగే బాసిలరీ డిసెంట్రి ఒక రకం. అమీబియావల్ల వచ్చే అమీబియాసిస్ రెండోరకం. ప్రారంభ దశలో రెండు రకాల విరేచనాలు ఒకేవిధంగా ఉంటాయి. చికిత్స చేయించడానికి ఏ రకమైన విరేచనాలు అన్న విషయం తెలుసుకోవడం అవసరం.

,
07/19/2016 - 21:29

ప్రోస్టేట్ సమస్య 40 సంవత్సరాలు పైబడినవారిలో ఎక్కువగా కనబడుతుంది. ప్రోస్టేట్ గ్రంథి పెద్దది కావడంవల్ల ఈ సమస్య వస్తుంది. దీనిని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకోవాల్సి వుంటుంది.
కారణాలు
- ప్రోస్టేట్ సమస్య అనేది లైంగిక వ్యాధులవల్ల.
- గాయాలు అవటంవల్ల.
- గౌట్ సమస్యవల్ల వస్తుంటుంది.
లక్షణాలు
- మూత్రంలో మంట రావడం

07/19/2016 - 21:26

కడుపులో పుళ్లున్నవాళ్లు పాలని తాగడం మంచిదనే నమ్మిక ఉంది. మరీ ఎక్కువ పాలు తాగడం కూడా మంచిది కాదు. ఎక్కువ పాలని తాగడంవల్ల కడుపులో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి.
ఎక్కువ ఆల్కహాల్ తాగితే ఆహార నాళం లోపల ఉండే పొర దెబ్బ తింటుంది. అలాగే ఖాళీ కడుపు మీద కాఫీ తాగడం కూడా మంచిది కాదు. కాఫిన్ యాసిడ్ ఉత్పత్తిని అధికం చేస్తుంది.

07/19/2016 - 21:25

ముఖంలో ఉండే ట్రైజెమినల్ నరం స్పందనల వల్ల కలిగే ఇబ్బందిని ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటారు. దీనినే డిలోరెక్స్ అని కూడా అంటారు. ముఖంమీద తాకినా, వేడి చల్లదనాలవల్ల నొప్పి కలుగుతుంటుంది. కారణాలు తెలీదు కానీ ఈ నరంనుంచి స్పందనలు అతిగా కేంద్ర నాడీ వ్యవస్థకి చేరడంతో ఈ నొప్పి వస్తుంది. నొప్పి ఒకే స్థాయిలో ఉండదు. వచ్చి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. ట్రైజెమినల్ నరం అతి స్పందనలు నొప్పిగా మారతాయి.

07/19/2016 - 21:25

మన శరీరంలో కండరాలు పలుచబడినప్పుడు, లోపలి అవయవాలు చర్మాన్ని ముందుకు తోస్తూ బుడిపెలా కనిపించేవాటిని ‘హెర్నియా’ అంటారు. ఇలాంటి ఇబ్బంది వంశపారంపర్యంగా రావచ్చు.

07/19/2016 - 21:23

మామూలుగా జలుబు ప్రభావం శ్వాసావయవాల వరకే ఉంటుంది. ఒక్కోసారి దాని ప్రభావం శరీరమంతటా పడుతుంది. ఒక్కసారిగా వచ్చి శరీర ఉష్ణం పెరిగిపోతుంది. గొంతు రాసుకుపోతుంది. అలసిపోతారు. శరీరమంతా నొప్పులు, పొడి దగ్గు.. ఈ ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలు కొన్ని రోజులకి తగ్గుతాయి. ఒకటి రెండు వారాలు ఈ ఇన్‌ఫ్లుయెంజా ఇబ్బంది పెడుతుంది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అప్పుడప్పుడు ఇలా బాధిస్తుంటుంది. దీనికి రాకుండా వాక్సిన్ లేదు.

07/19/2016 - 21:21

గడ అంటే రేడియో ఎలెరోసార్జెంట్ టెస్ట్. ఎలర్జీల గురించి తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్ష చేస్తారు. పెంపుడు జంతువుల వెంట్రుకలు, పుప్పొడి రేణువులు, ఆహారం, మందుల ద్వారా వచ్చే ఎలర్జీల గురించి ఈ పరీక్షలో తెలుస్తుంది. ఈ పరీక్ష చర్మపరీక్షలంత కచ్చితమైనదే!
చర్మరోగాలున్న వాళ్లలో ఎలర్జీ రియాక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్ష ఎంతగానో తోడ్పడుతుంది.

07/19/2016 - 21:19

ఎముకలు విరగడంలో రకరకాలుంటాయి. కాలి ఎముక మీద భారం ఎక్కువ పడినప్పుడు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఏర్పడుతుంటాయి. వీటినే స్ట్రెస్ ఫ్రాక్టర్ అంటారు.
సాధారణంగా ఆటలు ఆడేవాళ్లు ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవుతుంటాయి. ఎక్స్‌రేతో ఈ ఫ్రాక్చర్స్‌ని గుర్తించలేం. రెండు వారాల తర్వాత నిర్ధారించినా ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు గుర్తించడానికి బోన్ స్కాన్ అవసరం రావచ్చు.

Pages