S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

10/13/2016 - 21:20

కార్ రేసులలో పాల్గొన్న మొదటిసారే ఛాంపియన్‌షిప్ గెలవడం మాటలు కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు..హైదరాబాద్ కుర్రాడు జీత్ జబక్. పేరులోనే విజయాన్ని పొందుపరుచుకున్న జీత్...గత వారం ముగిసిన ఎంఎంఎస్‌సి ఫోక్స్‌వ్యాగన్ వెంటో కప్ 2016లో విజేతగా నిలిచాడు. గతంలో ఓ సంస్థలో ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా పనిచేసిన జీత్‌కు కార్లు నడపడమంటే పిచ్చి. అయితే రేసులలో పాల్గొనడం మాత్రం ఇదే మొదటిసారి.

10/06/2016 - 23:52

వర్షంలో గొడుగు బాగానే ఉపయోగపడుతుంది. కానీ వాడిన తర్వాతే అవస్థ. తడిసిపోయిన గొడుగును ఆరబెట్టాల్సిందే. ఆఫీసులకు గొడుగు వేసుకువెళితే, దానిని ఎక్కడ ఆరబెట్టాలో తెలీదు. ఈ సమస్యనుంచి బయటపడాలంటే అన్‌నూరెల్లా ఇన్‌స్టాంట్ డ్రై అంబ్రెల్లా (శ్రీశోఖూళ్ఘ జశఒఆ్ఘశఆ జూక ఖౄఇళ్ఘ)ను కొనుక్కోవాల్సిందే. ఎంత తడిసినా, ఒక్కసారి విదిలిస్తే చాలు, ఈ గొడుగు పొడిగా మారిపోతుంది! దీని ధర 48 డాలర్లు.

10/06/2016 - 23:49

కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనిచేసే సాఫ్ట్‌వేర్ నిపుణులకు అలసటతో వారికి తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది. అప్పుడు వాళ్లేం చేస్తారు? ఉన్నచోటునే చెంపకు చెయ్యి ఆనించి కునుకు తీస్తారు. చెయ్యి నొప్పి పెడితే వెంటనే మెలకువ వస్తుంది. అలా కాకుండా ‘చిన్ రెస్ట్ ఆర్మ్’ (్ళ్దజశ ళఒఆ ఘూౄ) కొనుక్కుంటే ఆ బాధ తప్పినట్టే. డెస్క్‌కే అమర్చిన ఈ చెయ్యి మీ చెంపకు ఆని, మీకు నిద్ర పట్టేలా చేస్తుంది.

10/06/2016 - 23:47

స్మార్ట్ఫోన్లకోసం ఆర్మ్ బాండ్స్ రావడం కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటివి రకరకాల డిజైన్లలో చాలానే వచ్చాయి. అయితే ఫోవీమ్ ఆర్మ్‌బాండ్ కాస్త ప్రత్యేకమైనది. ఫోన్‌పై వేలిముద్రలు, గీతలు, దుమ్మూధూళి పడకుండా ఈ ఆర్మ్ బాండ్ కేస్ రక్షిస్తుంది. ఇదే పౌచ్‌లో ఇయర్‌ఫోన్ పెట్టుకునే సౌకర్యమూ ఉంది. ఇయర్‌ఫోన్ వాడనివాళ్లు టూవీలర్ లేదా కారు కీస్ పెట్టుకోవచ్చు. దీని ధర 19 డాలర్లు.

10/06/2016 - 23:44

ఆఫీసులో గంటల తరబడి కూర్చుని పనిచేసేవారికోసం రూపొందించిన ఓ చిన్న గాడ్జెట్- ఆఫిసైజర్ (్జచిచిజషజఒళూ). దీనిని ఉపయోగించి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని గంటకు 60 కేలరీల చొప్పున కరిగించుకోవచ్చు. మోకాలు, తొడ కండరాల పటుత్వానికి, రక్త ప్రసరణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందట.

10/06/2016 - 23:26

విమానం ఎక్కి, మేఘాల మధ్యకు దూసుకుపోవాలని...
కొండ కొన అంచుకు వెళ్లి, ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోవాలని...
స్పీడ్ బోట్ ఎక్కి రయ్యిన సముద్ర జలాలను చీల్చుకుంటూ, మున్ముందుకు వెళ్లాలని...
ఎవరికి మాత్రం ఉండదు?
ఇలాంటి ఆశలు అందరికీ తీరతాయేమో కానీ, దివ్యాంగులకు మాత్రం కాదు.

,
10/06/2016 - 23:24

పొద్దునే్న లేవకపోతే పోయేదేం లేదు...
ముచ్చటైన సూర్యోదయాన్ని చూసే అవకాశం తప్ప!
పొద్దునే్న లేవకపోతే పోయేదేం లేదు...
కాస్తంత ప్రశాంతత తప్ప!
పొద్దునే్న లేవకపోతే పోయేదేం లేదు...
శరీరానికి కావలసిన వ్యాయామం తప్ప!
పొద్దునే్న లేవకపోతే పోయేదేం లేదు...
దైనందిన ప్రణాళికను రూపొందించుకోవడం తప్ప!
-ఈ మాటలంటున్నది ఎవరో కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు,

10/06/2016 - 23:18

హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న బాకారం జాగీర్ అనే ఊరి పేరు నిన్న మొన్నటి వరకూ చాలామందికి తెలీదు. రెండున్నర వేల మంది ఉండే ఈ కుగ్రామం ఇవాళ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం వంద శాతం అక్షరాస్యత సాధించిన గ్రామంగా సాక్షర భారతి అవార్డు దక్కించుకోవడమే. దీనికి కారకుడైన ఆ గ్రామ సర్పంచ్ సుధాకర్ యాదవ్ ఇటీవల స్వయంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

09/29/2016 - 21:48

బ్లడ్ సుగర్!

09/29/2016 - 21:47

‘నువ్వు ఎక్కడికెళ్లినా మా నెట్‌వర్క్ ఫాలో అవుతుంది’- ఈ హచ్ స్లోగన్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడీ స్లోగన్ కొవారోబో ఆర్ 1 (్ళ్యత్ఘ్యీఇ్యఆ గ1)కు కూడా వర్తిస్తుంది. ఏమిటీ కోవారోబో అనుకుంటున్నారు కదూ? ఇదో ఒక రోబో సూట్‌కేసు. మీరెక్కడి వెళ్తే అక్కడికి మీ వెనకాలే పరుగెత్తుకుంటూ వస్తుంది. దానిని మోయాల్సిన అవసరం లేదు. బ్యాటరీతో చార్జ్ అయ్యే ఈ రోబో గంటకు 12.5 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Pages