S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

03/23/2017 - 22:29

హృద్రోగులకు ఊరటనిచ్చే సంఘటనలు ఇటీవలికాలంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ యువ న్యాయవాది ఆకాశాన్నంటే స్టెంట్ల ధరలపై న్యాయ పోరాటం సాగించి, వాటిని భూమార్గం పట్టించాడు. ఇప్పుడు ముక్కుపచ్చలారని ఓ పదిహేనేళ్ల యువకుడు ‘సైలంట్ హార్ట్ అటాక్స్’ను కనిపెట్టే పరికరాన్ని సృష్టించి, అందరి ప్రశంసలకూ పాత్రుడవుతున్నాడు. ఆ కుర్రాడి పేరు ఆకాశ్ మనోజ్.

03/23/2017 - 22:27

ఇష్టపడి పని చేస్తే, ఏదీ కష్టం కాదు. ఆఫీసు పనైనా అంతే. అయితే ఎంత ఇష్టమైనా, గంటల తరబడి పనిచేస్తూ ఉంటే, అలసట తప్పదు. ఆరోగ్యపరమైన సమస్యలూ తలెత్తుతాయి. కాబట్టి మధ్యలో కాస్త రిలాక్సేషన్ అవసరమే. ఇలాంటి ఉద్యోగులకోసం ప్రత్యేకంగా రూపొందిన ఓ ఆఫీస్ చైర్ మార్కెట్లో అందర్నీ ఆకట్టుకుంటోంది. చూడటానికి అచ్చం ఆఫీస్ చైర్‌లానే ఉన్నా, ఇదొక మస్సాజ్ చైర్. పేరు ఎగ్జిక్యూటివ్ ఎర్గోనమిక్ హీటెడ్ వైబ్రేటింగ్ చెయిర్.

03/23/2017 - 22:43

మన దేశంలో టాక్స్ లేని వస్తువేదైనా ఉందా?
ఎవరినడిగినా ఈ ప్రశ్నకు లేదనేదే సమాధానం!
కానీ కొన్నిటికి మాత్రం మినహాయింపు ఉంది...
అవేమిటో తెలుసా...కండోమ్స్, కాంట్రాసెప్టివ్ పిల్స్!
అవును నిజం...వీటికి టాక్స్ లేదు!
మనిషి తన దైనందిన జీవితంలో ఎక్కువగా వినియోగించే అనేక వస్తువులపై పన్ను పడుతూనే ఉంది. అలాంటివాటిలో మరీ ముఖ్యమైనది మహిళలు ఉపయోగించే శానిటరీ నాప్‌కిన్స్.

03/23/2017 - 22:17

ఇంద్రాణీ దాస్ గురించి ఇప్పుడు పరిచయ వాక్యాలు అక్కర్లేదు. ‘జూనియర్ నోబెల్ ప్రైజ్’ గెలుచుకున్న అమ్మాయిగా ఆమె పేరు పత్రికల్లో మార్మోగిపోయింది కాబట్టి.
అయితే ఆమె గురించి, ఆమె పాల్గొన్న రీజెనారన్ సైన్స్ టాలెంట్ సెర్చి కాంపిటీషన్ గురించి మాత్రం తెలుసుకోవలసిందే.

03/23/2017 - 22:15

మాకు చెత్త ఇవ్వండి
...మేం మీకు ఓ పిజ్జా ఇస్తాం!
...మీ ఫోన్‌ను రీచార్జ్ చేసి పెడతాం!
...మీకు ఆన్‌లైన్ షాపింగ్ కూపన్లు ఇస్తాం!
- ఎవరైనా ఇలాంటి ఆఫర్లు ఇస్తే, వాళ్లను పిచ్చివాళ్లనుకోవడం ఖాయం.
అడిగిందే తడవు బకెట్లకు బకెట్లు చెత్త చేతికిచ్చి, వాళ్లిచ్చే పిజ్జాలు, కూపన్లు అందుకుంటాం.

03/16/2017 - 21:49

బతకడం ఎలా?
ఇది కొందరిని వేధించే సమస్య.
నచ్చినట్టు బతకడం ఎలా?
మరికొందరిని పరీక్షించే ప్రశ్న.
ముందు బతకడం, ఆ తరువాత నచ్చినట్లు జీవించడం ఎలాగో తెలుసుకున్నాడు.. నిరూపించాడు రమేష్‌బాబు..
అతణ్ణి ఇప్పుడంతా ‘బిలియనీర్ బార్బర్’ అని పిలుస్తారు..

03/16/2017 - 21:45

మీరు ఫొటోలో చూస్తున్న బొమ్మ పేరు టాపియా అల్ రోబో కంపానియన్. నిజానికి ఇది బొమ్మ కాదు...రోబో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చూడటానికి కోడిగుడ్డు ఆకారంలో, పెద్ద పెద్ద కళ్లతో ఇట్టే ఆకట్టుకునే ఈ రోబో ఒంటరిగా జీవించేవాళ్లకి ఓ నేస్తం..ఓ సహాయకురాలు. ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే టాపియా..మనుషుల మాటల్ని, చేష్టల్ని గుర్తుంచుకుంటుంది.

03/16/2017 - 21:43

ఈ కాలం కుర్రకారు మ్యూజిక్ అంటే జాజ్, గిటార్, కీబోర్డు వంటి పాశ్చాత్య వాయిద్యాలనే ఎంచుకుంటారు. ఇక వయొలిన్ జోలికి ఎవరు వెళ్తారు? అయితే హైదరాబాద్‌కు చెందిన పీసపాటి శాండిల్య చిన్నప్పుడే వయొలిన్‌పై మనసు పారేసుకున్నాడు. అదే శ్వాసగా, అదే ధ్యాసగా అందులోనే మునిగి తేలాడు. ఇప్పుడు అతనే టాలీవుడ్‌లో సంచలనాలకు కేంద్రబిందువవుతున్నాడు.

03/16/2017 - 21:41

చూడటానికి గులాబి రంగులో బంతిలా కనబడే ఈ గాడ్జెట్ నిజానికి ఓ బుల్లి రోబో! ఇల్లంతా తిరుగుతూ దుమ్మూ ధూళిని శుభ్రం చేసే క్లీనింగ్ బాల్. పూర్తి పేరు మొకోరో రోబో క్లీనింగ్ బాల్. దీనికి ఉన్న చిన్న బటన్‌ను ఆన్‌చేసి, నేలపై వదిలేస్తే చాలు...ఇల్లంతా తిరుగుతూ నేలను శుభ్రం చేసేస్తుంది. ఏ వస్తువైనా అడ్డు వస్తే, వెంటనే దిశను మార్చుకునే గుణం కూడా ఉంది.

03/16/2017 - 21:38

పదేళ్ల కిందటి మాట!

Pages