S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2020 - 06:12

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు.

03/23/2020 - 06:09

హైదరాబాద్, మార్చి 22: జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులు, వ్యక్తులకు హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. వారి బాధ్యతను గుర్తుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు మర్యాదపూర్వకంగానే ఉన్నా, అది మాత్రం వాహనదారులకు చెంపపెట్టులా అనిపిస్తోంది.

03/23/2020 - 06:03

విజయవాడ, మార్చి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా ఆదివారం 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటించిన సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య బృందాలు, వారికి సహకరిస్తున్న పోలీసు యంత్రాంగానికి గవర్నర్ ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు.

03/23/2020 - 05:59

సబ్బవరం, మార్చి 22: విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలం అమృతపురం గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి తన ఆటోలో తీసుకెళ్ళి సూరిరెడ్డిపాలెం శివార్లలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్థానిక సీఐ ఆర్‌వీవీఎస్‌ఎస్ చంద్రశేఖరరావు తెలిపిన వివరాలివి. బాలిక(15) సబ్బవరంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది.

03/23/2020 - 05:59

గుంటూరు, మార్చి 22: విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్న వారిలోనే అధిక శాతం కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తున్నాయని, ఈ దృష్ట్యా ఎవరైనా విదేశాల నుండి వస్తే విధిగా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆదివారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ విదేశాల నుండి వచ్చినవారు వైద్య ఆరోగ్య శాఖకు కచ్చితంగా సమాచారం అందించాలన్నారు. ఈ విషయంలో వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు.

03/23/2020 - 05:58

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 22: కరోనా వైరస్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి 12గంటల నుంచి ఈ నెల 31వరకు భారతీయ రైల్వే అంతటా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల ప్రధానాధికారి సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

03/23/2020 - 05:57

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తే, ఈ పేరు అందరికీ తెలిసింది కాబట్టి, ప్రత్యేకంగా ప్రచారం
చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నారో ఏమోగానీ అదే పేరుతో బీరును మార్కెట్లోకి విడుదల చేశారు. ఉత్తర లండన్‌లోని

,
03/23/2020 - 05:50

జపాన్‌లోని మియాకో రైల్వే స్టేషన్ వద్ద ప్రదర్శనకు ఉంచిన ఒలింపిక్ క్రీడా జ్యోతి. నిషేధ ఆజ్ఞలు ఉన్నప్పటికీ, జ్యోతిని తిలకించేందుకు మాస్క్‌లు ధరించి, భారీ సంఖ్యలో హాజరైన క్రీడాభిమానులు

03/23/2020 - 05:47

జెనీవా, మార్చి 22: అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్ క్రీడా జ్యోతి ప్రజ్వలన, రిలే కార్యక్రమాలను నిర్వహించడాన్ని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. నిజానికి రిలే కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఐఓసీని టోక్యో ఒలింపిక్ కమిటీ కోరింది.

03/23/2020 - 05:45

మూతపడిన కొలరాడోలోని అమెరికా ఒలింపిక్, పారాలింపిక్ ట్రైనింగ్ సెంటర్. కరోనా వైరస్ కారణంగా స్పోర్ట్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు కొలరాడో గవర్నర్ జారెడ్ పోల్స్ ప్రకటించాడు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు మొదలుకావని స్పష్టం చేశాడు.

Pages