S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 05:25

అమరావతి, డిసెంబర్ 9: అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్కడా మలుపుల్లేని 598.830 కిలోమీటర్ల ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 (10,843 హెక్టార్లు) ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 1518.75 హెక్టార్ల అటవీ భూమి వుంది. పరిస్థితులను బట్టి సేకరణ లేక సమీకరణ ద్వారా ఈ భూమిని సమకూర్చనున్నారు.

12/10/2016 - 05:19

బెంగళూరు, డిసెంబర్ 9: నోట్ల రద్దుపై తాను మాట్లాడితే పార్లమెంటులో భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో స్పందించారు. తాను పార్లమెంటులో మాట్లాడితే భూకంపమే వస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలపై వెంకయ్య స్పందిస్తూ, ఆ భూకంపమేదో పార్లమెంటులో తాము ఎవరూ లేనప్పుడు వస్తే బాగుంటుందని అన్నారు.

12/10/2016 - 05:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుపై లోక్‌సభలో తనను మాట్లాడనీయడం లేదని, తాను మాట్లాడితే భూకంపమే వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆయన అంటూ, ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలేమిటో అన్ని విషయాలను తాను లోక్‌సభలోనే వెల్లడిస్తానని శుక్రవారం లోక్‌సభ వాయిదాపడిన అనంతరం పార్లమెంటు వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

12/10/2016 - 05:15

హైదరాబాద్/ గచ్చిబౌలి, డిసెంబర్ 9: మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, మున్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యాలు దగ్గరుండి నానక్‌రామ్‌గూడలోని ఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు.

12/10/2016 - 05:09

నల్లగొండ, డిసెంబర్ 9: నల్లధనం నిర్మూలనకు పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుండి తగిన మద్దతు లభించిందని, నల్లధనంపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్ రావు అన్నారు. శుక్రవారం ఇక్కడ బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12/10/2016 - 05:09

న్యూఢిల్లీ,డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగించాలని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

12/10/2016 - 05:08

హైదరాబాద్, డిసెంబర్ 9: భవనం కూలిన ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్ కుమార్ నాయక్‌ను కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నర్ తదితరులతో టెలిఫోన్‌లో ఆయన సమీక్షించారు.

12/10/2016 - 05:08

హైదరాబాద్, డిసెంబర్ 9: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు. ఢిల్లీ నుంచే ఇక్కడి నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై అధికారులను ముఖ్యమంత్రి ఫోన్లో అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారు.

12/10/2016 - 05:07

హైదరాబాద్, డిసెంబర్ 9: కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేయడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసి బస్సుల్లో గత నెల రోజులు అనుమతించారు. ఈ నెల 9వ తేదీ అర్ధ రాత్రి నుంచి పాత పెద్దనోట్లను అనుమతించమని టిఎస్‌ఆర్‌టిసి ఎండి జివి రమణారావు తెలిపారు.

12/10/2016 - 05:06

హైదరాబాద్, డిసెంబర్ 9: పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబును సిబిఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. ఈనెల 23 వరకు కోర్టు రిమాండ్ విధించింది. హిమాయత్‌నగర్, కార్వాన్, గోల్కొండ పోస్ట్ఫాసుల్లో సుధీర్‌బాబు ఆదేశాలతో రూ. 3కోట్ల పెద్దనోట్లు మార్చినట్లు సిబిఐ మూడు కేసులు నమోదు చేసింది. మధ్యవర్తులుగా వ్యవహరించిన నితిన్, నర్సింహారెడ్డి అనే వ్యక్తులను అరెస్టు చేశారు.

Pages