S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 03:59

శ్రీకాళహస్తి, డిసెంబర్ 3: కొత్త నోట్లు, చిల్లరకోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బ్యాంకులు, ఎటిఎంలలో నగదు నిల్వలు శనివారం నుంచి లేవు. జిల్లాకు శుక్రవారం 109 కోట్ల రూపాయల మేర నగదు రావడంతో శనివారం బ్యాంకుల నిండా జనమే. ఈ సందర్భంగా పట్టణంలోని సన్నిధివీధిలో ఉన్న భారతీయ స్టేట్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద తోపులాట జరిగింది. దీంతో బ్యాంక్ ద్వారం అద్దాలు పగిలిపోయాయి.

12/04/2016 - 03:58

విశాఖపట్నం, డిసెంబర్ 3: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కి సమీపంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. రెండు రోజుల అనంతరం కాస్త బలపడి వాయుగుండంగా మారుతుందని అంచనావేస్తున్నారు. ఇది మరింత బలపడి తుపానుగా ఉధృతం అవుతుందన్న అంచనాలు ఇప్పుడే చెప్పలేమన్నారు.

12/04/2016 - 03:58

కోరుకొండ, డిసెంబర్ 3: ఫార్మశీ రంగానికి ఉపాధి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అసోసియేషన్ (ఐపిఎ) అధ్యక్షుడు డాక్టర్ రావ్ వడ్లమూడి తెలిపారు.

12/04/2016 - 03:56

విజయవాడ, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయటంతో ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ కొత్త కరెన్సీ నోట్ల కోసం తిరుగుతూనే ఉన్నారు. దీనిని నివారించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వినూత్న చర్యలు తీసుకుంటున్నాయి. చర్యలతో పాటు వీసా కార్డులు, డెబిట్ కార్డులను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేందుకు చర్యలు చేపట్టారు.

12/04/2016 - 03:56

ఏలూరు, డిసెంబర్ 3 : రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల కొరత నివారించడానికి అవుట్ సోర్సింగ్ పద్దతిపై త్వరలోనే 400 డాక్టర్ల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని రాష్ట్ర విధాన పరిషత్తు కమిషనర్ ఎన్ దుర్గా ప్రసాద్ చెప్పారు.

12/04/2016 - 03:55

రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: తూర్పుగోదావరి జిల్లా రివర్ సిటీ రాజమహేంద్రవరం మాస్టర్ ప్లాన్‌కు ఎట్టకేలకు కౌన్సిల్ ఆమోదం లభించింది. రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో సవరించిన మాస్టర్ ప్లాన్‌కు పాలకవర్గ ప్రజా ప్రతినిధులు ఆమోద ముద్ర వేశారు.

12/04/2016 - 03:54

విజయవాడ, డిసెంబర్ 3: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీది తుగ్లక్ పాలనగా పేర్కొనడాన్ని భారతీయ యువ మోర్ఛా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.రమేష్‌నాయుడు తీవ్రంగా ఖండించారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరోపక్క ఆ పార్టీ నాయకులు విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.

12/04/2016 - 03:53

హైదరాబాద్, డిసెంబర్ 3: ఒక మహిళ నివసిస్తున్న ఇంటిని కూల్చివేసినందుకు ఒక లక్ష రూపాయలను నష్టపరిహారంగా ఆమెకు చెల్లించాలని హైకోర్టు విజయనగరం మున్సిపాలిటీని ఆదేశించింది. ఈ తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు వెలువరించారు. విజయనగరం మున్సిపాలిటీలో పూల్‌బాగ్ రోడ్డులో ఉంటున్న ఎం శ్రీదేవి అనే మహిళ తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

12/04/2016 - 03:52

అహమ్మదాబాద్, డిసెంబర్ 3: నల్లధనం స్వచ్ఛంద వెల్లడి పథకంలో రూ.13,860 కోట్లు వెల్లడించిన ప్రాపర్టీ డీలర్ మహేశ్ షా శనివారం నాటకీయ పరిణామాలలో లొంగిపోయారు. ఐటి అధికారులు మహేశ్ షా ఇంటిపై దాడులు చేయటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావటంతో ఓ గుజరాతీ చానల్ లైవ్ షోలో నేరుగా ప్రత్యక్షమై లొంగిపోయారు.

12/04/2016 - 03:51

హైదరాబాద్, డిసెంబర్ 3: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జిల్లాలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న 15 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 8 లక్షల నగదు, పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్ మండలం రాఘవపురంలో వ్యాస్ అనే ఎన్‌ఆర్‌ఐకి చెందిన 24 ఎకరాల స్థలంపై కొందరి కన్నుపడింది.

Pages