24 గంటల్లో అల్పపీడనం
Published Sunday, 4 December 2016విశాఖపట్నం, డిసెంబర్ 3: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కి సమీపంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. రెండు రోజుల అనంతరం కాస్త బలపడి వాయుగుండంగా మారుతుందని అంచనావేస్తున్నారు. ఇది మరింత బలపడి తుపానుగా ఉధృతం అవుతుందన్న అంచనాలు ఇప్పుడే చెప్పలేమన్నారు. సాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా కోస్తాలో చెదురు మదులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.