S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 03:26

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సామాజిక పింఛన్ల కింద ఎకాఎకి రూ.397 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ నిధులు బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి. కానీ చిల్లర కష్టాలతో పింఛనుదారులకు నగదు చెల్లింపులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పింఛనుదార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

12/04/2016 - 03:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై భారీగా పడినందున కేంద్రం తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. నోట్ల ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేయాల్సిన సాయంపై ఆరు అంశాలతో కూడిన ప్రతిపాదనలను కేంద్రానికి అందించారు. అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జిఎస్‌టి గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.

12/04/2016 - 03:17

మొరాదాబాద్, డిసెంబర్ 3: దేశంలో నల్లకుబేరులకు ఎక్కడికక్కడ ముకుతాడు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తాజాగా మరో షాక్ ఇచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు తెలివిగా జన్‌ధన్ ఖాతాలలో పెద్ద ఎత్తున జమ చేసుకున్న వారికి తల బొప్పికట్టించే నిర్ణయాన్ని మోదీ శనివారం ప్రకటించారు.

12/04/2016 - 03:14

అమరావతి, డిసెంబర్ 3: పెద్దనోట్ల చలామణిపై ఆంక్షల విధింపు, కొత్త నోట్ల కొరత వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి నగదు తెప్పిస్తూ మరోవైపు నగదు రహిత విధానం కోసం ఇ-పోస్ మిషన్లు తెప్పించడం కోసం చేస్తున్న కృషి ఫలించింది.

12/04/2016 - 03:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఢిల్లీలో హిందూస్తాన్ టైమ్స్ ఏర్పాటు చేసిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన అన్ని వనరులు, ఖనిజాలు ఉన్నాయి, స్నేహపూర్వక ప్రభుత్వం ఉన్నదని చంద్రబాబు చెప్పారు.

12/04/2016 - 03:04

యలమంచిలి, డిసెంబర్ 3: రాష్టవ్య్రాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రూ.150 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు.

12/04/2016 - 03:03

హైదరాబాద్, డిసెంబర్ 3: ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి వెంటనే నిధులు మంజూరు చేసి పేదలకు వైద్య సేవలు అందించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. కోట్లాది పేదలకు సంజీవని అయిన ఆరోగ్య శ్రీని అనారోగ్యశ్రీగా మార్చరాదని, ఈ పథకానికి పాడె కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమన్నారు.

12/04/2016 - 01:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఒక రంజీ మ్యాచ్‌ని రెండు పిచ్‌లపై ఆడించే విధానాన్ని అమలు చేయాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ప్రతిపాదించాడు. ఈ విధంగా ఆడితే, విదేశాల్లో టెస్టు సిరీస్‌లకు అద్భుతమైన జట్టును రూపొందించగలుగుతామని శనివారం ఇక్కడ జరిగిన లీడర్‌షిప్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సచిన్ అన్నాడు.

12/04/2016 - 01:02

న్యూఢిల్లీ: లోధా కమిటీ చేసిన సూచనలు, వాటి అమలుపై వ్యాఖ్యానించడానికి సచిన్ నిరాకరించాడు. కమిటీ సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఇప్పటికే బిసిసిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో లోధా సిఫార్సుల అమలుపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

12/04/2016 - 01:00

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా,
శోభన భారతీయతో కలిసి లీడర్‌షిప్ సదస్సుకు హాజరైన
బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (కుడి)

Pages