S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 06:20

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వివేక్‌యాదవ్‌తో సమావేశమయ్యారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. వచ్చేనెలలో పైడితల్లి జాతర జరుగుతున్నందున రోడ్లు, కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

09/24/2016 - 06:19

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక డిపో ఎదుట ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంప్లారుూస్ యూనియన్ డిపో కమిటీ కార్యదర్శి బిఆర్‌కె పరమహంస మాట్లాడుతూ డిపోలో శ్లాక్ సీజన్ పేరిట షెడ్యూళ్లను తగ్గించరాదన్నారు.

09/24/2016 - 06:19

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 23: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, కాలువలో నిలిచిపోయిన వ్యర్థాలు, పూడికను తొలగించేందుకు వారంరోజుల పాటు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.

09/24/2016 - 06:18

నెల్లిమర్ల, సెప్టెంబర్ 23: తోటపల్లి కాలువను తారకరామ ప్రాజెక్టుకు అనుసంధానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం తారకరామ ప్రాజెక్టు డిఇ సన్యాసప్పారావు, తోటపల్లి ప్రాజెక్టు జెఇపి. రవికుమార్ తంగుడిబిల్లి గ్రామంలోని భూములను పరిశీలించారు.

09/24/2016 - 06:17

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కరుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా జలాశయాలు, నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. సువర్ణముఖి, వేగావతి నదులు నుంచి మడ్డువలస ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి నాగావళి నదిలోకి 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

09/24/2016 - 06:15

ఒంగోలు,సెప్టెంబర్ 23:రాష్టవ్య్రాప్తంగా పాలకవర్గాలు లేని నగర, మునిసిపాలిటీలకు డిసెంబర్ లేదా జనవరి నెలలో ఎన్నికలు జరుగుతాయని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఎన్ లోకేష్ పార్టీశ్రేణులకు సూచించటంతో జిల్లాలో పాలకవర్గాలు లేని ఒంగోలు నగర కార్పొరేషన్, కందుకూరు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

09/24/2016 - 06:13

నెల్లూరు, సెప్టెంబర్ 23: ప్రత్యేక హోదా పేరుతో అభం శుభం తెలియని విద్యార్థుల్ని రెచ్చగొట్టే చర్యలను ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి వెంటనే మానుకోవాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డితో పాటు ఇతర నేతలు హితవు పలికారు.

09/24/2016 - 06:11

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్లే మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రిలో జరిగిన డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవంలో అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితోపాటు మంత్రి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

09/24/2016 - 06:09

సంగారెడ్డి, సెప్టెంబర్ 23: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతంలో పుష్కళంగా వర్షాలు కురియడంతో సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ప్రాజెక్టులో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోకముందే ఎగువ నుంచి వస్తున్న నీటిని బేరీజు వేసుకున్న నీటి పారుదల శాఖ అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడానికి సిద్దమయ్యారు.

09/24/2016 - 06:08

గజ్వేల్, సెప్టెంబర్ 23: గజ్వేల్ నియోజకవర్గంలో సంవృద్దిగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు జలకళలాడుతున్నాయి. గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక మండలాల పరిధిలోని 5వందలకుపైగా చెరువులు, కుంటలలో సంవృద్దిగా వరద నీరు వచ్చి చేరడంతో మత్తడుల నుండి పరవళ్ళు తొక్కుతున్నాయి.

Pages