S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 05:45

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వర్షాల వల్ల దెబ్బతిన్న జాతీయ, రాష్ట్ర రహదారులు, వంతెనలు, కాజ్‌వేలకు మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు వర్షాలవల్ల రహదారులు దెబ్బతిని సుమారు పదికోట్ల రూపాయల వరకు నష్టం కలిగినట్టు చెప్పారు. ఇది ప్రాథమిక అంచనా అని, నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

09/24/2016 - 05:35

విజయవాడ, సెప్టెంబర్ 23: దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న రూట్ రిలే ఇంటర్ లాకింగ్ పనులు రాత్రి, పగలు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి. గురువారం వరకు పాక్షికంగా మూడు ప్లాట్‌ఫారాల్లో రైళ్ల రాకపోకలు సాగగా శుక్రవారం అన్ని ప్లాట్‌ఫారాల్లోను రైళ్ల రాకపోకలను నిలిపివేసి శరవేగంగా పనులు నిర్వహించారు.

,
09/24/2016 - 05:33

విజయవాడ / గుంటూరు, సెప్టెంబర్ 23: నిన్నమొన్నటి వరకు సాగునీటి కోసం అల్లాడిన రాష్ట్రం నేడు ఎడతెగని భారీ వర్షాలతో కుదేలైంది. ఎక్కడ చూసినా నీరే దర్శనమిస్తోంది. కన్నీటిని మిగిల్చింది. వాగులూ, వంకలూ ఏకమై వరదనీరు గ్రామాలను ముంచె త్తుతోంది. లక్షలాది ఎకరాల్లోని పంట నీటిపాలైంది.

09/24/2016 - 05:32

అచ్చంపేట, సెప్టెంబర్ 23: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి తాకిడి అధికమైంది. గురువారం ప్రాజెక్టులో 29 టిఎంసిల నీటిని నిల్వ ఉంచిన ప్రాజెక్టు అధికారులు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా అధికారులతో ప్రాజెక్టు వద్ద జరిపిన సంప్రదింపుల అనంతరం శుక్రవారం 30 టిఎంసిల నీటిని నిల్వ ఉంచారు. ఎగువ నుంచి 1,05,476 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండగా, 12 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు.

09/24/2016 - 05:26

ఖమ్మం, సెప్టెంబర్ 23: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలో టేకులపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. కినె్నరసాని ప్రాజెక్టు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరుకు వరద నీరు చేరుతుండడంతో దిగువనున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

09/24/2016 - 05:22

విజయవాడ, సెప్టెంబర్ 23: వరదనీరు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తడంతో మొత్తం 70 గేట్లను 3 అడుగులమేర పైకి లేపి లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఐదేళ్ల తర్వాత మొత్తం గేట్లను పైకెత్తడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. పులిచింతల నుంచి లక్షా 70వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతున్నది.

09/24/2016 - 05:20

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: విభజన ముందు గంటలో స్పీకర్ చాంబర్‌లో ఏమి జరిగిందో నిజాన్ని బయటపెట్టాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి హృదయం దహిస్తోందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. తను రాసిన విభజన కథ పుస్తకం కట్టు కథ అయితే అసలు నిజమేమిటో జైపాల్ రెడ్డి బయటపెట్టాలన్నారు.

09/24/2016 - 05:19

విజయవాడ, సెప్టెంబర్ 23: వ్యవసాయ రంగానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ అవసరమైన మేర నీరు, విద్యుత్, ఇతర ఉపకరణాలు అందిస్తున్నందున పంటల ఉత్పాదనలో భారతదేశంలోనే ఏపి ముందుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. శుక్రవారం తన నివాస గృహం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అదృష్టవశాత్తు భారీ వర్షాలతో జలాశయలన్నీ నిండాయి.

09/24/2016 - 05:17

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: గోదావరి నది నుండి ఈ ఏడాది ఇప్పటివరకు రెండు వేల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలవగా, అందులో 21 టిఎంసిలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు అందించగలిగామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. దీనివల్ల సుమారు 10 లక్షల ఎకరాల్లో పంట సాగు జరుగుతోందన్నారు.

09/24/2016 - 05:17

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకున్నారు. ఇదివరకే హైదరాబాద్ చిరునామాలో సికిందరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి 2014 నవంబర్‌లో డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ పొందిన చంద్రబాబు చిరునామా మార్పుతో కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తన పాస్‌పోర్ట్ చిరునామాను ఉండవల్లికి మార్చుకున్నారు. ఇప్పటికే చిరునామా మార్పుకోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు.

Pages