S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 04:51

ఉప్పల్, సెప్టెంబర్ 23: హైదరాబాద్ మహానగరం ప్రజల్ని జడివాన వెంటాడుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్భందమయ్యాయి. రహదారులు చెరువు, కుంటలుగా తలపించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఉధృతికి మూసీ మురికి నీటి పిల్ల కాలువలు ఏరులై పారుతూ పొంగి పొర్లుతున్నాయి.

09/24/2016 - 04:49

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23: భారీ వర్షాలకు శేరిలింగంపల్లిలోని చెరువులు, కుంటలు, నాలాలు, కాలువలు పొంగిపొర్లుతుండటంతో రోడ్లు జలదిగ్బంధం అయ్యాయి. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరి నివాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి, బిల్డర్ల అక్రమాలు ఇప్పడు ప్రజలపాలిట శాపంలా మారాయి.

09/24/2016 - 04:48

హైదరాబాద్, సెప్టెంబర్ 23: గ్రేటర్ హైదరాబాద్‌లోని సివరేజీ పైప్‌లైన్లపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు అధ్యయన కమిటీని జలమండలి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ధ్వంసమైన 1800 ఎంఎం డాయ సివరేజీ మెయిన్ పైప్‌లైన్‌పై పూర్తి స్థాయి విచారణను వేగవంతం చేసింది.

09/24/2016 - 04:47

హైదరాబాద్, సెప్టెంబర్ 23: భారీ వర్షాలు కురిసినపుడు నీరు సజావుగా ప్రవహించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న నాలాలపై ఆక్రమణల తొలగింపుకు త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాలాల ఆక్రమణల తొలగింపు అంశంపై టౌన్‌ప్లానింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

09/24/2016 - 04:46

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తరుచూ కురుస్తోన్న వర్షాల కారణంగా వీధుల్లో, రోడ్లపై రోజుల తరబడి వరద నీరు నిల్చి ఉండటంతో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి వెల్లడించారు.

09/24/2016 - 04:46

కాచిగూడ, సెప్టెంబర్ 23: నగరంలో మూసీ నాలా ప్రక్షళణకు శ్రీకారం చుట్టాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజా జీవితం అస్తవ్యవస్తంగా తయారైందన్నారు. నారాయణగూడ మూసీనాలాను శుక్రవారం సందర్శించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భయభ్రంతులకు గురవుతున్నారని తెలిపారు.

09/24/2016 - 04:40

లోతట్టు ప్రాంతాలు జలమయం, బిక్కుబిక్కుమంటున్న నగరం ఒకరి మృతి, మరొకరు గల్లంతు
రోడ్లు జలమయం సాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో రంగంలోకి ఎన్‌డిఆర్‌ఎస్ బృందాలు
ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీలు: సిఎం ఆదేశం అర్ధరాత్రి భారీ వర్షం
గోల్నాకలో కూలిన గోడ..గాంధీనగర్‌లో కూలిన నాలా ప్రహరీ రోడ్లు నిర్మానుష్యం
జంట జలాశయాల్లోకి భారీగా చేరుతున్న నీరు జలసౌధలో కంట్రోల్ రూం... 23390794

09/24/2016 - 04:38

నార్సింగి, సెప్టెంబర్ 23: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరానికి అందించే జంట జలాశయాలల్లో భారీగానే వరద నీరు వచ్చి చేరింది. మునుపెన్నడు రాని విధంగా ఒక్కరోజు కురుసిన వర్షానికే జంట జలాశయాలల్లో భారీగా వరద నీరు వచ్చింది. కొన్ని నెలలుగా పూర్తిగా ఎండిపోయిన జంట జలాశయాలల్లో కొత్తగా నీరు రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

09/24/2016 - 04:38

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రంగారెడ్డి జిల్లాలోని 37 మండలాల్లోని 13 మండలాల్లో పది సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అదే విధంగా శుక్రవారం కురిసిన వర్షంతో 7 నుండి 11 సె.మీ వరకు వర్షపాతం చేరుకుంది. మల్కాజిగిరిలో అత్యధికంగా 11.4సెం.మీలు, అత్యల్పంగా గండ్వీడ్ మండలంలో 1.8 సెం.మీల వర్షపాతం నమోదైంది.

09/24/2016 - 04:37

హైదరాబాద్, సెప్టెంబర్ 23 నగరానికి మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయన్న హెచ్చరికలుండటంతో మంత్రి కెటిఆర్ ఉదయం నుంచి జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని అధికారులతో, కంట్రోల్ రూం ద్వారా పరిస్థితులను పర్యవేక్షించారు.

Pages