S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 05:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రియోలో ఇటీవల ముగిసిన పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు పద్మ అవార్డులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. పురుషుల హై జంప్ విభాగంలో తంగవేలు మరియప్పన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, వరుణ్ సింగ్ భాటీ కాంస్య పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో దేవేంద్ర ఝజారియాకు స్వర్ణ పతకం లభించింది. మహిళల షాట్‌పుట్‌లో దీపా పాలిక్ రజత పతకాన్ని అందుకుంది.

09/24/2016 - 05:08

కాన్పూర్, సెప్టెంబర్ 23: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలింగ్ వెలవెలబోతున్నది. వర్షం కారణంగా చివరి సెషన్ రద్దయిన రెండో రోజు ఆటలో కివీస్ బ్యాటింగ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయిన ఆ జట్టు 152 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఆ జట్టు ఇంకా 166 పరుగులు వెనుకంజలో నిలిచింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి.

09/24/2016 - 05:05

టోక్యో, సెప్టెంబర్ 23: భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న జపాన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌లో ఓటమిపాలై నిష్క్రమించాడు. దీనితో ఈ టోర్నీలో భారత్ పోరాటానికి తెరపడింది. జర్మనీకి చెందిన మార్క్ వీబ్లర్‌తో శ్రీకాంత్ చివరి వరకూ హోరాహోరీగా పోరాడాడు. ఈ మ్యాచ్‌కి ముందు అతనితో మూడు పర్యాయాలు తలపడిన శ్రీకాంత్ రెండు విజయాలను నమోదు చేశాడు.

09/24/2016 - 05:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎస్‌ఎఫ్) ఎన్నికలు ఈనెల 25న జరగనుండగా, పరిశీలకుడిగా ఎడ్గర్ టన్నర్‌ను పంపాలని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐఎబిఎ) నిర్ణయించింది. ఆస్ట్రేలియాకు చెందిన టన్నర్ ఐఎబిఎకు విదేశాల్లో ఎన్నికల పరిశీలక కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. బిఎస్‌ఎఫ్ ఎన్నికలను పర్యవేక్షించడానికి అతను శనివారం భారత్ చేరుకుంటాడు.

09/24/2016 - 05:02

టోక్యో, సెప్టెంబర్ 23: చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బొరా స్ట్రికోవాతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇక్కడ జరుగుతున్న టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో సానియా, స్ట్రికోవా జోడీ 6-2, 6-2 తేడాతో గాబ్రియేల డబ్రోవ్‌స్కీ (కెనడా), మరియా జోస్ మార్టినా సాంచెజ్ (స్పెయిన్) జోడీపై సునాయాసంగా గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

09/24/2016 - 05:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) 2015-16 ఆర్థిక సంవత్స రంలో 111.83 కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించింది. ఇది భారీ మొత్తమే అయనప్పటికీ, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 55 కోట్ల రూపాయలు తక్కువ. ఖర్చుల కంటే రాబడి గత ఏడాది 166.87 కోట్ల రూపాయలుకాగా, ఈసారి లాభం తగ్గిందని బిసిసిఐ కోశాధికారి అనిరుద్ధ్ చౌదరి తెలిపాడు. బోర్డు ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని అన్నాడు.

09/24/2016 - 04:55

వికారాబాద్, సెప్టెంబర్ 23: వికారాబాద్ జిల్లా కేంద్రం కావడం ఖాయమని, జిల్లా కేంద్రం కాకపోతే రాజీనామా చేస్తామని వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు ప్రకటించారు.

09/24/2016 - 04:54

జీడిమెట్ల: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీలో రాష్ట్ర మంతి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్‌లు శుక్రవారం పర్యటించారు. కాలనీలో వరద నీటిలోనే పాదయాత్రలో బాధితులను పరామర్శించారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీకి ఆనుకున్న ఉన్న తుర్కచెరువును పరిశీలించారు. జూపల్లి మాట్లాడుతూ బాధితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, భయాందోళనకు గురికాకూడదని సూచించారు.

09/24/2016 - 04:54

ఖైరతాబాద్, సెప్టెంబర్ 23: గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరాన్ని వీడటం లేదు. భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి. దీంతో నగరవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు క్షణ క్షణం భయంతో జీవిస్తున్నారు.

09/24/2016 - 04:52

జీడిమెట్ల, సెప్టెంబర్ 23: నిజాంపేట్ గ్రామం, బండారి లే అవుట్ కాలనీ బాధితులు ఉండాలా.. పోవాలా.. అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ప్రకటిస్తే లోపాయికారీగా కొందరు ఉండాలని చెబుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఫ్లాట్‌లకు తాళాలు వేసి వెళితే దొంగలు దోచుకుంటారనే రూమర్‌లు నెలకొన్నాయి.

Pages