S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 06:08

కొల్చారం, సెప్టెంబర్ 23: కన్న కొడుకును రక్షించబోయి తండ్రి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం కొల్చారం మండలం కొంగోడ్ గ్రామ శివారులోని అల్లువాని బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన నాయిని శ్రీనివాస్ వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి కారును కిరాయికి తీసుకొని వచ్చారు.

09/24/2016 - 06:07

మెదక్, సెప్టెంబర్ 23: భారీ వర్షాలతో గత అర్ధరాత్రి ఇల్లు కూలి తల్ల్లీబిడ్డలు మరణించిన సంఘటన మెదక్ పట్టణాన్ని దుఃఖ సముద్రంలో ముంచింది. పట్టణంలోని గోల్కొండ వీధిలో ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మించిన ఇల్ల్లు వర్షానికి కూలి గుడిసెపై పడింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న అస్తగ్రల కళావతి (45), ఆమె కుమార్తె తులసీ భవాని (8) మరణించారు.

09/24/2016 - 06:07

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 23: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తతతో ఉండాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశపై పరిస్థితిని సమీక్షించారు.

09/24/2016 - 06:05

జగిత్యాల, సెప్టెంబర్ 23: రైతాంగానికి వ్యవసాయ మార్కెట్లు దేవాలయాల వంటివని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం జగిత్యాల ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణస్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి ఎంపి కవిత ముఖ్యఅతిధగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పడిన తరువాత మార్కెట్ పాలకవర్గాల్లో మహిళలకు ప్రాతిని ధ్యం కల్పించిన ఘతన కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

09/24/2016 - 06:04

వరంగల్, సెప్టెంబర్ 23: జిల్లాలో గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తు న్న వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి సమస్యాత్మక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు.

09/24/2016 - 06:02

బాసర, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా బాసరలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గ్రామంలోని పలు ప్రైవేటు పాఠశాలలు వర్షం కురవడంతో నీటిలో మునిగాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. గ్రామంలోని రవీంద్రపూర్, మైలాపూర్, శారదానగర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఇబ్బందుల పాలయ్యారు.

09/24/2016 - 06:00

నిజామాబాద్, సెప్టెంబర్ 23: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

09/24/2016 - 05:56

హైదరాబాద్, సెప్టెంబర్ 23: హైదరాబాద్ నగరం భారీ వర్షాలు, వరదలతో వణికిపోతోంది. రోడ్లన్నీ వాగు లు, వంకలుగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. మూడురోజుల పాటు కురిసిన వర్షాల వల్ల సికిందరాబాద్‌లో సంతోష్ అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి మృతి చెందాడు. వందలాది అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరడంతో అపార్ట్‌మెంట్ల ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. హుస్సేన్‌సాగర్‌లోకి శుక్రవారం కొంత ఇన్‌ఫ్లో తగ్గింది.

09/24/2016 - 05:54

హైదరాబాద్/ సంగారెడ్డి, సెప్టెంబర్ 23:తన అనుభవంలో ఇంత భారీ వర్షాలు ఎన్నడూ చూడలేదని, ఈ వర్షాలు భవిషత్తుకు శుభసూచకంగా తాను భావిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే అయినా సంయమనంతో ఉండాలని ప్రజలకు సూచించారు.

09/24/2016 - 05:51

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా శుక్రవారం మెదక్ జిల్లాలో ఐదుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, నల్లగొండలో ఇద్దరు మరణించారు. వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలలో అనేక కాలనీలు నీటమునిగాయి.

Pages