S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 00:06

కమలాపురం, సెప్టెంబర్ 23: కమలాపురం మండలం పొడదుర్తి గ్రామపంచాయతీలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతి చోటు చేసుకోవడంతో ఇందుకు బాధ్యులను చేస్తూ ఇద్దరు ఎంపిడిఓలను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎంపిడివో కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి.

09/24/2016 - 00:06

పెండ్లిమర్రి,సెప్టెంబర్ 23: కృష్ణాజలాలపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మధ్య వాగ్వివాదం జరుగుతున్న సందర్భంగా ఆంధ్రరాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నికరజలాల వాటాను తేల్చాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి డిమాండ్ చేశారు.

09/24/2016 - 00:05

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 23: గణపతి సచ్చిదానందస్వామి దత్తపీఠాలను దేశవ్యాప్తంగా స్థాపించిన పరమపూజ్యులైన స్వామీజీకి ప్రొద్దుటూరు పట్టణమే యోగా నేర్పిందని, ఇలాంటి ప్రొద్దుటూరు విశిష్టమైందని దత్తపీఠం రెండవ పీఠాధిపతి శ్రీశ్రీ దత్తవిజయానందతీర్థస్వామీజీ అన్నారు.

09/24/2016 - 00:05

లక్కిరెడ్డిపల్లె,సెప్టెంబర్ 23: మండలంలోని పారిశుద్ధ్యం పనులు వెంటనే చేపట్టాలని స్థానిక ఎంపిడివో సభాభవన్‌లో ఎంపిడివో స్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్దప్రాతిపదికన వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులవల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నారు.

09/24/2016 - 00:04

గాలివీడు, సెప్టెంబర్ 23: మండలంలోని గుండ్లచెరువు గ్రామ పంచాయతీ పసుపులవాండ్లపల్లెకు చెందిన ముగ్గురు అనాథ బాల బాలికలను ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని సర్వశిక్షా అభియాన్(రాజీవ్ విద్యామిషన్) రాష్ట్ర సాంకేతిక సహాయకులు డాక్టర్ పెంచలయ్య పేర్కొన్నారు. శుక్రవారం గురునాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో అనాథ పిల్లలను పరామర్శించి వారి తల్లిదండ్రుల మృతిపై వారితో ఆరా తీశారు.

09/24/2016 - 00:04

కడప,సెప్టెంబర్ 23: గండికోట వారసత్వ ఉత్సవాలు అక్టోబర్ 16,17వ తేదీల్లో గండికోటలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కెవి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో గండికోట ఉత్సవాల నిర్వహణకు ఏర్పిటుచేసిన కమిటీలతో కలెక్టర్ సమావేశమయ్యారు.

09/24/2016 - 00:03

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 23: రైతులు తమ ఉల్లి పంటను రైతు బజారులో అమ్ముకోవచ్చని మార్కెటింగ్ సంచాలకులు బి.శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

09/24/2016 - 00:03

కడప,సెప్టెంబర్ 23: పట్టణసుందరీకణ కోసం కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు తయారు చేయాలని మేయర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా పేర్కొన్నారు.

09/24/2016 - 00:02

రాయచోటి, సెప్టెంబర్ 23: జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర జ్వరాలు ప్రబలుతున్న నేపత్యంలో కలెక్టర్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు జిల్లా మలేరియా అధికారి త్యాగరాజు అన్నారు. రాయచోటి పీపీ యూనిట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనవరి నుండి జ్వరబాధితుల నుండి 3,09,264 మందికి రక్తనమూనాలను సేకరించినట్లు తెలిపారు.

09/24/2016 - 00:00

గుంటూరు, సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా గడిచిన మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలతో సంభవించిన వరద నష్టం అంచనాలకు మించుతోంది. ప్రధానంగా సత్తెనపల్లి, చిలకలూరిపేట, క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, బాపట్ల, రేపల్లె తదితర మండలాలను వరద ముంచెత్తడంతో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Pages