S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనాథ పిల్లలకు ప్రభుత్వ సహాయం

గాలివీడు, సెప్టెంబర్ 23: మండలంలోని గుండ్లచెరువు గ్రామ పంచాయతీ పసుపులవాండ్లపల్లెకు చెందిన ముగ్గురు అనాథ బాల బాలికలను ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని సర్వశిక్షా అభియాన్(రాజీవ్ విద్యామిషన్) రాష్ట్ర సాంకేతిక సహాయకులు డాక్టర్ పెంచలయ్య పేర్కొన్నారు. శుక్రవారం గురునాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో అనాథ పిల్లలను పరామర్శించి వారి తల్లిదండ్రుల మృతిపై వారితో ఆరా తీశారు. పసుపులవాండ్లపల్లెకు చెందిన మంజుల, చిన్నరమణ, షర్మిల దంపతులకు రెడ్డ్భిరతి, రెడ్డిమహేష్, తేజేశ్వణిలు సంతానం కలరు. అయితే చిన్నరమణ టీబీ వ్యాధికి గురై రెండేళ్ల క్రితమే మృత్యువాతకు గురయ్యారు. నిర్మల కూడా షుగర్ వ్యాధితో గత నెలలో అకాల మరణం చెందింది. దీంతో వీరు అనాథలుగా మారి, కాలు విరిగి మంచంలో పడ్డ నానమ్మ నారాయణమ్మ మాత్రమే దిక్కుమారింది.
రెడ్డ్భిరతి ప్రకాశం జిల్లా ఒంగోలులోని గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్, రెడ్డి మహేష్ మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి, తేజేశ్వణి గురునాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి విద్యనభ్యసిస్తున్నారు. తల్లీతండ్రి లేని అనాథల దీనావస్థను చూచి ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర స్థాయి అధికారులు వీరికి చేయూతనివ్వడానికి ముందుకువచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర అధికారి మాట్లాడుతూ అనాథ పిల్లల దీన పరిస్థితిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు. రెడ్డ్భిరతి చదువుతున్న కళాశాల యాజమాన్యంతో చర్చించి ఆమెకు చేయూతనిస్తామని రెడ్డిమహేష్‌ను కడప అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తామని తేజశ్విణిని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చేర్పించి ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఈఈ కేదారేశ్వరరెడ్డి, డీఈఈ నరసింహప్రసాద్, ఏఈ జిలానీబాష, ఎంఈవో పెంచలయ్య, ఉపాధ్యాయులు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
దీనావస్థలో నానమ్మ
అనాథ బాలల నానమ్మ నారాయణమ్మ ప్రస్తుతం కాలు విరిగి మంచంపట్టి దీనావస్థలో ఉండగా కొడుకు, కోడలి మృతితో మరింత దీనావస్థ పరిస్థితి ఏర్పడిందని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనాథ పిల్లలను మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాల్సిందిగా గ్రామస్థులు కోరారు.