S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 00:13

అనంతపురం, సెప్టెంబర్ 23 : ఆర్‌ఎంపి క్లినిక్‌లు ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(ప్రైమరీ హెల్త్ సెంటర్స్)గా కొనసాగనున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన మెడికల్ కోర్సులు చదవని వారు సైతం ఆస్పత్రుల పేరుతో బోర్డులు పెట్టి క్లినిక్‌లు నడుపుతూ ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నట్లు జిల్లాధికారులు గుర్తించారు.

09/24/2016 - 00:12

నల్లమాడ, సెప్టెంబర్ 23:పారిశుద్ధ్యంపై ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పరిశుభ్రతా చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో నల్లమాడ మాత్రం మురికి మాడగా మారుతోంది.

09/24/2016 - 00:11

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 23 : మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలు, అక్రమ లేఔట్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి తులసీరాం నేతృత్వంలో సిబ్బంది శుక్రవారం స్థానిక చౌడేశ్వరి కాలనీలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవన సముదాయాన్ని కూల్చివేశారు.

09/24/2016 - 00:11

గుంతకల్లు, సెప్టెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశుభ్రత, పచ్చదనాన్ని కొనసాగించాలని రైల్వే డివిజినల్ మేనేజర్ అమితాబ్‌ఓజా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలోని సమావేశ భవనంలో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం కింద చేపట్టిన పరిశుభ్రత, పచ్చదనం మరింత విస్తతంగా చేపట్టాలన్నారు.

09/24/2016 - 00:11

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 23 : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైల్వే అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ప్రయాణికుల కోసం అమలు చేస్తున్న సదుపాయాల గురించి స్టేషన్‌లో ప్రయాణికులతో అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై అడిగి తెలుసుకున్నారు.

09/24/2016 - 00:10

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 23:ఎస్‌ఎ.రావతార్ ఫ్యాక్టరీలో తొలగించిన 183 మంది కార్మికులను వెంటనే విధుల్లకి తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని పరిగి మండలంలో గల ఎస్‌ఎ.రావతార్ ఫ్యాక్టరీలో తొలగింపబడ్డ కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా శుక్రవారం సంఘీభావ సభ నిర్వహించారు.

09/24/2016 - 00:10

చిలమత్తూరు, సెప్టెంబర్ 23 : మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నివాసం ఉంటున్న ఆర్షియాభాను (13) గత బుధవారం కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయితే బెంగళూరులో చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పితో బాధ పడుతుండటంతో భరించలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

09/24/2016 - 00:09

అనంతపురం, సెప్టెంబర్ 23 : జీడిపల్లిలో నిల్వ ఉంచిన హంద్రీనీవా నీటిని శనివారం గొల్లపల్లి రిజర్వాయర్ కాలువకు విడుదల చేయనున్నారు. పంపనూరు గ్రామ సమీపంలోని శింగంపల్లి వద్ద నేటి ఉదయం 10.45 గంటలకు జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ కోన శశిధర్ విడుదల చేయనున్నారు.

09/24/2016 - 00:07

కడప,సెప్టెంబర్ 23: కడప నగర పాలక సంస్థలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వైకాపా, టిడిపి పాలక వర్గ సభ్యులు పరస్పరం మాటలయుద్ధానికి దిగారు. దీంతో సభ రసాభాసగా మారింది. వైకాపానేత, నగర పాలక మేయర్ కె.సురేష్‌బాబు అధ్యక్షతన సమావేశం జరిగినా ఆయన పెద్దగా నోరుమెదపలేదు. ఇరుపార్టీలకు చెందిన కార్పొరేటర్లు నగరంలోజరిగిన అభివృద్ధి పనులు నాసిరకంగా జరిగాయని అధికారులపై విరుచుకుపడ్డారు.

09/24/2016 - 00:07

కడప,సెప్టెంబర్ 23: కాపులు (బలిజలు)లను బిసి జాబితాలో చేర్చేందుకు మంజునాధ్ కమిటీని ఏర్పాటుచేయడం ఆ కమిటీ జిల్లాకు ఈనెల 26న జిల్లాకు రావడంతో కాపు సంఘం, బిసి కులసంఘాలు తమ వాణిని విన్పించేందుకు సిద్దమయ్యారు.

Pages