S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2016 - 00:50

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రా బ్యాంకు తమ ఖాతాదారులకు ఆరోగ్య, సాధారణ బీమా వసతి కల్పించేందుకు సిగ్నా టిటికె కంపెనీ లిమిటెడ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థలతో కార్పొరేట్ ఒప్పందాలను కుదుర్చుకుంది.

09/24/2016 - 00:50

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ఢిల్లీ నుంచి విశాఖకు మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు విశాఖ నుంచి విమానాల రాకపోకలకు అవరోధంగా నిలిచాయి. అయితే విశాఖ విమాన ప్రయాణికుల విజ్ఞప్తికి స్పందించిన పౌర విమానయాన శాఖా మంత్రి పి అశోక్ గజపతిరాజు ఢిల్లీ నుంచి మరో సర్వీసును విశాఖకు నడిపేందుకు అంగీకరించారు.

09/24/2016 - 00:43

కాలానుగుణంగా అనివార్యమైన మార్పులను స్వాగతించాల్సిందే! ఏ వ్యవస్థలోనైనా మార్పుతోనే రాణింపు ఉంటుందన్న వాస్తవం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కాలం చెల్లిన, వర్తమానానికి ఏ మాత్రం ఉపయోగపడని ఎన్నో చట్టాలకు దశలవారీగా కేంద్రం చరమగీతం పాడుతున్న నేపథ్యంలో తాజాగా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కూ స్వస్తి పలికి దాన్ని వార్షిక సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం అభినందనీయ పరిణామం.

09/24/2016 - 00:41

స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి మరింత చొచ్చుకుని వెళ్ళాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావించింది. ఆ దిశగా అడుగులు వేసి ఈ నెల 19, 20 తేదీల్లో నగరంలో స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేసినా, ఏ మేరకు ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందన్న ఆత్మావలోకనంలో నేతలు పడ్డారు.

09/24/2016 - 00:40

‘‘అన్ని ప్రత్యామ్నాయాల తర్వాత ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థ దుర్మార్గమైన పరిపాలనే అందిస్తుంది కానీ ప్రజా సమస్యలన్నిటికీ సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపదు...’’ అన్న విన్సిటన్ చర్చిల్ మాటలతో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ, ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాల్ని విశే్లషిస్తే ఈ మాటల్లో నగ్న సత్యం కనపడుతుంది.

09/24/2016 - 00:40

ఎటు చూసినా బాంబులు అది రెస్టారెంటైనా కావొచ్చు, పాఠశాలైనా కావొచ్చు లేదా మసీదు, చర్చి, దేవాలయమైనా కావొచ్చు. ఐ.ఎస్ ఉగ్రవాదుల నరమేధం కొనసాగుతోంది. తాజాగా ఢాకాలో పేలుడు జరిగిన కొద్దిసేపటికి ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ ఆలీ ఆబాదీ కరాదాలోని ఘటనా స్థలికి వస్తే ‘దొంగ’గా అభివర్ణిస్తూ ప్రధాని కాన్వాయ్‌పై రాళ్ళు, చెప్పుల వర్షం కురిపించారు.

09/24/2016 - 00:39

అన్నదానం, వస్తద్రానం కంటే అవయవ దానం చాలా గొప్పది. బ్రెయిన్‌డెడ్ అయిన వారి, కోమాలోకి వెళ్లి సాధారణ పరిస్థితికి రావడం అసాధ్యమైన పరిస్థితులలో క్షతగాత్రుని రక్తసంబంధీకుల అనుమతితో, చట్టపరమైన అనుమతుల ద్వారా అవయవ దానం చేస్తే ప్రత్యక్షంగా మరొక రోగికి పునర్‌జీవితం ప్రసాదించిన వారౌతారు. విదేశాలలో ఈ అవయవ దానంపై మంచి అవగాహన కలిగి నిస్వార్థంగా దానం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

09/24/2016 - 00:14

అనంతపురం, సెప్టెంబర్ 23 : జిల్లాలో డెంగ్యూ, విష జ్వరాలు మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. వివిధ వ్యాధుల బారిన పడి ఆసుపత్రులో మృతి చెందిన చిన్నారుల సంఖ్య శుక్రవారానికి ఐదుకు చేరగా, మరో మహిళ కర్నూలులో మృతి చెందింది. వీరిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ముగ్గురు డెంగ్యూ బారిన పడి తుది శ్వాస వదిలారు.

09/24/2016 - 00:14

హిందూపురం, సెప్టెంబర్ 23 : నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాలయ్య స్థానికంగా ఉండకపోవడం.. ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారం పట్ల దృష్టి కేంద్రీకరించకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి.

09/24/2016 - 00:13

అనంతపురం, సెప్టెంబర్ 23: జిల్లాకు 50 వేల కింటాళ్ల పప్పుశెనగ విత్తనాలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. ఇందులో ఎపి సీడ్స్ ద్వారా 30వేల క్వింటాళ్లు, ఎపి ఆయిల్ ఫెడ్ ద్వారా 20వేలు క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. 2016-17 సంవత్సరం రబీకి సంబంధించి పప్పుశెనగ పంపిణీపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Pages