S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పర్యావరణాన్ని పరిరక్షించాలి

కరీంనగర్ టౌన్, జూలై 22: పర్యావరణ పరిరక్షణ సమాజంలోని ప్రతి పౌరునిపై ఉందని ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని సిఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రాథమిక హక్కుగా భావించి ప్రతి పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా పోలీసుశాఖ అద్వర్యంలో ఇప్పటివరకు 11 లక్షల మొక్కలు నాటడం జరిగిందని, హరితహారం కార్యక్రమం ఇంకా మూడు నెలల పాటు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో బిషప్ కె.రూబెన్ మార్క్, ఎస్పీ సతీమణి డాక్టర్ ఎ.రాజప్రతీష, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్‌బిఐ కె.సతీష్‌చందర్‌రావు, ఎస్‌ఐలు వెంకటరెడ్డి, చిరంజీవాచారి, నారాయణ, రాజమల్లు పాల్గొన్నారు.