S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 05:14

ముంబయి, జూలై 4: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణంపై వన్-టైమ్ సెటిల్మెంట్ కోసం ఎస్‌బిఐ సిద్ధమైందని తెలుస్తోంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని ఈ దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి విమానయాన సేవలకు దూరమైనది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నాయకత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయి పడింది.

07/05/2016 - 05:13

ముంబయి, జూలై 4: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్రెగ్జిట్ అనంతరం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సంకేతాలు, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 133.85 పాయింట్లు పుంజుకుని 27,278.76 వద్ద నిలిచింది. నిరుడు అక్టోబర్ 26 నుంచి గమనిస్తే సెనె్సక్స్‌కు ఇదే గరిష్ఠ స్థాయి.

07/05/2016 - 05:12

న్యూఢిల్లీ, జూలై 4: వెండి ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం మొత్తంగా 3,000 రూపాయలకుపైగా పెరిగిన ధర.. సోమవారం ఒక్కరోజే 28 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 2,155 రూపాయలు ఎగిసింది. తద్వారా కిలో ధర 47,715 రూపాయల వద్దకు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 44 శాతం ధర పెరగడం గమనార్హం.

07/05/2016 - 05:12

హైదరాబాద్, జూలై 4: ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ (రిసెర్చ్ ఎమెరిటీస్) ప్రొఫెసర్ డి బాలసుబ్రహ్మణ్యాన్ని చైర్మన్‌గా లైఫ్ సైనె్సస్ అడ్వయిజరీ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

07/05/2016 - 05:11

హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను చైనా ప్రతినిధి బృందం సోమవారం పరిశీలించింది. చైనాలోని చెంగ్‌షా, హునన్ ప్రావెన్సీకి చెందిన ప్రతినిధి బృందం తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను సోమవారం సచివాలయంలో కలిసింది. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రతినిధి బృందానికి అరవింద్ కుమార్ వివరించారు.

07/05/2016 - 05:10

హైదరాబాద్, జూలై 4: గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సూచించారు. సోమవారం ఇక్కడ ఐటిసి కాకతీయలో జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌ట్యాప్సి) శత వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.

07/05/2016 - 05:03

లండన్, జూలై 4: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ రేసులో ఉన్న మూడో సీడ్ అగ్నిస్కా రద్వాన్‌స్కా అనూహ్యంగా ప్రీ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్న డొనినికా సిబుల్కొవా 6-3, 5-7, 9-7 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన రద్వాన్‌స్కాను ఆత్మరక్షణలోకి నెట్టిన సిబుల్కొవా తొలి సెట్‌ను సులభంగా గెల్చుకుంది.

07/05/2016 - 04:57

లండన్: కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తన ఖాతాలో మరో టైటిల్‌ను గెల్చుకున్న దిశగా ముందడుగు వేశాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అతను స్టీవ్ జాన్సన్‌ను 6-2, 6-3, 7-5 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు.

07/05/2016 - 04:56

న్యూఢిల్లీ, జూలై 4: రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌కు వెళ్లి విజేతలుగా తిరిగిరావాలంటూ వారికి వీడ్కోలు పలికారు. మానెక్‌షా సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రియోకు వెళ్లే భారత బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. హాజరైన ప్రతి ఒక్కరినీ ఆయన స్వయంగా కలవడం విశేషం. కొంత మంది అథ్లెట్లు ప్రధానితో సెల్ఫీలు దిగారు.

07/05/2016 - 04:55

యూగేన్, జూలై 4: ఉసేన్ బోల్ట్ చిరకాల ప్రత్యర్థి జస్టిన్ గాట్లిన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదంచాడు. జమైకా క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో అతను 100 మీటర్ల లక్ష్యాన్ని 9.8 సెకన్లలో చేరుకొని స్వర్ణ పతకాన్ని సాధించాడు. ట్రైవాన్ బ్రోమెల్ 9.84 సెకన్లతో రెండో స్థానాన్ని ఆక్రమించగా, 9.98 సెకన్లలో గమ్యాన్ని చేరిన మార్విన్ బ్రాసీకి కాంస్య పతకం లభించింది.

Pages