S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 02:31

విజయవాడ, జూలై 4: నూతన రాజధాని అమరావతిలో ఐటి అధారిత వౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలన్న అంశంపై సోమవారం ఏపి సిఆర్‌డిఏ ఆధ్వర్యంలో జపాన్ ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలు, పోలీసు శాఖ, ఏడిసి, ఎపిఎస్ ఆర్డీసీ, రాజధాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్లతో సమావేశం జరిగింది.

07/05/2016 - 02:30

ఇంద్రకీలాది, జూలై 4: కృష్ణా పుష్కరాలకు సాధ్యమైనంత వరకు దుర్గగుడి అభివృద్ధి పనులను పూర్తిచేసేలా వేగవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇన్‌చార్జ్ ఇవో ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఆదేశించారు. దుర్గగుడి అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సోమవారం ఉదయం ఆయన రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చారు.

07/05/2016 - 02:30

పాతబస్తీ, జూలై 4: నగరంలో అభివృద్ధి పేరిట హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతోందని ప్రతిఘటించిన హిందూ ధర్మ పరిరక్షణ సమితి వ్యూహం ఫలించింది. సోమవారం సాయంత్రం పాతబస్తీ కెనాల్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులుగా ఆలయాలను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కామినేని శ్రీనివాసరావుని విశ్వహిందూ పరిషత్ వారు ఘెరావ్ చేయడంతో సభ మధ్యలోనే ఆయన వెళ్లిపోయారు.

07/05/2016 - 02:29

విజయవాడ (బెంజిసర్కిల్), జూలై 4: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన తెలుగు ఇంజనీర్ సాయిశ్రీనివాస్‌ను కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా విడిపించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు.

07/05/2016 - 02:26

పద్మనాభం,జూలై 4 : ఎందరో మహానుబావులు ప్రాణత్యాగం చేసి సంపాదించిన స్వాతంత్య్ర స్ఫూర్తి గొప్పదని, దానిని నేటి బాలల్లో నింపాలని కేంద్ర విమాన యానశాఖ మంత్రి పి.అశోకగజపతిరాజు అధికారులు, పెద్దలను కోరారు. సోమవారం పాండ్రంగి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనర్శింహరాజు, సర్పంచ్ వజ్రకుమార్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి 119వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/05/2016 - 02:25

విశాఖపట్నం, జూలై 4: ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సమాచార, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. నగరంలోని కోటవీధి షాదీఖానాలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అర్హులైన ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా కింద నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.710 కేటాయించామన్నారు.

07/05/2016 - 02:25

విశాఖపట్నం, జూలై 4: ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని విఎస్ కృష్ణా గ్రంథాలయం దాదాపు దశాబ్ద కాలంగా శాశ్వత ప్రాతిపదికన లైబ్రేరియన్ నియామకానికి నోచుకోలేదు. వివిధ విభాగాలకు చెందిన ఆచార్యులను తాత్కాలిక ప్రాతిపదికన ఇన్‌ఛార్జిలుగా నియమిస్తూ ఎయు అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఎయు లైబ్రరీలో దాదాపు 5.2 లక్షల పుస్తకాలు ఉన్నాయి.

07/05/2016 - 02:24

విశాఖపట్నం, జూలై 4: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) పరిధిని పెంచుతూ విశాఖ మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (విఎండిఆర్‌ఎ)గా చేసినప్పటికీ ఇందుకు సంబంధించిన వివిధ అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం జరుగనున్న బోర్డు సమావేశంలో ఇందుకు సంబంధించిన వివిధ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వుడా పరిధిని రాజాం నుంచి తుని వరకూ విస్తరించడం తెలిసిందే.

07/05/2016 - 02:24

విశాఖపట్నం, జూలై 4: రైల్వే పింఛనుదారులకు మరింత సౌలభ్యంగా ఉండే విధంగా తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు మండలం పరిధిలో ప్రత్యేక సౌకర్యాన్ని సోమవారం డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ ప్రారంభించారు. దీంతో జీవన ప్రమాణ కేంద్రం అందుబాటులోకి వచ్చినట్టు అయ్యింది.

07/05/2016 - 02:23

జగదాంబ, జూలై 4 : నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం కాలినడకన సత్యం జంక్షన్, గాంధీనగర్, మద్దిలపాలెం కూడలిలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో చెత్త వుండటం, డ్రైయిన్లలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవడం పట్ల కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Pages