S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 02:08

ఒంగోలు అర్బన్, జూలై 4 : ఒంగోలులోని టిటిడి కల్యాణ మండపంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో కంచిపీఠం స్వాములు జయేంద్ర సరస్వతి మహాస్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆగమన ఆహ్వానానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం మంత్రి శిద్దా రాఘవరావు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మూడు రోజుల పాటు స్వామి వార్లు అందుబాటులో ఉండి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.

07/05/2016 - 02:07

ఒంగోలు, జూలై 4: జిల్లాలోని 13 మండలాల్లో భూగర్భజల మట్టాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు.

07/05/2016 - 02:05

నెల్లూరు కలెక్టరేట్, జూలై 4: మతోన్మాదాన్ని అంగీకరించటమే జాతీయవాదమైతే అది ఫాసిస్ట్ చర్య అవుతుందని విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకులు జి కల్యాణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్‌హాలులో సోమవారం విరసం 46వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పురోగతి శ్రామికుల శ్రమతోనే ఇమిడి ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలన్నారు.

07/05/2016 - 02:05

నెల్లూరు కలెక్టరేట్, జూలై 4: గిరిజనులను ఏకం చేసి వారి హక్కుల కోసం, భారత దాస్య శృంఖలాలను చేధించటం కోసం అహర్నిశం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజని ఎజెసి సాల్మన్ రాజ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ భవన్‌లో సోమవారం సీతారామరాజు 120వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

07/05/2016 - 02:04

ముత్తుకూరు, జూలై 4: మండలంలోని నేలటూరు గ్రామ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఎపి థర్మల్ కేంద్రంలో సోమవారం జరిగిన ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే కార్మికుడు మృతి చెందాడు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరుకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు థర్మల్ కేంద్రంలోని ఐఎన్‌సి కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు.

07/05/2016 - 02:04

వేదాయపాళెం, జూలై 4: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ విద్యాసంవత్సరానికి గాను జూలై 1వ తేది నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలుపరచాలని రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. బయోమెట్రిక్ విధానం వల్ల విద్యార్థుల హాజరు ఆధారంగా బోధన రుసుముల చెల్లింపుల పథకం అమలు జరుగుతోంది.

07/05/2016 - 02:03

నెల్లూరు, జూలై 4: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖలో విస్తృతంగా వినియోగిస్తున్నందు వల్ల నేరాలను గణనీయమైన స్థాయిలో అదుపులో ఉంచగలుగుతున్నామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోఏర్పాటైన వివిధ పోలీస్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/05/2016 - 02:02

నెల్లూరు, జూలై 4: రైతుల పేరుతో రాచర్లపాడు కిసాన్ సెజ్ నిర్వాహకులు భూ దందాకు పాల్పడుతున్నారని జిల్లా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

07/05/2016 - 02:02

నెల్లూరు, జూలై 4: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొక్కలు నాటడానికి సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జానకి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వన మహోత్సవంపై కలెక్టర్ జానకి సమీక్షించారు.

07/05/2016 - 01:59

కర్నూలు, జూలై 4 : రాష్ట్రంలోని ప్రజల సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటింటి సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వే అనంతరం రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతివ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం వద్ద ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

Pages