S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 21:18

కంసుడి మంత్రులలో ఒకడైన పృథుడనే రాక్షసుణ్ణి, అతడి కొడుకైన అసిరోముడితోసహా వధించాడు. నరరూప ధరుడైన విరూపాక్షుడైన రాక్షసుణ్ణి, వాడి మదపుటేనుగైన ఐరావణంతో సహా రూపుమాపాడు. హిమశైల వాసులై లోకోపకారానికి తలపెట్టిన మైంద, ద్వివిదులనే వానరులను శిక్షించాడు.

07/03/2016 - 21:15

జీవకోటిలో మానవ జన్మ సుకృతమైనది. దీన్ని మరిచిన కొందరు స్వార్థానికి ఇచ్ఛ వచ్చినట్లు మాట్లాడుతూ తాము కోరిన పనులు చేస్తుంటారు. దానివల్ల ఇతరులు కష్టపడతారనో లేక ఇతరులకు నష్టం వాటిల్లుతుందనో విషయాన్ని గ్రహించరు. దీనివల్ల ఆ పని చేసేవారికి పాపమొస్తుందని తలంపే ఉండదు. పాపాభీతి ఉండడం దైవం పట్ల నమ్మకం ఉంటే వారు తప్పక పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు.

07/03/2016 - 21:11

ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తున్న ‘జనతాగ్యారేజ్’ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ఈనెల 6న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయడానికి యూనిట్ ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆడియో విడుదల తేదీని కూడా ఖరారు చేశారు.

07/03/2016 - 21:09

‘నేను శైలజ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ తన తదుపరి చిత్రాలకు జోరు పెంచాడు. ప్రస్తుతం ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నాడు.

07/03/2016 - 21:08

సౌత్‌లో పాపులర్ హీరోయిన్‌గా మారిన నయనతార ఈమధ్య కోలీవుడ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. అందుకే ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా కూడా కాదని తమిళంలోనే వరుస సినిమాలు చేస్తోంది. మరోవైపు జోరుగా ప్రేమాయణం సాగిస్తున్న నయనతార వ్యవహారంపై కొన్ని రోజులుగా ప్రచారం సాగుతూనే వుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఈమె ప్రేమలో పడిందని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.

07/03/2016 - 21:06

ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ పతాకాలపై వెంకట్ తలారి, రాము తాళ్లూరి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా రీరికార్డింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..

07/03/2016 - 21:04

అల్లరి నరేష్ హీరోగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో గోపీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ‘సెల్ఫీరాజా’ చిత్రం ఈనెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఆసక్తికరమైన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లపై అంతటా క్రేజ్ నెలకొంది.

07/03/2016 - 21:02

నూతన తారలతో చక్రం క్రియేషన్స్ పతాకంపై సురేష్ కె.వి. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అవసరానికో అబద్ధం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ ట్రైలర్ విడుదల చేసి వౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా విజయవంతం కావాలని, తాము రూపొందించిన ‘స్వయంవరం’ చిత్రం కూడా అలాగే హిట్ అయిందని అన్నారు. నిజమని నువ్వు నమ్మేదానిని, నిజమని నీకు చెప్పింది ఎవరు?

07/03/2016 - 21:01

కిరణ్, వర్ధన్, ఫణిప్రకాష్ ప్రధాన తారాగణంగా దయా పిక్చర్స్, శ్రీనాథ్ ఫ్రెండ్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘జిందగీ’. కె.దయాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో వి.చంద్రశేఖర్‌తో కలసి ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక నాయకుడు నారాయణస్వామి ఆడియోను విడుదల చేశారు.

07/03/2016 - 20:59

దక్షిణాదిలో టాప్ హీరోయిన్ల రేసులో ఉన్న తమన్నాకు ఈమధ్య క్రేజీ సినిమా అవకాశాలు అందివస్తున్నాయి. ఇటీవలే ‘ఊపిరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమన్నా ప్రస్తుతం ‘అభినేత్రి’ అనే భారీ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

Pages