S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 20:58

ఒక్కో సినిమాతో టాలీవుడ్‌లో తనదైన ఇమేజ్‌ను పెంచుకుంటోంది గ్లామర్ భామ రెజీనా. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రెజీనాపై రూమర్స్ కూడా ఎక్కువయ్యాయి. ఈమధ్య ఆమె బికినీ వేస్తుండడంతో మీడియాలో తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన రెజీనా నేను తాజాగా నటిస్తున్న కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాకోసం దర్శకుడు ఒక్కసారే బికినీ వేయడానికి ఏమైనా అభ్యంతరమా అని అడిగాడని చెప్పింది.

07/03/2016 - 19:37

విజయవాడ:కృష్ణా పుష్కరాలకోసం చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న ఆతృతలో అధికారులు చేసిన పొరపాటు ఫలితంగా కొన్ని ఆలయాల కూల్చివేత జరిగిందని, ప్రభుత్వం ఆలయాల కూల్చివేత చేపట్టాలని నిర్ణయించలేదని మంత్రుల బృందం స్పష్టం చేసింది. పట్టణంలో శనీశ్వర, దక్షిణముఖ ఆంజనేయ, విజయేశ్వర ఆలయాల కూల్చివేతతో బిజెపి సహా స్థానిక నేతలు, ప్రజలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించింది.

07/03/2016 - 16:35

విజయవాడ:విజయవాడలో సోమవారం జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ 8వ తేదీకి వాయిదాపడింది. కాగా అమరావతిలో అభివృద్ధిని వైకాపా అడ్డుకుంటోందని మంత్రి నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని, భవనాలు కూలిపోతున్నాయని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

07/03/2016 - 16:34

భద్రాచలం:ఎగువున ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత నదుల్లో వరద పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరికి నీటిప్రవాహం వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి 18 అడుగుల నీటిమట్టం ఉండగా ఆదివారం మధ్యాహ్నానికి అది 28 అడుగులకు పెరిగింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల వరదనీరు పెరుగుతోంది. ఒకటిరెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

07/03/2016 - 16:34

హైదరాబాద్:బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని, అంతవరకు నిలిపివేస్తామని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. నగరంలోని లకడీకాపూల్‌లో సమావేశమైన వీరు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారంవరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని, ఆ రోజు మరోసారి సమావేశమైన తాజా నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు.

07/03/2016 - 16:33

లాయర్ల సమ్మె విరమిస్తేనే జోక్యం
స్పష్టం చేసిన సిజెఐ

07/03/2016 - 16:32

ముంబై:్భరత్‌లో క్రికెట్‌కోసం పనిచేస్తున్న సంస్థలన్నీ సాఫీగా, క్రమబద్ధంగా పనిచేసేలా చూడాలని భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ అనిల్‌కుంబ్లే భావిస్తున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు.

07/03/2016 - 16:31

బాగ్దాద్:ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రద్దీగా ఉండే రెండు మార్కెట్లలో బాంబు పేలుళ్లకు పాల్పడి పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం కలిగించారు. రంజాన్ పవిత్రమాసం సందర్భంగా భోజనాలు చేస్తున్నవేళ వారు ఈ దాడికి తెగబడ్డారు. నిత్యం రద్దీగా ఉండే కరద, షల్లాల్ మార్కెట్లలో వారు బాంబు దాడులు చేశారు.

07/03/2016 - 08:23

నిడదవోలు, జూలై 2: స్కూలు బస్సు ఢీకొని రెండు సంవత్సరాల పాప మృతిచెందిన ఘటన మండలంలోని ఉనకరమిల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉనకరమిల్లి గ్రామంలో సింగంశెట్టి మణికంఠ, ప్రశాంతి దంపతుల కుమార్తె దేవి లక్ష్మీ శరణ్య (4) మండలంలోని తిమ్మరాజుపాలెంలో ఎంసిఎస్ పాఠశాలలో ఎల్‌కెజి చదువుతోంది.

07/03/2016 - 08:23

పెరవలి, జూలై 2: పశువధశాలకు కంటైనరు వ్యానులో అక్రమంగా తరలిస్తున్న యాభై గోవులను గోరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని పోలీసుల సహకారంతో గోశాలకు తరలించారు. జాతీయ రహదారి పెరవలి వద్ద శనివారం ఒక వ్యానులో గోవులను రవాణా చేస్తుండగా గోరక్షణ సమితి సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాసు మరికొంత మంది అడ్డుకుని పోలీసుల సహకారంతో నల్లజర్ల మండలంలోని అవపాడు గోశాలకు తరలించారు.

Pages