S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 23:25

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 29: రవాణ శాఖ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ బస్టాండు ఆవరణలో నూతనంగా వచ్చిన కొత్త బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రూ.1.16కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాంతీయ రవాణశాఖ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.

04/29/2016 - 23:24

ధన్వాడ, ఏప్రిల్ 29: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంకుడు గుంతల పథకంలో ధన్వాడ మండలంలో ప్రచార ఆర్భాటం.. ఆచరణలో శూన్యంగా మారింది. నేటికి ధన్వాడ మండంలో 500ల ఇంకుడు గుంతలు కూడా పూర్తి చేయలేకపోవడం విడ్డురంగా ఉందని ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు.

04/29/2016 - 23:23

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 29: రాష్ట్రానికి 130 ఆర్టీసీ కొత్త బస్సులను అందుబాటులోకి తేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో డిపోకు వచ్చిన కొత్త బస్సులతో పాటు రూ.1.16 కొట్లతో నిర్మించిన ఆర్టీఏ కార్యాలయ నూతన భవనం ప్రారంభానికి మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

04/29/2016 - 23:23

గోపాల్‌పేట, ఏప్రిల్ 29: పూర్వ కాలంలో చెరువుల దగ్గర రైతులకు సాగునీరు పారించే నీరేడుగామారి ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి సాగునీరందించి రైతులను కాపాడుకుంటానని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

04/29/2016 - 23:20

మెదక్, ఏప్రిల్ 29: ఎండలు తీవ్రరూపం దాల్చాయి. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. శుక్రవారం 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 28.6 నమోదు అయినట్లు మెదక్ డివిజన్ ఇరిగేషన్ శాఖ వాతావరణ పరిశీలకులు రాములు తెలిపారు.

04/29/2016 - 23:19

వెల్దుర్తి, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసమే పని చేస్తుందని రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకోసం గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండలంలోని దామరాంచ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన రైతుల నుద్దేశించి మాట్లాడారు.

04/29/2016 - 23:19

పాపన్నపేట, ఏప్రిల్ 29: కాంగ్రెస్ పార్టీతో పాటు గత పాలకుల వల్లె బీభక్షమైన కరువు ఏర్పడిందని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి, మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్‌పేట గ్రామ బస్టాండ్ ప్రధాన కూడలి చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పద్మాదేవేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.

04/29/2016 - 23:18

గజ్వేల్, ఏప్రిల్ 29 : రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆర్థికంగా ప్రయోజనం పొందాలని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో పిఎసిఎస్ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

04/29/2016 - 23:18

జిన్నారం, ఏప్రిల్ 29: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఊట్ల, నల్తూర్, గడ్డపోతారం, గుమ్మడిదల, నల్లవల్లి గ్రామాలలో మిషన్ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయమ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ఆర్ధికంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. రాబోవు వర్షాకాలంలో చెరువుల సామర్ధ్యం పెరిగి నిండుతాయన్నారు.

04/29/2016 - 23:17

ములుగు, ఏప్రిల్ 29 : ములుగు మండలంలోని బస్వాపూర్ జమాలకుంట 21 లక్ష 95 వేలు, అగర్రావుపల్లిలో రామకుంట 24లక్షల 33 వేలు రెండవ విడుత మిషన్ కాకతీయ పనులను మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరవులు బాగుంటేనే రైతులు బాగుపడతారని అప్పుడే గ్రామాలు అభివృద్ది చెందుతాయని ఆయన పేర్కొన్నారు.

Pages