S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 23:51

భీమవరం, ఏప్రిల్ 29: జిల్లాలో ఎంసెట్- 2016 పరీక్ష ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. భీమవరం పట్టణంలోని డియన్నార్ కళాశాల క్యాంపస్‌లో 3, బివి రాజు క్యాంపస్‌లో 4, ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు.

04/29/2016 - 23:51

ఏలూరు, ఏప్రిల్ 29: ‘‘ అతనో పెళ్లికాని యువకుడు. భీమవరంలో ఒక సెల్‌ఫోన్ షాపులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. సరదాగా క్రికెట్ బెట్టింగ్‌లు కట్టడం ప్రారంభించాడు. పూర్తిగా నష్టపోయాడు. గతంలో ఇలాగే బెట్టింగ్‌లు కట్టి దాదాపు 15లక్షల రూపాయలు కోల్పోతే తండ్రి అప్పు చేసి ఆ మొత్తాలను తీర్చాడు. మళ్లీ అదే పరిస్దితి ఎదురుకావటంతో ఏం చేయాలో తెలియక రైలు కింద పడి ప్రాణాలు విడిచాడు’’. ఇది ఒక యువకుని కధ మాత్రమే.

04/29/2016 - 23:48

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అధికార పక్షం వైపు ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ తుడిచిపెట్టుకునిపోగా, ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వరుస పెట్టి చేర్చుకుంటూ సంఖ్యాపరంగా బలపడుతోంది.

04/29/2016 - 23:43

అగస్త్యుడు ఒక భారతీయ ఋషి. ఈయన సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లి అక్కడ భారతీయ సంస్కృతిని ప్రచారం చేశాడు. ఆయన పేరు తర్వాతి కాలంలో రోమన్ చక్రవర్తులు పెట్టుకున్నారు. అగస్టీన్ పేరుమీద ఆగస్టు నెల ఏర్పడింది! దేశ విదేశాలలో అగస్టా వంటి సంస్థలు ఏర్పడ్డాయి. మెకానికా ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ అగస్టా ఛాపర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ. దీని కేంద్ర కార్యాలయం ఇటలీలో ఉంది. ఎ.కె.

04/29/2016 - 23:42

అంతర్జాతీయంగా,మత్తు పదార్థాలకు మనదేశం అతి పెద్ద వాణిజ్య కేం ద్రంగా మారింది. గంజాయి, నల్లమందు, గుడుంబా, హెరాయిన్, కొకైన్, చరస్ పేర్లు ఏవైనా వాటికి యువత బానిసలుగా మారిపోతున్నారు. మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, క్రయ విక్రయాలు, రవాణా, వాటి వాడకం పెచ్చుమీరి అదో పెద్ద వ్యాపార రంగంగా ఆవిర్భవించి మాదక ద్రవ్యాల మాఫియా దేశంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుందంటే ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

04/29/2016 - 23:41

ఏప్రిల్ 23న ఎంవిఆర్ శాస్ర్తిగారు తన ‘ఉన్నమాట’లో మత సంప్రదాయాలపై చక్కగా విశే్లషించారు. కోర్టులు విపరీతంగా స్పందిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. అయతే ప్రభుత్వాధికార్లు ఇందుకు తక్కువ తినలేదు. అయన వాళ్లకు ఆకుల్లోను, కానివాళ్లకు కంచాల్లోను అన్న అన్న నానుడిని కచ్చితంగా నిజం చేస్తున్నారు.

04/29/2016 - 23:38

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలోని ‘కెబిఆర్’ పార్కు ప్రాంగణంలోని దాదాపు రెండువందల డెబ్బయి పచ్చని చెట్లను పరిమార్చడానికి రంగం సిద్ధం కావడం ప్రతీక మాత్రమే. విస్తృత హైదరాబాద్ మహానగర పాలిక-జిహెచ్‌ఎంసి-వారు ఆర్భాటంగా అమలు జరుపున్న వ్యూహాత్మక పథ ప్రగతి ప్రణాళిక-ఎస్‌ఆర్‌టిసి-కు దాదాపు మూడువేల వంద మహావృక్షాలు బలి కానుండడం పెద్దగా ప్రచారానికి నోచని వైపరీత్యం.

04/29/2016 - 23:33

చిట్యాల, ఏప్రిల్ 29: వడదెబ్బకు వృద్ధురాలు మృతిచెందిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చిట్యాలకు చెందిన జంపాల లక్ష్మమ్మ(59) ఎండల వేడిమికి ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో తట్టుకోలేక అస్వస్థకు గురై వడదెబ్బకు గురై మృతిచెందింది.

04/29/2016 - 23:33

ఆత్మకూర్(ఎస్), ఏప్రిల్ 29: మండలపరిధిలోని గట్టికల్ గ్రామంలో వచ్చే నెల 1 వ తేదీ నుంచి 3 వరకు లింగమంతులస్వామి జాతర నిర్వహించనున్నారు. ఈ జాతరకు నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి యాదవ భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. అలాగే గట్టికల్ గ్రామంలోని అన్ని కులస్తులు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

04/29/2016 - 23:32

సూర్యాపేట, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండను తక్షణమే కరవు జిల్లాగా ప్రకటించి యుద్ద ప్రాతిపధికన కరవు సహాయక చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వర్‌రావు డిమాండ్‌చేశారు. శుక్రవారం స్థానిక చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంఘం జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.

Pages