S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2016 - 00:20

గుడివాడ, ఏప్రిల్ 29: అధికార పార్టీ నాయకుల అక్రమాలను కొంతమంది పోలీసులు ప్రోత్సహిస్తున్నారని, అందువల్లే పోలీసులంటే ప్రజలకు నమ్మకం కలగడం లేదని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నందివాడ పోలీస్‌స్టేషన్ పనితీరు సరిగాలేదని తాలూకా సీఐ దృష్టికి తీసుకువచ్చానని, ఎస్‌ఐపై గుడివాడ డిఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.

04/30/2016 - 00:19

మైలవరం, ఏప్రిల్ 29: జిల్లాలో తాగునీటి ఎద్దడిని తక్షణమే నివారించేందుకు గానూ ఆర్‌డబ్ల్యుఎస్ నిధులు మూడు కోట్ల రూపాయలు మంజూరైనట్లు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

04/30/2016 - 00:18

గన్నవరం, ఏప్రిల్ 29: ప్రభుత్వ పాఠశాలలకు ప్రజల్లో, తల్లిదండ్రుల్లో ఆదరణ తగ్గలేదనడానకి ఈ పాఠశాల ఉదహరణంగా పేర్కొనవచ్చు. ఉపాధ్యాయుల కృషికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి మారుపేరుగా ఇప్పటికే 93 మంది విద్యార్థులను ప్రైవేట్ స్కూల్స్ నుంచి వెనక్కి రప్పించారు.

04/30/2016 - 00:18

పెనమలూరు, ఏప్రిల్ 29: విజయవాడ రీజియన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 6 గంటలకు కాకినాడ జెఎన్‌టియులో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన జి 2 కోడ్‌తో ఉన్న ప్రశ్నాపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. మెడికల్‌కు చెందిన ఎల్ 2 కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఉదయం 9 గంటలకు మరో మంత్రి కామినేని శ్రీనివాసరావు ఎంపిక చేశారు.

04/30/2016 - 00:17

పెనమలూరు, ఏప్రిల్ 29: ఒకవైపు ఎంసెట్, మరోవైపు రెసిడెన్షియల్ విద్యార్థుల ఇళ్లబాట, వీటికి తోడు శుభముహూర్తాల చివరిరోజు కావడంతో పెళ్లిళ్లు వెరసి శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు బందరురోడ్డు వాహనాల రద్దీతో హోరెత్తింది.

04/30/2016 - 00:17

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 29: పుష్కర యాత్రికుల సౌకర్యమే ప్రధాన ప్రాతిపదికగా అమ్మవారి దర్శనానికి వచ్చే పుష్కర భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా ఇంద్రకీలాద్రి కొండపై భాగంలో భద్రతతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టడటం జరుగుతోందని జిల్లా కలెక్టర్ బాబు ఎ, అదనపుపోలీస్ కమిషనర్ మహేష్ లడ్డాలు పేర్కొన్నారు.

04/30/2016 - 00:16

మచిలీపట్నం, ఏప్రిల్ 29: మచిలీపట్నం పురపాలక సంఘం నూతన భవన నిర్మాణానికి శనివారం ముచ్చటగా మూడవసారి శంకుస్థాపన జరగనుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారి శంకుస్థాపన జరగ్గా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గత తొమ్మిది రోజుల క్రితం ఎటువంటి శంకుస్థాపన చేశారు. ఎటువంటి అర్భాటం లేకుండా ఈ నెల 22వతేదీన మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ శంకుస్థాపన చేశారు.

04/30/2016 - 00:15

విజయవాడ, ఏప్రిల్ 29: అంగన్‌వాడీ కేంద్రాలకు చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువులను తప్పనిసరిగా ఇ-పోస్ విధానం ద్వారానే పొందాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు.

04/30/2016 - 00:15

విజయవాడ కల్చరల్, ఏప్రిల్ 29: ప్రపంచ దేశాలలో భారతీయ నృత్యశైలి విశిష్టమైనదని పలువురు ప్రముఖులు అన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీశివరామకృష్ణక్షేత్ర శ్రవణ సదన వేదికపై అమ్మఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమి, తెలుగు కళావాహిని, ఆంధ్రఆర్ట్స్ అకాడమిల సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరిగింది.

04/30/2016 - 00:14

విజయవాడ, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మొట్టమొదటిసారి అధిరాత్ర మహా యాగం జరపాలని సంకల్పంతో తపస్వి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మే 19న కృష్ణా నది ఒడ్డున అమరావతి కట్ట రోడ్ మొదటిలో గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో సన్నాహాలు మొదలయ్యాయి. అధిరాత్రలో ముఖ్యమైనది యాగశాల, గురుడాకారంలో ఉంటున్న యాగశాల నిర్మాణం శుక్రవారం ప్రారంభించారు.

Pages